‘హిట్ 3’ టీజర్ రివ్యూ.. నాని మనిషి కాదు రాక్షసుడే..!
హింసకు కొత్త నిర్వచనం చెప్తా.. చూస్తారుగా ఇకపై నేను చేయబోయే సినిమాలు ఎలా ఉంటాయో..? ఒక్కొక్కరికి చూస్తుంటేను వణుకు వచ్చేయాలంటూ ఆ మధ్య నాని కొన్ని కామెంట్స్ చేసాడు. అయినా అలా చెప్తాడు గానీ నానిని అంత మాస్‌గా చూడగలమా..

హింసకు కొత్త నిర్వచనం చెప్తా.. చూస్తారుగా ఇకపై నేను చేయబోయే సినిమాలు ఎలా ఉంటాయో..? ఒక్కొక్కరికి చూస్తుంటేను వణుకు వచ్చేయాలంటూ ఆ మధ్య నాని కొన్ని కామెంట్స్ చేసాడు. అయినా అలా చెప్తాడు గానీ నానిని అంత మాస్‌గా చూడగలమా.. ఆయనైనా అంత మాసీగా సినిమాలు చేస్తాడా అని అంతా అనుకున్నారు. కానీ ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను అన్నట్లుగా రెచ్చిపోతున్నాడు న్యాచురల్ స్టార్. తాజాగా ఆయన హిట్ 3 టీజర్ చూసిన తర్వాత వామ్మో ఏంటీ అరాచకం అనే మాట చాలా చిన్నదే అవుతుందేమో..?
రక్తాభిషేకం చేస్తున్నాడు నాని. ముందు నుంచి ఈ సినిమాలో హింస ఎక్కువగా ఉంటుందని చెప్తూనే ఉన్నాడు గానీ మనమే నమ్మలేదు. ఇప్పుడు టీజర్ చూసిన తర్వాత నమ్మక తప్పట్లేదు. ఇప్పటి వరకు తెలుగు సినిమాకు ఉన్న వయొలెన్స్ హద్దులన్నీ ఈ సినిమాతో చెరిపేయాలని ఫిక్సైపోయాడు నాని. ముఖ్యంగా ఆయన కారెక్టరైజేషన్ కూడా నెక్ట్స్ లెవల్‌లో ఉండబోతుందని అర్థమవుతుంది. అర్జున్ సర్కార్ పాత్ర తనకు చాలా స్పెషల్ అని ఇప్పటికే చాలాసార్లు చెప్పాడు నాని. టీజర్ చూసాక.. దాన్నెంత పర్సనల్‌గా తీసుకున్నాడనేది అర్థమవుతుంది. టీజర్ అంతా టెక్నికల్ వైజ్‌గా చాలా గ్రాండ్‌గా ఉంది. శ్రీనగర్ నేపథ్యంలో కథ సాగుతుంది.
100 మంది నిర్దోషులు చచ్చినా పర్లేదు కానీ ఒక్క నేరస్థుడు మాత్రం తప్పించుకోకూడదు అనుకునేంత సైకో మెంటాలిటీ అర్జున్ సర్కార్ సొంతం. అదంతా టీజర్‌లోనే కనిపించింది. మే 1న విడుదల కానుంది ఈ చిత్రం. శ్రీనగర్‌లో పోలీసులకు ఓ సమస్య వస్తుంది. అక్కడ సీరియల్ హత్యలు జరుగుతుంటాయి.. పైగా అన్నీ ఒకే ఫార్మాట్‌లో జరుగుతుంటాయి. ఆ కేసును చేధించడానికి ఒక ఆఫీసర్ అవసరం పడుతుంది.. అది అర్జున్ సర్కార్ చేతుల్లోకి వస్తుంది. ఆ తర్వాత ఏం చేసాడు అనేది మిగిలిన కథ. ఒకవేళ వర్కవుట్ అయితే మాత్రం బాక్సాఫీస్ దగ్గర నాని ఊచకోత మామూలుగా ఉండదు.