Vijay Devarakonda: రౌడీ అల్లుడు.. రౌడీ మొగుడు.. రౌడీ ప్రియుడు.. విజయ్ షాకింగ్ నిర్ణయాలు..
విజయ్ దేవరకొండ తన కెరీర్ కి లైగర్ తో జరిగిన డ్యామేజ్ ని రిపేర్లు చేసేందుకు, రౌడీ అల్లుడిగా మారుతున్నాడు. రౌడీ మొగుడిగా బిజీ కాబోతున్నాడు. ఇక రౌడీ ప్రియుడిగా ఆల్రెడీ బిజీ అయ్యాడు.

Vijay Devarakonda Try to Connecting To The Youth This Type Of movies planing
రౌడీ ఎక్కడైనా రౌడీనే కాని, జోనర్లు మారిస్తే ఆ మూవీ ఫ్లేవరే మారిపోతుంది. అందుకే క్లాస్, మాస్, ఫ్యామిలీ డ్రామాలతో అందరికీ దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడు విజయ్. అర్జున్ రెడ్డి మాస్ తోపాటు యూత్ కి నచ్చింది. గీతా గోవిందం ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. అందుకు ఇప్పడు ఇలాంటి ప్రయత్నం మరో సారి చేయబోతున్నాడు.
ఆల్రెడీ ఖుషీ అంటూ సమంతతో జోడీ కట్టి క్లాస్ ఆడియన్స్ ని, యూత్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న విజయ్, గౌతమ్ తిన్ననూరి మూవీతో మాస్ ని టార్గెట్ చేశాడు. పోలీస్ గా మారి విలన్ కి రౌడీ అల్లుడిగా కనిపించబోతున్నాడు. విలన్ కూతుర్ని ప్రేమలో పడేసే రౌడీ డీఎస్పీ రోల్ లో కనిపిస్తాడ విజయ్. ఇలా మాస్ ని ఎట్రాక్ట్ చేస్తూనే పరశురామ్ మేకింగ్ లో గీతా గోవిందం లాంటి మరో ఫ్యామిలీ డ్రామాకి సై అన్నాడు. అందులో శ్రీలీలకి విజయ్ భర్తగా కనిపిస్తాడట. ఇలా ఖుషీలో రౌడీ ప్రియుడు, గౌతమ్ తిన్ననూరి మూవీలో విలన్ కి రౌడీ అల్లుడు, పరశురామ్ మూవీలో హీరోయిన్ కి రౌడీ మొగుడిగా మూడు అవతారాలెత్తుతున్నాడు విజయ్.