Sakhi Singh Dhoni: ఇప్పటివరకు ఒక లెక్క ఇకనుంచి ఒక లెక్క
తన కెప్టెన్సీలో భారత్‌కు రెండు ప్రపంచకప్‌లను అందించిన వెటరన్ మహేంద్ర సింగ్ ధోని ఇప్పుడు క్రికెట్‌ను వదిలి నటనలోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది.

His wife Sakshi Singh said that Dhoni, who has achieved his own glory in cricket, will now appear in films
అతను అనేక వాణిజ్య ప్రకటనలలో ఇప్పటికే కనిపించిన సంగతి తెలిసిందే. అనేక ప్రసిద్ధ బ్రాండ్‌లతో అనుబంధం కలిగి ఉన్నాడు. ఇప్పటి వరకు ధోనీ నటనను కేవలం ప్రకటనలలో చూసిన అభిమానులకు.. ఇకపై వెండితెరపైనా చూడొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని ధోనీ భార్య సాక్షి తెలియజేసింది. విలేకరుల సమావేశంలో మహి తెరపై హీరోగా చూడొచ్చా అని ప్రశ్నించగా.. ఆమె మాట్లాడుతూ.. అభిమానులు ఖచ్చితంగా ఆ ఆనందాన్ని పొందవచ్చు అంటూ బదులిచ్చింది. ‘ఆ రోజు కోసం ఎదురుచూస్తాను. ఇదే జరిగితే ఆ క్షణం నాకు చాలా సంతోషంగా ఉంటుంది. మంచి పాత్ర వస్తే తప్పకుండా నటించగలడు’ అంటూ చెప్పుకొచ్చింది. ‘ధోని తన జీవితంలో చాలా యాడ్-షూట్‌లు చేశాడు. ఇకపై కెమెరా ముందు సిగ్గుపడడు. ఎలా నటించాలో అతనికి బాగా తెలుసు. అతను 2006 నుంచి కెమెరాను ఎదుర్కొంటున్నాడు. మంచి పాత్ర వస్తే తప్పకుండా నటించగలడు. ఆయన కోసం సినిమా ఎంచుకోవాల్సి వస్తే యాక్షన్ రోల్ ఎంచుకుంటాను’ అంటూ బదులిచ్చింది.