Hesham Abdul Wahab: తెలుగు మూవీకి మలయాళీ మ్యూజిక్.. దూసుకెళ్తున్న యంగ్ సెన్సేషన్..!
అబ్దుల్ వహాబ్ పాటలు తెలుగులో వినిపించడం మొదలైందో లేదో మూడు సినిమాలతో బిజీ అయిపోయాడు. 2015 నుంచి మాలీవుడ్‌ను ఏలుతున్న ఈ 32 ఏళ్ల మ్యూజిక్ డైరెక్టర్ తెలుగులో విజయ్ దేవరకొండ నటించిన ఖుషి, నాని సినిమా 'హే నాన్న' మూవీతోపాటు శర్వానంద్ కొత్త సినిమాకు కూడా మ్యూజిక్ ఇస్తున్నాడు.

Hesham Abdul Wahab: ఈమధ్యకాలంలో ఓ మలయాళీ మ్యూజిక్ డైరెక్టర్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. పెద్దగా హైప్ లేని సినిమాకు తన ఆల్బమ్‌తో క్రేజ్ తీసుకొచ్చాడు. మరోసారి ఇంకో మెలోడీతో ముందుకొచ్చిన మలయాళీ మ్యూజిక్ డైరెక్టర్ పేరు హేషామ్ అబ్దుల్ వహాబ్. అతడి పాటలు తెలుగులో వినిపించడం మొదలైందో లేదో మూడు సినిమాలతో బిజీ అయిపోయాడు. 2015 నుంచి మాలీవుడ్‌ను ఏలుతున్న ఈ 32 ఏళ్ల మ్యూజిక్ డైరెక్టర్ తెలుగులో విజయ్ దేవరకొండ నటించిన ఖుషి, నాని సినిమా ‘హే నాన్న’ మూవీతోపాటు శర్వానంద్ కొత్త సినిమాకు కూడా మ్యూజిక్ ఇస్తున్నాడు.
విజయ్ దేవరకొండ, సమంత వరుస ఫ్లాపులతో ఫామ్‌లో లేరు. టక్ జగదీశ్ ఫ్లాప్ తర్వాత శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు వహాబ్ మ్యూజిక్ మంచి హైప్ తీసుకొచ్చింది. సినిమాకు భారీ ఓపెనింగ్స్ రావడానికి హేషామ్ అబ్బుదల్ వహాబ్ మ్యూజిక్ ఉపయోగపడింది. హే నాన్న నుంచి వచ్చిన మెలోడీ సాంగ్ ‘సమయమా’ ఆకట్టుకుంటోంది. ఖుషిలో మూడు పాటలను పాడిన వహాబ్.. సమయమా సాంగ్‌ను అనురాగ్ కులకర్ణితో పాడించాడు. అనంత్ శ్రీరామ్ ఈ పాటను రాయగా.. లిరికల్ వీడియోను తాజాగా విడుదల చేశారు. ఈ సినిమా డిసెంబర్ 21న రిలీజ్ అవుతోంది. ఈ చిత్రానికి కూడా మ్యూజిక్ ప్లస్ అవుతుందనిపిస్తోంది.