Heroines: తెగించిన హీరోయిన్లు.. రష్మిక తప్పేం లేదు..!
గ్లామరే వాళ్ల ప్రధాన పెట్టుబడి.. కాబట్టి ఆఫర్లు తగ్గినా, లేదంటే తమని గ్లామరస్ గా చూపించలేకపోయినా దర్శకులకి, ఇలా తమ ట్యాలెంట్ చూపిస్తారనే వాదన కూడా పెరిగింది. ఏదేమైనా సౌత్ ముద్దుగుమ్మలు నార్త్ కి వెళితే వాళ్ల డ్రెస్ ఐస్ లా కరిగిపోవాల్సిందే.
రష్మిక ఈమధ్య ముంబై ఈవెంట్ లోవేసిన డ్రెస్ హాట్ టాపిక్ అయ్యింది. సోషల్ మీడియాలో అయితే అంతా రష్మికను ట్రోల్ చేస్తున్నారు. అసలు డ్రెస్ వేసుకుందా? ఎందుకు వేసుకుంది..? ఇలాంటి ప్రశ్నలతో రష్మికను ఆడేసుకుంటున్నారు
ఎవరు ఏ డ్రెస్ వేసుకోవాలన్నది వాళ్ల ఇష్టం. కాకపోతే అదేంటో ఏదో మాయ చేసినట్టు సౌత్ హీరోయిన్లు, బాలీవుడ్ వెళితే అంతా ఒకే రకమైన డ్రెస్ కోడ్ వాడతారు.. ఆ డ్రెస్ కోడ్ పేరే డ్రెస్ ఉందా లేదా అన్నట్టు ధరించు.. ఇది కాస్త కామెడీగా ఉన్నా అదే నిజం. సౌత్ లో ఏ ఈవెంట్లో చూసినా, సినిమాల్లో చూసినా కూల్ గా కనిపించే తమన్నా, ఆ మధ్య ముంబై ఈవెంట్స్ లో వేసిన కురచ దుస్తులు కామెంట్స్ కి కేరాఫ్ అడ్రస్ అయ్యాయి. అంతెందుకు.. పెళ్లికి ముందు ముంబై ఈవెంట్ లో కాజల్ అగర్వాల్ తన సింగిల్ పీస్ డ్రెస్ వేస్తే అందరి టాప్ లేచిపోయింది..
ఇక పూజా హెగ్డే ఎప్పుడూ సౌత్ ఈవెంట్స్ లో, సినిమాల్లో ట్రెడిషనల్ గా కనిపించినా, గ్లామరస్ లుక్ లో కనిపించినా లిమిట్ లో ఉండేది. అదే ముంబైకెళితే, ఏ ఈవెంట్ లో చూసినా పూజా డ్రెస్ ఐస్ లా కరిగిపోతుందా అన్న అనుమానాలే వచ్చాయి. ఇలియానా గురించి చెప్పక్కర్లేదు..
ఐతే మరో కోణంలో చూస్తే హీరోయిన్లే కరెక్ట్ అంటున్నారు. అలా చూస్తే గ్లామరే వాళ్ల ప్రధాన పెట్టుబడి.. కాబట్టి ఆఫర్లు తగ్గినా, లేదంటే తమని గ్లామరస్ గా చూపించలేకపోయినా దర్శకులకి, ఇలా తమ ట్యాలెంట్ చూపిస్తారనే వాదన కూడా పెరిగింది. ఏదేమైనా సౌత్ ముద్దుగుమ్మలు నార్త్ కి వెళితే వాళ్ల డ్రెస్ ఐస్ లా కరిగిపోవాల్సిందే అన్నది నిజం అంటున్నారు.