ప్రభాస్ ఫుడ్ ఎఫెక్ట్.. పాకిస్తాన్ పారిపోయిన ఇమాన్వీ
రెబల్ స్టార్ ప్రభాస్ తో స్నేహం అంటే తిండితో చంపేస్తూ ఉంటాడని చాలామంది యాక్టర్స్ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ కామెంట్స్ చేస్తూ ఉంటారు.
రెబల్ స్టార్ ప్రభాస్ తో స్నేహం అంటే తిండితో చంపేస్తూ ఉంటాడని చాలామంది యాక్టర్స్ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. సినిమా సెట్స్ లో ప్రభాస్ ఫుడ్ బాగా ఫేమస్. గోదావరి జిల్లాలకు సంబంధించిన ప్రముఖ వంటకాలు అన్ని ప్రభాస్ వండించి మరి క్యారేజీలు పంపిస్తూ ఉంటాడు. దీనికి సంబంధించి చాలా మంది సోషల్ మీడియాలో కామెంట్ చేస్తూ ఉంటారు. గోదావరి జిల్లాలో బాగా ఫేమస్ అయిన గోంగూర రొయ్యలు, బెండకాయ రొయ్యలు అలాగే చికెన్ బిర్యానీ ఇటువంటి వాటిని ప్రభాస్ వాళ్ళ స్టైల్ లోనే వండించి తీసుకొస్తాడు.
దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలో సోషల్ మీడియాలో అప్పుడప్పుడు వైరల్ అవుతాయి. కొంత మంది నటులు ఇంటర్వ్యూలలో కూడా ఈ విషయాలను బయటపెడుతూ ఉంటారు. ప్రభాస్ ప్రేమను ఎలా తట్టుకోలేమో భోజనాన్ని కూడా అలాగే తట్టుకోలేమని కామెంట్ చేస్తారు. ఇప్పుడు ఇదే ఫీలింగ్ హీరోయిన్ ఇమాన్వి ఇస్మాయిల్ బయటపెట్టింది. ప్రస్తుతం ప్రభాస్… హను రాఘవపూడి డైరెక్షన్లో ఫౌజీ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. దీనితో హీరోయిన్ కు ప్రత్యేకంగా తయారు చేయించిన భోజనాన్ని ప్రభాస్ పంపించాడు.
అందులో వెజ్ నాన్ వెజ్ వంటకాలతో పాటుగా గోదావరి జిల్లాల స్పెషల్ ఉన్నాయి. వాటి రుచి చూసిన ఇమాన్వి ఈ భోజనం ఎంతో టేస్టీగా ఉందని పోస్ట్ పెట్టింది. దీనికి సంబంధించిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రభాస్ కు ఇది కొత్తమీ కాదు. గతంలో కూడా దీపికా పదుకొనే, కరీనాకపూర్, సైఫ్ అలీ ఖాన్, శృతిహాసన్, శ్రద్ధ కపూర్ నిధి అగర్వాల్ వంటి వాళ్లకు భోజనాల రుచి చూపించాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతోంది. ఇక ఈ సినిమా విషయానికొస్తే టైటిల్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది.
ఇక హిందీ లో కూడా ఒకేసారి షూటింగ్ చేసి ఆలోచనలో డైరెక్టర్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. రీసెంట్ గా కూడా ది రాజా సాబ్ సినిమా సెట్ లో హీరోయిన్ నిధి అగర్వాల్ కు ఇలాగే వంటలు వండి పంపించాడు ప్రభాస్. ఏకంగా హీరోయిన్ పేరెంట్స్ కూడా ఆ వంటలను బాగా ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఇమాన్విని కూడా ఇలాగే వంటలతో ప్రభాస్ ప్రేమగా ఇబ్బంది పెట్టాడు.. ఇక ప్రభాస్ సినిమాలు విషయానికి వస్తే ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత ప్రభాస్ స్పిరిట్ షూటింగ్లో పాల్గొంటాడు. మే నుంచి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత లోకేష్ కనగరాజ్ మూవీ కూడా స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఇదే టైములో కల్కి సీక్వెల్ పై కూడా ఫోకస్ పెడుతున్నాడు.