Hi Nanna : హాయ్ నాన్న’ హార్ట్ ని టచ్ చేసాడు భయ్యా..
నాని, మృణాల్ ఠాకూర్ నటించిన హాయ్ నాన్న థియేటర్లలోకి వచ్చేసింది. నూతన దర్శకుడు శౌర్యువ్ తెరకెక్కించిన ఈ మూవీ ట్రైలర్ , సాంగ్స్ చూసి హృదయాన్ని హత్తుకునే ప్రేమకావ్యం అని ఫిక్సైపోయారు ప్రేక్షకులు. మరి హాయ్ నాన్నా.. హార్ట్ ని టచ్ చేశాడా? సినిమాపై ప్రేక్షకుల రియాక్షనేంటి? థియేటర్ కి వెళ్లొచ్చా? వాచ్ దిస్ రివ్యూ..
నాని, మృణాల్ ఠాకూర్ నటించిన హాయ్ నాన్న థియేటర్లలోకి వచ్చేసింది. నూతన దర్శకుడు శౌర్యువ్ తెరకెక్కించిన ఈ మూవీ ట్రైలర్ , సాంగ్స్ చూసి హృదయాన్ని హత్తుకునే ప్రేమకావ్యం అని ఫిక్సైపోయారు ప్రేక్షకులు. మరి హాయ్ నాన్నా.. హార్ట్ ని టచ్ చేశాడా? సినిమాపై ప్రేక్షకుల రియాక్షనేంటి? థియేటర్ కి వెళ్లొచ్చా? వాచ్ దిస్ రివ్యూ..
‘దసరా’ సక్సెస్ తర్వాత నాని నటించిన హాయ్ నాన్న డిసెంబరు 7న థియేటర్లలో సందడి చేసింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన ఈ మూవీ స్టోరీ ఏంటంటే.. విరాజ్ గా నటించిన నాని ముంబైలో ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్. అతని ఆరేళ్ళ కుమార్తె మహికి కథలు చెప్పడం అలవాటు. అమ్మ కథ చెప్పమని ప్రతిసారీ అడుగుతూ ఉంటుంది. అయితే క్లాస్ ఫస్ట్ వస్తే చెబుతానని ప్రామిస్ చేస్తాడు విరాజ్. చెప్పినట్టే మహి ఫస్ట్ వస్తుంది కానీ అమ్మ కథ చెప్పడు. తెల్లారిన తర్వాత తండ్రికి చెప్పకుండా మహి బయటకు వెళుతుంది. ఆ సమయంలో ప్రమాదంలో పడిన చిన్నారిని యష్ణ కాపాడుతుంది. ఇద్దరు కలిసి కాఫీ షాపులో కూర్చుంటారు. అక్కడికి విరాజ్ వస్తాడు. అమ్మ కథ చెప్పాలని పట్టుబట్టడంతో చెప్పడం మొదలెడతాడు. విరాజ్ ఫొటోగ్రాఫర్ కాకముందు.. వర్ష తో పరిచయం, ప్రేమ, పెళ్లి, అందమైన పాప జన్మించడం ఇవన్నీ చెబుతాడు. ఆ క్యారెక్టర్లో తనని ఊహించుకుంటుంది యష్ణ.. ఇంతకీ పాప పుట్టిన తర్వాత ఏమైంది? వారంలో పెళ్లి పెట్టుకుని విరాజ్ తో ప్రేమలో పడిన యష్ణ.. తన మనసులో మాట చెప్పిందా.. చివరకు ఏమైంది?
తండ్రి-కూతురి మధ్య సాగే కథలు టాలీవుడ్ కి కొత్తేం కాదు కానీ.. కూతురిపై తండ్రి ప్రేమలో ఉండే మ్యాజిక్ ప్రేక్షకులకు ఎప్పుడూ కొత్తగానే అనిపిస్తుంది. అయితే హాయ్ నాన్న మూవీని స్పెషల్ గా నిలబెట్టిన అంశం ఏంటంటే తల్లి పాత్ర. ఈ సినిమాలో ఇదే పెద్ద ట్విస్ట్. ఇందులో తండ్రి-కూతురు కన్నా తల్లి పాత్ర కీలకమైనది. ఈ ట్విస్ట్ వచ్చే వరకు నడిచే ప్రేమకథ రొటీన్ అనిపిస్తుంది. ఒక్కసారి ట్విస్ట్ రివీల్ అయ్యాక గుండె బరువెక్కిపోతుంది. అప్పటి నుంచి స్టోరీ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ప్రేమ, హీరో హీరోయిన్ల మానసిక సంఘర్షణ. మన మనసులో బాధను, ప్రేమను అన్నిసార్లూ బయటకు వ్యక్తం చేయలేం. అలాగని, దాచుకోలేం. అటువంటి పరిస్థితిని తెరపై ఆవిష్కరించడానికి దర్శకుడు శౌర్యువ్ ట్రై చేశాడు. అయితే ట్విస్ట్ మినహా మిగిలిన స్టోరీని ఊహించడం పెద్ద కష్టమేం కాదు.
హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం సినిమాకు ప్రాణం పోసింది. ప్రతి సన్నివేశం ఓ అందమైన పెయింటింగ్ లా అనిపిస్తుంది. ఇప్పటివరకు నాని చేసిన సినిమాల్లో ‘హాయ్ నాన్న’ ది బెస్ట్ లుక్ . భావోద్వేగభరిత సీన్స్ లో నాని నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. యష్ణగా మృణాళ్ అందంగా కనిపించింది.. ఏడిపించేసింది. ‘బేబీ’ కియారా ఖన్నా నటనకు ఫిదా కాకుండా ఉండలేం. మిగిలిన వారంతా తమ క్యారెక్టర్స్ కి న్యాయం చేశారు. ఇక స్పెషల్ సాంగ్’ఒడియమ్మా..’ లో శృతి హాసన్ డ్యాన్స్ సూపర్బ్. రితికా నాయక్ కూడా ఓ పాటలో సందడి చేసింది. క్లైమాక్స్ లో నేహాశర్మ మెరుపులున్నాయి.. ఓవరాల్ గా చెప్పుకుంటే ‘హాయ్ నాన్న’ ఓ ఎమోషనల్ జర్నీ. ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా థియేటర్ కి వెళితే మీకు నచ్చుతుంది.