Directors: దర్శకులుగా మారుతున్న హీరోలు..

2017లో పా పాండి సినిమా కోసం తొలిసారి మెగా ఫోన్ పట్టాడు ధనుష్. ఈ సినిమా హిట్ అవ్వడంతో ఆరేళ్ల తర్వాత రెండో సినిమాని తెరకెక్కించబోతున్నాడు. సౌత్‌లో కన్నడ స్టార్ ఉపేంద్రకు ఎంత పాపులారిటీ ఉందో, తన దర్శకత్వంలో వచ్చిన సినిమాలకు అంతే క్రేజ్ ఉంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 22, 2023 | 08:45 PMLast Updated on: Oct 22, 2023 | 8:48 PM

Heroes Becoming Directors In Tollywood Sandalwood

Directors: యాక్షన్ మాత్రమే కాదు కొందరు స్టార్స్‌లో డైరెక్షన్ చేసే టాలెంట్ కూడా ఉంటుంది. అయితే యాక్షన్ ఫ్రంట్ సీట్‌లో ఉంటే డైరెక్షన్ బ్యాక్ సీట్‌లో ఉంటుంది. ఇప్పుడు కొంతమంది హీరోలు మళ్లీ మెగా ఫోన్ పట్టుకుని మ్యాజిక్ చేసేందుకు సై అంటున్నారు. కోలీవుడ్ స్టార్ ధనుష్ ప్రజెంట్ కెప్టెన్ మిల్లర్ మూవీ చేస్తున్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ పిరియాడికల్ మూవీ చేయడానికి ఓకే చెప్పాడు. అలాగే తన కెరీర్‌లో వస్తున్న 50వ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు.

2017లో పా పాండి సినిమా కోసం తొలిసారి మెగా ఫోన్ పట్టాడు ధనుష్. ఈ సినిమా హిట్ అవ్వడంతో ఆరేళ్ల తర్వాత రెండో సినిమాని తెరకెక్కించబోతున్నాడు. సౌత్‌లో కన్నడ స్టార్ ఉపేంద్రకు ఎంత పాపులారిటీ ఉందో, తన దర్శకత్వంలో వచ్చిన సినిమాలకు అంతే క్రేజ్ ఉంది. కన్నడలో ఆయన దర్శకత్వం వహించిన ష్, ఓం, ఉపేంద్ర సినిమాలు తెలుగులో కూడా అనువాదమై ఇక్కడి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. 2015లో ఉప్పి2 తెరకెక్కించిన ఉపేంద్ర.. ఆ తర్వాత దర్శకుడిగా గ్యాప్ తీసుకున్నాడు. ఏడేళ్ల తర్వాత యూఐ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రజెంట్ సెట్స్‌పై ఉన్న ఈ సినిమా త్వరలో పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ కానుంది. కన్నడ స్టార్ సుదీప్ ఇప్పటి వరకు దర్శకుడిగా ఆరు సినిమాలు తెరకెక్కించాడు. కానీ ఈ ఆరు రిమేక్ సినిమాలే కావడం విశేషం. 2014లో మిర్చిని కన్నడలో రీమేక్ చేసిన తను దశాబ్దం తర్వాత కేకే అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమాని తెరకెక్కించబోతున్నాడు. 2024 ఫస్ట్ హాఫ్‌లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

దిల్ చాహ్ తా హై సినిమాతో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన ఫర్హాన్ అక్తర్ డాన్ సిరీస్‌తో బ్లాక్స్ బస్టర్స్ అకౌంట్‌లో వేసుకున్నాడు. డాన్ 2 తర్వాత నటుడిగా కాస్త్ బిజీ అయిన ఫర్హాన్ మరో సినిమాకి దర్శకత్వం వహించలేదు. 2021లో జి లే జరా ప్రాజెక్ట్‌ని అనౌన్స్ చేసినప్పటికీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. దీంతో సైలెంట్ అయిన ఫర్హాన్ ఇప్పుడు రణ్ వీర్ సింగ్ హీరోగా డాన్ 3 తెరకెక్కించబోతున్నాడు. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. మొత్తానికి బడా స్టార్స్ అంతా స్టార్ట్.. కెమెరా.. యాక్షన్ అంటూ తమలోని టాలెంట్‌ని సరికొత్తగా ఆవిష్కరించబోతున్నారు.