Mahesh Babu : మహేష్‌కు హిట్టు బాకీ..

టాలీవుడ్‌లో (Tollywood) ఉన్న డైరెక్టర్లలో సుకుమార్‌ (Sukumar) కు ఉన్న క్రేజే వేరు.. ఇక.. పుష్ప-1 మూవీతో ఆ క్రేజ్ కాస్తా పీక్స్‌కు చేరిపోయింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 3, 2024 | 10:21 AMLast Updated on: May 03, 2024 | 10:21 AM

Hittu Is Due For Mahesh

 

 

 

టాలీవుడ్‌లో (Tollywood) ఉన్న డైరెక్టర్లలో సుకుమార్‌ (Sukumar) కు ఉన్న క్రేజే వేరు.. ఇక.. పుష్ప-1 మూవీతో ఆ క్రేజ్ కాస్తా పీక్స్‌కు చేరిపోయింది. అప్పటి వరకు టాలీవుడ్‌లో మాత్రమే మార్మోగిపోయిన ఈ లెక్కల మాస్టారి పేరు.. ఇప్పుడు పాన్ ఇండియా (Pan India) లెవెల్‌లో మార్మోగిపోతోంది. ఈ క్రమంలోనే పుష్ప-2 (Pushpa-2) మూవీపై భారీ లెవెల్‌లో అంచనాలు పెరిగిపోయాయి. దానికి తగ్గట్లుగానే ఈ మూవీపై వస్తున్న అప్‌డేట్స్ సుకుమార్ స్టామినా ఏంటో ప్రూవ్ చేస్తున్నాయి. దీంతో.. పుష్ప-1 ను మించి పుష్ప-2 బ్లాస్ట్ చేయబోతందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

నిజానికి సుకుమార్‌తో మూవీ అంటే హిట్టు పక్కా అన్న లెక్కలు ఉన్నాయి.. ఇప్పటి వరకు తాను సినిమా తీసిన హీరోల్లో అందరికీ హిట్ సినిమాలే ఇచ్చినా.. సూపర్ స్టార్ మహేష్ కి మాత్రం ఫ్లాప్ ఇచ్చాడు సుకుమార్.. మహేష్‌తో నేకొక్కడినే మూవీ సినిమా తీసిన సుకుమార్‌కు అనుకోని షాక్ తగిలింది. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోకపోవడంతో మహేష్ ఫ్యాన్స్ కూడా చాలా డిజప్పాయింట్ అయ్యారు. మిగతా హీరోలకు మెమొరబుల్ హిట్లు అందిస్తున్న సుకుమార్‌ తమ హీరోకు కూడా మంచి హిట్టు ఇవ్వాలని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. వీలైనంత త్వరగా సుకుమార్, మహేష్ కలిసిమళ్లీ సినిమా చేయాలని చూస్తున్నారు.

ఇక.. సుకుమార్ మనస్సులో కూడా ఇదే ఉంది. అందుకే.. ఆమధ్య మహేష్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేష్ కి తాను హిట్టు బాకీ ఉన్నట్లు ఉన్నాడని చెప్పాడు. దీంతో.. మహేష్‌ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. వీళ్లిద్దరి కాంబోలో మూవీ వస్తే ఈసారి కచ్చితంగా హిట్టే అని ఫిక్సయిపోయారు. పుష్ప 2 తర్వాత సుకుమార్ నెక్స్ట్ ప్లాన్ ఏంటన్నది ఇప్పుడే తెలియనప్పటికీ.. ఫ్యూచర్‌లో మాత్రం మహేష్ తో ఒక భారీ సినిమా చేస్తాడని క్లారిటీ వచ్చింది. ఈ కలయికలో భారీ హిట్‌ కావాలనుకుంటున్న ఫ్యాన్స్ కోరిక ఏ మేరకు రీచ్ అవుతుందో చూడాల్సిందే..