డబుల్ ఇస్మార్ట్; రవితేజాపై రామ్ గెలిచాడా…?
టాలీవుడ్ ప్రేక్షకులకు ఆగస్ట్ 15 మంచి విందు ఏర్పాటు చేసింది. మాస్ మహారాజా రవితేజా, ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని తమ సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. భారీ అంచనాలతో వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.
టాలీవుడ్ ప్రేక్షకులకు ఆగస్ట్ 15 మంచి విందు ఏర్పాటు చేసింది. మాస్ మహారాజా రవితేజా, ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని తమ సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. భారీ అంచనాలతో వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. రీమేక్ సినిమాను సరిగా హ్యాండిల్ చేయలేకపోయాడు హరీష్ శంకర్ అనే కామెంట్స్ వినిపించాయి. ఇక రామ్ నటించిన డబుల్ ఇస్మార్ట్ సినిమా ప్రేక్షకులను మెప్పించింది అనే టాక్ వినపడుతోంది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది.
మదర్ సెంటిమెంట్, మణిశర్మ బ్యా గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. యాక్షన్ ఎపిసోడ్స్ లో కచ్చితంగా పూరి మార్క్ కనపడింది. పూరి మార్క్ డైలాగులు సినిమాకే హైలెట్ గా నిలవగా విలన్ పాత్రలో సంజయ్ దత్ నటన సినిమాను మరో రేంజ్ కు తీసుకెళ్ళాయి. కొన్ని మాత్రం ప్రేక్షకులకు బోర్ కొట్టించాయి. సినిమా బాగా లాగ్ ఉందని, అలాగే రివెంజ్ కాన్సెప్ట్ ను పూరి కొత్తగా ప్లాన్ చేసి ఉంటే బాగుండేది అనే టాక్ వస్తోంది. హీరోయిన్ కావ్యా థాపర్ మాత్రం స్క్రీన్ పై చించేసింది అని, ఆమెను పూరి సినిమా కోసం సరిగా వాడుకున్నాడు అంటున్నారు ప్రేక్షకులు.
‘మార్ ముంత చోడ్ చింత’ పాటలో రామ్ స్టెప్స్ ప్రేక్షకులను కుర్చీలో నుంచి లేపి స్టెప్ లు వేయించే రేంజ్ లో ఉన్నాయట. సినిమా టాక్ చూస్తుంటే కచ్చితంగా వంద కోట్ల మూవీ అని, సరైన హిట్ కోసం చూస్తున్న పూరికి మంచి హిట్ పడిందని ఆయన ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఇక రామ్ తన యాక్టింగ్ తో సినిమాను ముందుండి నడిపించాడని, సంజయ్ దత్ సెలెక్షన్ సినిమాకు ప్లస్ పాయింట్ అంటున్నారు. ఇంటర్వెల్ నుంచి సినిమా పీక్స్ కి వెళ్ళినా క్లైమాక్స్ మాత్రం అంత గొప్పగా లేదట. పూరి మార్క్ పంచ్ లు మాత్రం సినిమా చూసే వాళ్లకు బాగా నచ్చాయి. అన్నీ కూడా సింగిల్ లైన్ పంచ్ లే. ఓవరాల్ గా సినిమా అబోవ్ యావరేజ్ గా నిలిచింది. రామ్, రవితేజా మధ్య పోటీలో రామ్ దే విజయం అంటున్నారు సినీ జనాలు.