మరీ వైలెంట్ గా నానీ, ఒక్కో సీను ఒక్కో షాటు మైండ్ పోగొట్టాడు

టాలీవుడ్ లో “హిట్” సీరీస్ కు ఓ రేంజ్ లో క్రేజ్ ఉంటుంది. మొదటి రెండు పార్ట్ లు సూపర్ డూపర్ హిట్ కావడంతో మూడో పార్ట్ ని డైరెక్టర్ శైలేష్ కొలను గ్రాండ్ గా ప్లాన్ చేసాడు. మూడో పార్ట్ లో నానీ హీరో అంటూ రెండో పార్ట్ లో రివీల్ చేసిన డైరెక్టర్... మూడో పార్ట్ షూటింగ్ ని పరుగులు పెట్టిస్తున్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 5, 2024 | 05:33 PMLast Updated on: Sep 05, 2024 | 5:33 PM

Hit 3 Teaser Release

టాలీవుడ్ లో “హిట్” సీరీస్ కు ఓ రేంజ్ లో క్రేజ్ ఉంటుంది. మొదటి రెండు పార్ట్ లు సూపర్ డూపర్ హిట్ కావడంతో మూడో పార్ట్ ని డైరెక్టర్ శైలేష్ కొలను గ్రాండ్ గా ప్లాన్ చేసాడు. మూడో పార్ట్ లో నానీ హీరో అంటూ రెండో పార్ట్ లో రివీల్ చేసిన డైరెక్టర్… మూడో పార్ట్ షూటింగ్ ని పరుగులు పెట్టిస్తున్నాడు. మొదటి రెండు పార్ట్ లు లోకల్ లో షూట్ చేయగా మూడో పార్ట్ కోసం కాశ్మీర్ వెళ్ళాడు. తాజాగా దీనికి సంబంధించిన టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇప్పటి వరకు నానీ కెరీర్ లో ఈ రేంజ్ టీజర్ రాలేదంటే నమ్మండి…

కాసేపటి క్రితం హిట్ 3 కి సంబంధించి… హీరో పాత్ర అర్జున్ సర్కార్ గురించి ఒక టీజర్ విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి ఊహించని స్పందన వస్తోంది. బొలెరో వాహనంలో నానీ కాశ్మీర్ కొండల్లో సిగార్ కాలుస్తూ వెళ్తూ ఉంటాడు. ఉగ్రవాద ప్రభావిత ప్రాంతంలో నానీ వెళ్తూ ఉండగా… ఆర్మీ పోస్ట్ కి ఓ ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్ లో అర్జున్ సర్కార్ గురించి సింపుల్ గా చెప్పేలా ప్లాన్ చేసారు. ఇక నానీ సిగార్ కాలుస్తూ బొలెరో నడుపుతూ దుమ్ము రేపాడు, మంచు కొండల్లో మంచి విజువల్స్ చూపించాడు డైరెక్టర్.

అతనే ఒక ప్రమాదం అంటూ క్యారెక్టర్ ఏ రేంజ్ లో భయంకరంగా ఉంటుందో చూపించాడు. ఒక ఉగ్రవాదిని వెతుకుతూ నానీ కాశ్మీర్ వెళ్లి ఉండవచ్చు అని… ఆ కేసుని HIT లీడ్ చేస్తుందని అంటున్నారు హిట్ సీరీస్ ఫాన్స్. ఇక డైరెక్టర్ పని తీరుకు తగ్గట్టు… బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అల్లాడించారు. వచ్చే ఏడాది మే ఒకటో తారీఖున ఈ సినిమా విడుదల కానుందని ప్రకటించారు. ఇప్పటికే అర్జున్ సర్కార్ క్యారెక్టర్ గురించి హిట్ 2 లో కొంత చూపించారు. మరి హిట్ థర్డ్ కేస్ ఏ రేంజ్ లో డైరెక్టర్ ప్లాన్ చేసి ఉంటాడో చూడాలి.