Hi Nanna Awards : న్యూయార్క్‌లో 11 అవార్డులు గెలుచుకున్న ‘హాయ్ నాన్న’
నాని (Nani), మృణాల్ ఠాకూర్ (Mrinal Thakur) కలిసి నటించిన ‘హాయ్ నాన్న(Hi Nanna)’ చిత్రం ఇప్పుడు అంతర్జాతీయంగా పదకొండు అవార్డుల్ని దక్కించుకుంది.

'Hi Nanna' wins 11 awards in New York
నాని (Nani), మృణాల్ ఠాకూర్ (Mrinal Thakur) కలిసి నటించిన ‘హాయ్ నాన్న(Hi Nanna)’ చిత్రం ఇప్పుడు అంతర్జాతీయంగా పదకొండు అవార్డుల్ని దక్కించుకుంది. ఇంత వరకు పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ఈ చిత్రం ఇప్పుడు న్యూయార్క్‌లో జరిగిన ‘ది ఒనిరోస్ ఫిల్మ్ అవార్డ్స్’ (The Onerose Film Awards) ఈవెంట్‌లో సత్తా చాటింది. ‘హాయ్ డాడీ’ పేరుతో ఈ చిత్రాన్ని ఓవర్సీస్‌లో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే
న్యూయార్క్ (New York) లో జరిగిన ఈ ది ఒనిరోస్ ఫిల్మ్ అవార్డ్స్‌లో హాయ్ నాన్న చిత్రానికి బెస్ట్ మూవీ, బెస్ట్ హీరో, బెస్ట్ హీరోయిన్, బెస్ట్ పెయిర్, బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ స్క్రీన్ ప్లే, బెస్ట్ డెబ్యూ డైరెక్టర్, బెస్ట్ సినిమాటోగ్రఫీ, బెస్ట్ సౌండ్ ట్రాక్, బెస్ట్ ఎడిటింగ్ ఇలా మొత్తం 11 అవార్డులు దక్కాయి. ఇన్ని అవార్డులు గెలుచుకోవడం పట్ల డైరెక్టర్ శౌర్యవ్, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తదితరులు సంతోషం వ్యక్తం చేశారు.
ఈ విషయమై శౌర్యవ్ మాట్లాడుతూ స్టోరీ బాగుంటే సినిమాకు ఎక్కడైనా ఆదరణ లభిస్తుందన్నారు. ఒనిరోస్ ఫిల్మ్ అవార్డుల్లోఇన్ని అవార్డులు గెలుచుకోవడం చాలా థ్రిల్లింగ్‌గా ఉందన్నారు. దీంతో తన కల నెరవేరిందన్నారు. ఈ సినిమాలో తాను పోషించిన యష్న రోల్ తనకు జీవితాంతం గుర్తుంటుందన్నారు. ఈ మూవీ టీంతో పని చేయడం గొప్ప అనుభూతిని ఇచ్చిందన్నారు.