HEROINES: బికినీ షోనే నమ్ముకుంటున్న బాలీవుడ్ హీరోయిన్స్..

సినిమాలో హీరోయిన్ బికినీ షో ఉందంటే గతంలో టికెట్లు ఎక్కువగా తెగేవి. ధూమ్ -2లో ఐశ్వ‌ర్య‌రాయ్, కంబ‌క్త్ ఇష్క్‌‌లో క‌రీనా క‌పూర్, మ‌ల్లీశ్వ‌రిలో క‌త్రినాకైఫ్, ద్రోణ‌లో ప్రియ‌మ‌ణి.. ఇలా చాలా మంది హీరోయిన్స్ బికినీ షోల‌తో భారీ పారితోషికాలు అందుకున్నవారే.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 8, 2023 | 08:01 PMLast Updated on: Oct 08, 2023 | 8:01 PM

Heroines Following Only Bikinis Instead Of Acting

HEROINES: ఒకప్పుడు ఇండియన్ సినిమాల్లో హీరోయిన్ బికినీ వేస్తోందంటే ఓ సంచలనం. మామూలుగా న‌టించ‌డానికి ఒక రేటు, బికినీ అంటే మ‌రో రేటు అన్న‌ట్లుగా ఉండేది వ్యవహారం. కానీ ఇప్పుడు సీన్ మారింది. హీరోయిన్స్ అంతా బికినీల‌తో రెచ్చిపోతూ ప్రీ షో చేసేస్తున్నారు. ఇంతకీ దీని వెనుకున్న రీజన్ ఏంటో తెలుసా..? సినిమాలో హీరోయిన్ బికినీ షో ఉందంటే గతంలో టికెట్లు ఎక్కువగా తెగేవి. ధూమ్ -2లో ఐశ్వ‌ర్య‌రాయ్, కంబ‌క్త్ ఇష్క్‌‌లో క‌రీనా క‌పూర్, మ‌ల్లీశ్వ‌రిలో క‌త్రినాకైఫ్, ద్రోణ‌లో ప్రియ‌మ‌ణి.. ఇలా చాలా మంది హీరోయిన్స్ బికినీ షోల‌తో భారీ పారితోషికాలు అందుకున్నవారే.

క‌ట్ చేస్తే.. ఇప్పుడు హీరోయిన్లు ఫ్రీ షో వేసేస్తున్నారు. బికినీల‌తో రెచ్చిపోతున్నారు. ఆకులు అడ్డం పెట్టుకుని మరీ అందాల‌ను ఆర‌బోస్తున్నారు. సినిమాల్లోనే కాదు, త‌మ సోష‌ల్ మీడియా అకౌంట్లలో కూడా ఉచితంగా షో చేస్తున్నారు. కోటి రూపాయ‌లు ఇస్తే కానీ బికినీ షో చేయని హీరోయిన్స్ ఇప్పుడు ఫ్రీగా చూపించడానికి కారణం సోష‌ల్ మీడియాలో ఫాలోవర్స్‌ని పెంచుకునే ప్ర‌య‌త్నం. ఒక‌రూ.. ఇద్దరని కాదు.. కియ‌రా నుంచి అలియా భ‌ట్ వరకు.. జాన్వీ క‌పూర్ నుంచి మృణాల్ ఠాకూర్ వరకు అంతా వ‌ర‌స పెట్టి బికినీ ఫొటోల‌ను పోస్టు చేస్తూనే ఉన్నారు.

త‌ద్వారా వీలైనంత‌గా ఫాలోవర్స్ సంఖ్య‌ను పెంచుకుని.. సోష‌ల్ మీడియా మార్కెటింగ్ ద్వారా కోట్లకు కోట్లు అకౌంట్‌లో వేసుకుంటున్నారు. ఒక వైపు సినిమా ఆఫర్స్.. మరోవైపు క్రేజ్‌తో అన్ని రకాలుగా లాభాలు గడిస్తున్నారు.