Balayya boyapati : అఖండ‌-2 కోసం హీరోయిన్ ఫిక్స్

టాలీవుడ్‌ (Tollywood)లోని క్రేజీ కాంబోల్లో ముందు వ‌ర‌స‌లో ఉండే పేర్లు బాల‌కృష్ణ‌-బోయ‌పాటి.. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ఎన్నో చిత్రాలు బాక్సాఫీస్ రికార్డుల‌ను తిర‌గ‌రాసాయి. బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ‘అఖండ’ (Akhanda) అద్భుత విజయాన్ని సాధించింది. దీంతో, ‘అఖండ 2’ (Akhanda 2) పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 24, 2024 | 11:00 AMLast Updated on: Feb 24, 2024 | 11:00 AM

Heroine Fix For Akhanda 2

టాలీవుడ్‌ (Tollywood)లోని క్రేజీ కాంబోల్లో ముందు వ‌ర‌స‌లో ఉండే పేర్లు బాల‌కృష్ణ‌-బోయ‌పాటి.. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ఎన్నో చిత్రాలు బాక్సాఫీస్ రికార్డుల‌ను తిర‌గ‌రాసాయి. బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ‘అఖండ’ (Akhanda) అద్భుత విజయాన్ని సాధించింది. దీంతో, ‘అఖండ 2’ (Akhanda 2) పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ ఎప్పుడు ప‌ట్టాలెక్క‌బోతోందా అని బాల‌య్య (Balayya) ఫ్యాన్స్‌తో పాటు కామ‌న్ ఆడియన్స్ కూడా ఎంతో ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే.. బోయపాటి శ్రీను ఇప్పటికే ‘అఖండ 2’ స్క్రిప్ట్ పూర్తి చేశాడు. జూన్ నుంచి ఈ సినిమా స్టార్ట్ కాబోతుందని తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే ఈ మూవీలో న‌టించ‌బోయే హీరోయిన్‌కు సంబంధించి ఒక లేటెస్ట్ అప్‌డేట్ వినిపిస్తోంది.

అఖండ-2 సినిమాతో బాల‌య్య బాబుకు జ‌త‌గా త్రిష జ‌త‌క‌ట్ట‌నుంద‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి. అఖండ లో ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్ గా నటించగా.. అఖండ 2 లో త్రిషని హీరోయిన్ గా లాక్ చేస్తున్నారని తెలుస్తుంది. అఖండ 2 ప్రాజెక్ట్ ని పాన్ ఇండియా లెవెల్ లో ప్లాన్ చేస్తున్నాడట బోయపాటి శ్రీను. అందుకే ఈ సినిమాకు త్రిష అయితే పర్ఫెక్ట్ అని భావిస్తున్నాడట.. ప్ర‌స్తుతానికి త్రిష.. చిరు విశ్వంభ‌ర స‌హా ప‌లు సినిమాల్లో బిజీగా ఉంది.. మ‌రి ఇప్పుడు బాల‌య్య సినిమాలో త్రిష న‌టిస్తుందో లేదో అన్న‌దానిపై అఫీషియ‌ల్ క‌న్‌ఫ‌ర్మేష‌న్ రావాల్సి ఉంది.

కాగా.. ఇంకా ప‌ట్టాలెక్క‌న‌ప్ప‌టికీ అఖండ‌-2 పై అంచ‌నాలు ఆకాశాన్నంటుతున్నాయి. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం బోయపాటి శ్రీను రాసిన కథకు.. మాటల రచయిత ఏం రత్నం డైలాగ్స్ పూర్తి చేశాడని తెలుస్తోంది. డైలాగ్స్ చాలా బాగా వచ్చాయట. ఇక ఈ కథలో సోషియో ఫాంట‌సీ ఎలిమెంట్స్ ఉంటాయట. మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉంటుందని.. బాలయ్య నుంచి మరో వినూత్న సినిమా రాబోతుందని టాక్. అలాగే, బోయపాటి మార్క్ యాక్షన్ సీన్స్ అండ్ పొలిటికల్ పంచ్ లు మాత్రం సినిమాలో ఫుల్ గా ఉంటాయని తెలుస్తోంది. ప్రస్తుతం బాలయ్య.. డైరెక్టర్ బాబీ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత బాలయ్య – దర్శకుడు బోయపాటి శ్రీను కలయికలో ‘అఖండ 2’ సినిమా రాబోతుందని టాక్..