Tollywood Heroines: టాలీవుడ్‌లో హీరోయిన్లు మాయం.. వాళ్లే అంటే ఇక కష్టం..
అలియా, దీపికా, శ్రద్దా, దిశా పటానీ, కృతి సనన్, మృణాల్ ఠాకూర్, ఊర్వశి రౌతేలా.. ఇలా పెద్ద హీరోయిన్ నుంచి ఐటమ్ సాంగ్ వరకు అంతా బాలీవుడ్ సరుకుతోనే టాలీవుడ్ మెరిసిపోతోంది. మొన్నటి వరకు ఇక్కడ హీరోయిన్లంటే శ్రుతి, తమన్నా, కాజల్, సమంత, ఇలియానా, అనుష్క అండ్ కో.

Tollywood Heroines: టాలీవుడ్ హీరోయిన్లు మాయమయ్యేలా ఉన్నారు. మొన్నటి వరకు తెలుగు హీరోయిన్లంటే కన్నడ, తమిళ, మలయాళ ముద్దుగుమ్మలే కనిపించేవాళ్లు. ఇక మీదట వాళ్లు కూడా కనమరుగు అయ్యేలా ఉన్నారట. అంతటికీ కారణం బాలీవుడ్ ముద్దుగుమ్మలే. అలియా, దీపికా, శ్రద్దా, దిశా పటానీ, కృతి సనన్, మృణాల్ ఠాకూర్, ఊర్వశి రౌతేలా.. ఇలా పెద్ద హీరోయిన్ నుంచి ఐటమ్ సాంగ్ వరకు అంతా బాలీవుడ్ సరుకుతోనే టాలీవుడ్ మెరిసిపోతోంది. మొన్నటి వరకు ఇక్కడ హీరోయిన్లంటే శ్రుతి, తమన్నా, కాజల్, సమంత, ఇలియానా, అనుష్క అండ్ కో.
ఇందులో ఏజ్ బార్ అవటంతో అనుష్క, ఇలియానా సైడ్ కెళ్లిపోయారు. కాజల్ పెళ్లి తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. ఇక తమన్నా డైలామాలో ఉంది. సమంతా ఇంకా ఏవో ప్రయోగాలు చేస్తోంది. వీళ్ల తర్వాత పూజాహెగ్డే, రష్మిక, కృతి శెట్టి వచ్చారు. కాని వాళ్లు మరీ వేగంగా బోర్ కొట్టే స్టేజ్ కొచ్చేశారనంటున్నారు. కనీసం శ్రీలీల ఉందికదా అంటే ఏ హీరోయిన్ అయినా ఇక్కడ ఐదారుగురు టాప్ స్టార్లతో జోడీ కట్టేవరకే ఛాన్స్. ఒకప్పటిలా పదేళ్లకు పైనే ఏలేస్తాం అనే పరిస్థితులు లేవు. ఎన్టీఆర్ వరుసగా రెండు సినిమాల్లో బాలీవుడ్ హీరోయిన్లే కనిపించబోతున్నారు. బన్నీ, చెర్రీ, ప్రభాస్, మహేశ్ అంతా బాలీవుడ్ వైపే మొగ్గుచూపితే, ఇక్కడ సౌత్ హీరోయిన్లు కనుమరుగయ్యేలా ఉన్నారు. పాన్ ఇండియా మార్కెట్ మాయలో పడి బాలీవుడ్ ముద్దుగుమ్మలకే మనవాళ్లు ఆఫర్లు ఇచ్చుకుంటూ పోతున్నారు.