Khushi Movie: సమంత లేకుండానే ఖుషీ ప్రమోషన్ ..భయంలో నిర్మాతలు
సమంత లేకుండానే రాష్ట్రాలు చుట్టేస్తున్న రౌడీ హీరో.

Hero Vijay Deverakonda is doing Khushi promotions without Samantha
ఇక ఖుషీ ప్రమోషన్ అంతా సోలోగానే సాగుతుంది. సమంత లేకుండా.. విజయ్‌దేవరకొండ ఒక్కడే ఇండియా మొత్తం తిరగనున్నాడు. ఈ ఇద్దరూ జంటగా నటించిన ఖుషీ సెప్టెంబర్ 1న పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతోంది. కానీ.. ప్రమోషన్‌లో సందడి చేసే సమంత మాత్రం కనపించడం లేదు. ఖుషీ రిలీజ్‌కు ఇంకా 10 రోజులే వుంది. కానీ సమంత ఏమో అమెరికాలో.. రౌడీ హీరోనేమో కోయంబత్తూర్‌లో వున్నాడు. తెలుగులో జరిగిన మ్యూజిక్ కన్సర్ట్‌లో సామ్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ఈ ఇద్దరూ చేసిన డ్యాన్స్ ప్రమోషన్‌లో ఓ రొమాంటిక్ మార్క్‌గా మిగిలిపోయింది.
మయోసైటిస్ ట్రీట్‌మెంట్ కోసం సామ్ అమెరికా వెళ్లింది. న్యూయార్క్‌లో జరిగిన ఇండియా డే పరేడ్’లో సామ్ పాల్గొన్న వీడియో వైరల్ అవుతోంది. ఆధ్యాత్మిక గురువు శ్రీ రవిశంకర్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. సామ్ మాట్లాడుతూ.. ఈ క్షణాలు నా మదిలో జీవితమంతా నిలుస్తుందని.. ఈ అరుదైన గౌరవం దక్కేలా చేసిన వారికి థ్యాంక్స్ తెలిపింది. ట్రీట్‌మెంట్ కోసం సామ్ అమెరికా వెళ్ళగా.. రౌడీ హీరో ఒక్కటే ఖుషీ ప్రమోషన్ కోసం తమిళనాడులోని కోయంబత్తూర్ స్పెషల్ ఫ్లైట్‌లో వెళ్లాడు. ఆతర్వాత కేరళ.. కర్నాటక చుట్టి రానున్నాడు. విజయ్‌దేవరకొండకు యూత్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చినా.. పక్కనే సామ్ లేని లోటు ప్రమోషన్‌లో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. సినిమా రిలీజ్ తర్వాత సామ్ అమెరికా వెళ్లి ఉంటే సినిమా ప్రమోషన్‌కు ప్లస్ అయ్యేది.