Hero Yesh: రావణుడిగా రాఖీ భాయ్ !?

కేజీఎఫ్‌ సినిమాతో బాక్సాఫీస్‌ బద్దలు కొట్టిన హీరో యష్‌. ఒకే ఒక్క సినిమా యష్‌ను పాన్‌ ఇండియా స్టార్‌ను చేసింది. యష్‌ మాస్‌ కటౌట్‌కు ఇండియా దాసోహం ఐపోయింది. కేజీఎఫ్‌లో ఎలివేషన్‌ సీన్స్‌కు థియేటర్స్‌లో సీట్లు పగిలిపోయాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 9, 2023 | 12:15 PMLast Updated on: Jun 09, 2023 | 12:15 PM

Hero Yesh Ravanasura Charector In Bollywood Ramayana Movie

మాస్‌ ఆడియన్స్‌ను ఆ రేంజ్‌లో అలరించిన యష్‌ ఇప్పుడు అవతార్‌ మార్చబోతున్నాడట. బాలీవుడ్‌లో వస్తున్న మరో రామాయణం స్టోరీలో యష్‌ వారణాసురిడిగా కనిపించబోతున్నాడని టాక్‌ నడుస్తోంది. ఇప్పుడున్న టెక్నాలజీ సహాయంతో మైథలాజికల్‌ మూవీలను మరో లెవెల్‌లో తెరకెక్కిస్తన్నారు మేకర్స్‌. ఇప్పటికే ఆదిపురుష్‌ సెన్సేషన్‌ క్రియేట్‌ చేసేందుకు రెడీ అయ్యింది. ఇప్పుడు ఆ కోవలోనే మరో రామాయణం స్టోరీ కూడా రాబోతోంది. నితిష్ తివారీ డైరెక్షన్లో.. భారీ బడ్జెట్‌తో ఈ మూవీ రూపుదిద్దుకుంటోంది.

ఇక ఈ సినిమాలో రావణాసురిడిగా.. కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటిస్టున్నారనే టాక్ బీ టౌన్ నుంచి లీకై ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక రావణ సంహారం చేసే రాముడి పాత్రలో రణ్బీర్‌ కపూర్.. సీత క్యారెక్టర్లో ఆలియా భట్ కన్ఫర్మ్ అయ్యారనే టాక్ కూడా బీ టౌన్లో జోరుగా వినిపిస్తోంది. రణ్బీర్ ఆలియా.. రీసెంట్‌గా డైరెక్టర్ నితిష్ తివారీని కలిసిన ఫోటోలు వీడియోలు కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. దీంతో రావణాసురిడిగా యష్‌ కనిపించడం కూడా కన్ఫాం అంటున్నారు. రాఖీ భాయ్‌గా రఫ్ఫాడించిన యష్‌ ఇప్పుడు రావణాసురుడిగా ఎలా కనిపిస్తాడో చూడాలి.