Hero Vikram: భయ్యా ఇదేం ట్రాన్స్ఫర్మేషన్.. తంగలాన్ మేకింగ్ వీడియో రిలీజ్.. విక్రమ్ ని చూసి భయపడాల్సిందే

స్టార్ హీరో చియాన్ విక్రమ్ సినిమాల కోసం ఎలాంటి ఎఫర్ట్ అయినా పెట్టాడానికి రెడీ అయిపోతారు. సినిమా సినిమాకి కథకు తగ్గట్టు గెటప్స్ వేస్తూ, తన నటనతో కూడా అందర్నీ మెస్మరైజ్ చేస్తాడు . విక్రమ్ సినిమాలు ఫెయిల్ అయినా నటుడిగా మాత్రం విక్రమ్ ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 17, 2023 | 04:00 PMLast Updated on: Apr 17, 2023 | 4:00 PM

Hero Vikram Tangalan Making Video Release

ఇటీవల కొన్ని రోజుల క్రితం కోబ్రా సినిమాలో కూడా 10 గెటప్స్ వేసి అలరించాడు. త్వరలో విక్రమ్ నటించిన పొన్నియిన్ సెల్వన్ 2 రిలీజ్ కాబోతుంది.పొన్నియిన్ తర్వాత విక్రమ్ తంగలాన్ సినిమాతో రాబోతున్నాడు. పా రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా పార్వతి, మాళవిక మోహనన్ ఫిమేల్ లీడ్స్ లో కొన్ని వందల ఏళ్ళ క్రితం కోలార్ బంగారు గనుల కార్మికుల జీవిత కథల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. గతంలోనే ఈ సినిమా నుంచి వచ్చిన విక్రమ్ లుక్ ని చూసి అంతా ఆశ్చర్యపోయారు.

మరోసారి సినిమా కోసం విక్రమ్ చాలా చేంజ్ అవుతున్నాడని తెలుస్తుంది. తాజాగా నేడు విక్రమ్ పుట్టిన రోజు సందర్భంగా తంగలాన్ సినిమా నుంచి మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు మూవీ యూనిట్.ఈ మేకింగ్ వీడియోలో విక్రమ్ ఎలా చేంజ్ ఓవర్ అయ్యాడు, ఎలా మేకప్ వేసుకున్నాడు. తన పాత్ర కోసం ఎలా రెడీ అయ్యాడో చూపించారు. విక్రమ్ తో పాటు అతని చుట్టూ పక్కల ఉన్నవాళ్ళని కూడా చూపించారు. అలాగే షూటింగ్ ని అడవుల్లో, నీళ్ళల్లో, రాళ్ళల్లో ఎలా తీస్తున్నారు, యుద్ధ సన్నివేశాలను ఎలా తీశారో చూపించారు.

ఈ వీడియోలో విక్రమ్ లుక్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక కొంతమంది అయితే మేకింగ్ వీడియోనే విక్రమ్ లుక్ తో భయపెడుతుంటే ఇక సినిమాలో నటనతో ఏ రేంజ్ లో భయపెడతాడో అని కామెంట్స్ చేస్తున్నారు. తన సినిమా కోసం, సినిమాలోని పాత్ర కోసం 57 ఏళ్ళ వయసులో కూడా విక్రమ్ ఈ రేంజ్ లో కష్టపడుతున్నాడంటే హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే అంటూ విక్రమ్ ని అభినందిస్తున్నారు.