Hit hit! 2023 : హిట్ కొట్టారు భయ్యా..! కొత్త డైరెక్టర్లకు కలిసొచ్చిన 2023
చూస్తుండగానే సంవత్సరం అయిపోవస్తుంది. ఎప్పటిలానే ఈ యేడు కూడా ఇండస్ట్రీ.. సినిమాకు కొత్త తరాన్ని అందించింది. అందివచ్చిన అవకాశాన్ని విజయవంతం చేసుకుని కొందరు కెరీర్ ను గాడిన పెట్టుకుంటే.. మరికొందరు బాక్సాఫీస్ తో పోరాటానికి సిద్ధమైపోయారు.. ఈ యేడు పరిశ్రమలో చర్చనీయాంశమైన కొత్త దర్శకుల కథాకమీషు ఇది.
చూస్తుండగానే సంవత్సరం అయిపోవస్తుంది. ఎప్పటిలానే ఈ యేడు కూడా ఇండస్ట్రీ.. సినిమాకు కొత్త తరాన్ని అందించింది. అందివచ్చిన అవకాశాన్ని విజయవంతం చేసుకుని కొందరు కెరీర్ ను గాడిన పెట్టుకుంటే.. మరికొందరు బాక్సాఫీస్ తో పోరాటానికి సిద్ధమైపోయారు. ఈ యేడు పరిశ్రమలో చర్చనీయాంశమైన కొత్త దర్శకుల కథాకమీషు ఇది.
టాలీవుడ్ నిరంతరం కొత్తదనంతో తొణికిసలాడుతూనే ఉంటుంది. ప్రతి యేడూ కొత్త దర్శకులు వస్తూనే ఉన్నారు. కొందరు వస్తూనే హిట్లతో తమ స్థానాన్ని పదిలం చేసుకుంటే.. మరికొందరు మళ్లీ ట్రయల్స్ మోడ్ లోకి వెళ్లిపోతారు. 2023లో కూడా కొత్త దర్శకులు కొందరు తమ సత్తా చాటగా.. మరికొందరు సినిమా మేకింగ్ లో అనుభవాన్ని పొందారు. 2023 లో ఇండస్ట్రీ ని ఆశ్చర్యపరిచిన వారిలో ముందుగా చెప్పుకోవాల్సింది వేణు గురించి. హాస్యనటుడిగా అందరికీ తెలిసిన వేణు.. ‘బలగం’ సినిమాతో దర్శకుడిగా మారాడు. సహజమైన భావోద్వేగాలతో సినిమాను తెరకెక్కించి.. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు వసూలు చేశాడు. ఇక దసరా తో మరో యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల బాక్సాఫీస్ ను షేక్ చేశాడు. మరో దర్శకుడు శౌర్యువ్ గురించి కూడా చెప్పుకోవాలి. రీసెంట్ గానే హాయ్ నాన్నతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. మనసుని హత్తుకునే ఎమోషన్స్ ని చిత్రీకరించడంలో శౌవ్ ప్రతిభ కనబరిచాడు.
2023 లో చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని అందుకున్న చిత్రం మ్యాడ్. కాలేజీ కుర్రాళ్ళ కథతో యూత్ ని కట్టిపడేసే వినోదం రాసుకొని తెరపై కూడా అంతే హుషారుగా చిత్రీకరించడం, హాయ్ గా నవ్వుకోవడానికి కావాల్సినంత వినోదాన్ని దర్శకుడు కళ్యాణ్ శంకర్ ‘మ్యాడ్’ తో ఇచ్చాడు. బాక్సాఫీసు వద్ద వినోదంపై మంచి పట్టు వున్న దర్శకుడిగా కళ్యాణ్ శంకర్ కు పెరొచ్చింది. అలాగే కార్తికేయ బెదరులంక సినిమాతో.. క్లాక్స్ దర్శకుడిగా పరిచమయ్యాడు. సినిమా కమర్షియల్ గా బ్రేక్ ఈవెన్ అవ్వడంతో పాటు, దర్శకుడిగా తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకోగలడనే నమ్మకం కలిగించాడు.
ఇక ఏడాది తొలి ప్రయత్నంలో నిరాశ పరిచిన దర్శకులని పరిశీలిస్తే.. కళ్యాణ్ రామ్ తో అమిగోస్ తీసిన రాజేందర్ రెడ్డి మెప్పించలేకపోయాడు. స్పై సినిమాకు ఎడిటర్ గ్యారీ కి దర్శకత్వ అవకాశం ఇచ్చాడు నిఖిల్. అయితే ఈ సినిమా నిర్మాణ పరంగా కూడా పరాజాయం పాలయింది. కళ్యాణం కమనీయం తో అనిల్ కుమార్, ఆదికేశవ శ్రీకాంత్ రెడ్డి.. ఇలా తమ తొలి ప్రయత్నంలో నిరాశపరిచారు. ఓవరాల్ గా 2023 కొత్త దర్శకులకు మిశ్రమ ఫలితాలను అందించింది.