NTR War2 : వార్2 లో హాలీవుడ్ దిగ్గజం…

యంగ్ టైగర్ (Young Tiger) ఎన్టీఆర్ (NTR) నుంచి మ్యాన్ ఆఫ్ మాసెస్‌గా మారుతూ తారక్ చేస్తున్న సినిమా దేవర. కొరటాల శివ (Koratala Siva) తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 21, 2024 | 12:15 PMLast Updated on: Apr 21, 2024 | 12:15 PM

Hollywood Giant In War2

 

 

 

యంగ్ టైగర్ (Young Tiger) ఎన్టీఆర్ (NTR) నుంచి మ్యాన్ ఆఫ్ మాసెస్‌గా మారుతూ తారక్ చేస్తున్న సినిమా దేవర. కొరటాల శివ (Koratala Siva) తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్ గూస్ బంప్స్ తెప్పించింది. ఎన్టీఆర్ బర్త్ డే నాడు టీజర్ లేదా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 10న దేవర (Devara) పార్ట్ 1 రిలీజ్ కానుంది.

ఈ సినిమా తర్వాత వచ్చే ఏడాది ఆగష్టులో వార్2 రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో హృతిక్ రోషన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు తారక్. రీసెంట్‌గానే ఈ మూవీ షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు ఎన్టీఆర్. పది రోజుల పాటు జరిగిన షెడ్యూల్‌లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ (Hrithik Roshan) పై కొన్ని యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించారు. ఈ షెడ్యూల్ కంప్లీట్ అవగానే.. హైదరాబాద్‌కు వచ్చేశాడు ఎన్టీఆర్. నెక్స్ట్ దేవర షూటింగ్‌లో జాయిన్ అవనున్నాడు.

ఇదిలా ఉంటే.. వార్ 2 (War 2) సినిమా కోసం ఓ హాలీవుడ్ దిగ్గజాన్ని రంగంలోకి దింపినట్టుగా తెలుస్తోంది. అమెరికన్ యాక్షన్ డైరెక్టర్ స్పిరో రాజటోస్‌ ‘వార్ 2’ సినిమాకు పనిచేయనున్నాడట. ఈయన ‘కెప్టెన్ అమెరికా.. సివిల్ వార్’ లాంటి సినిమాకు స్టంట్ డైరెక్టర్‌గా పని చేశాడు. ఇప్పుడు.. వార్ 2 యాక్షన్ ఎపిసోడ్స్‌ని నెక్స్ట్ లెవల్ అనేలా ప్లాన్ చేస్తున్నాడట. దీంతో వార్ 2 పై మరింతగా అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ను రా ఏజెంట్‌గా పవర్ ఫుల్‌గా చూపించబోతున్నారు దర్శకుడు అయాన్ ముఖర్జీ. ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ చేస్తున్నట్టుగా టాక్ నడుస్తోంది. అందులో ఒకటి నెగెటివ్ రోల్ అని, ఇంకోటి పాజిటివ్ క్యారెక్టర్ అని అంటున్నారు. మరి వార్2 ఎలా ఉంటుందో చూడాలి.