ప్రభాస్ కోసం హాలీవుడ్ హీరోయిన్.. 1000 కోట్ల మూవీ కోసం, 50 కోట్ల గ్లామర్
రెబల్ స్టార్ ప్రభాస్, సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇద్దరి మూవీలకు ఒకే హాలీవుడ్ లేడీ దిక్కయ్యేలా ఉంది. రాజమౌలి డైరెక్షన్ లో సూపర్ స్టార్ మహేశ్ బాబు చేయబోయే సినిమాలో హీరోయిన్ ఇండోనేషియాకు చెందిన చెల్సియా అన్నారు. కాని సడన్ గా హాలీవుడ్ లేడీ, పాప్ సింగర్ నిక్కీ జోన్స్ వైఫ్ ప్రియాంక చోప్రా జోన్స్ పేరే వినిపిస్తోంది.
రెబల్ స్టార్ ప్రభాస్, సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇద్దరి మూవీలకు ఒకే హాలీవుడ్ లేడీ దిక్కయ్యేలా ఉంది. రాజమౌలి డైరెక్షన్ లో సూపర్ స్టార్ మహేశ్ బాబు చేయబోయే సినిమాలో హీరోయిన్ ఇండోనేషియాకు చెందిన చెల్సియా అన్నారు. కాని సడన్ గా హాలీవుడ్ లేడీ, పాప్ సింగర్ నిక్కీ జోన్స్ వైఫ్ ప్రియాంక చోప్రా జోన్స్ పేరే వినిపిస్తోంది. తను హాలీవుడ్ లేడీనే అయినా, బాలీవుడ్ ని కుదిపేసిన హీరోయిన్ గా తనకో ఇమేజ్ ఉంది. కాని హాలీవుడ్ లోకి వెళ్లాకే తన రేంజ్, మార్కెట్ లో క్రేజ్ పెరిగిపోయింది. అలాంటి తనకోసం సడన్ గా ప్రభాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్, ప్రయత్నిస్తుంటే, సీన్ లోకి రాజమౌళి వచ్చాడు.. ఐతే ప్రశాంత్ నీల్ మాత్రం ప్రియాంక చోప్రా జోనస్ కి వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇచ్చాడట. ఎన్టీఆర్ మూవీ కి కూడా ఆమేకావాలంటున్నాడట.. ఇంతకి బాలీవుడ్ లో ఔట్ డేట్ అనుకున్న తన కాల్ షీట్స్ ఇప్పుడెందుకు హాట్ కేక్ లా మారాయి ?
రెబల్ స్టార్ ప్రభాస్ తో సందీప్ రెడ్డి వంగ తీయబోతున్న మూవీ స్పిరిట్. కథ సిధ్దం, బ్యాగ్రౌండ్ తాలూకు మ్యూజిక్ సిట్టింగ్ కూడా ఎప్పుడో మొదలయ్యాయి. పూర్తయ్యే స్టేజ్ కి వచ్చాయి. ఐతే ఇందులో విలన్ గా కొరియన్ హీరోకి ఫైనల్ చేసిన టీం, హీరోయిన్ గా ప్రియాంక చోప్రని ట్రౌై చేస్తోందట.
విచిత్రం ఏంటేంటే రెబల్ స్టార్ ప్రభాస్ స్పిరిట్ కోసం సందీప్ రెడ్డి వంగ ఇలా ప్రియాంక చోప్రా జోనస్ ని అప్రోచ్ అయ్యాడో లేదో, సీన్ లోకి రాజమౌళి, ప్రశాంంత్ నీల్ వచ్చారు. బాలీవుడ్ లో ఒకప్పుడు నెంబర్ వన్ అనిపించుకున్న ప్రియాంక,బీ టౌన్ లో ఔట్ డేట్ అయ్యింది. కాని హాలీవుడ్ లో మాంచి క్రేజ్ సొంతం చేసుకుంది. తన హస్బెండ్ నిక్ జోన్స్ హాలీవుడ్ నటుడే కాదు, పాప్ సింగర్ కూడా… దీనికి తోడు హాలీవుడ్ వెబ్ సీరీస్ లు, సినిమాలతో అక్కడ బానే క్రేజ్ ని, మార్కెట్ లో ఇమేజ్ ని సొంతం చేసుకుంది
ఐతే ప్రభాస్ కటౌట్ కి దీపికా పదుకొనే తర్వాత మళ్లీ ఆరేంజ్ లేడీ అంటే ప్రియాంక చోప్రానే అని నమ్మిన సందీప్ రెడ్డి వంగ తన స్పిరిట్ లో ప్రభాస్ కి తననే జోడీ గా ఫిక్స్ చేశాడట. తనని రెండు వారాల క్రితం తను సంప్రదిస్తే, మరి రాజమౌళి, ప్రశాంత్ నీల్ కి కూడా బ్రేయిన్ లో బల్బ్ వెలిగిందేమో… వాళ్లు తననే అప్రోచ్ అయ్యారంటూ ప్రచారం పెరిగింది
సూపర్ స్టార్ మహేశ్ బాబుతో పాన్ వరల్డ్ మూవీ ప్లాన్ చేసిన రాజమౌళి, ప్రజెంట్ ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీ అయ్యాడు. మహేశ్ బాబు జర్మనీలో తన వర్క్ షాప్ ముగించేశాడు. ఐతే ఈ సినిమాలో ఇండోనేషియా మూలాలున్న అమెరికన్ నటి చెల్సియానే హీరోయిన్ అన్నారు. కాని హాలీవుడ్ మార్కెట్ కోసం ప్రియాంక చోప్రాజోనస్ ని తీసుకోవాలని రాజమౌళి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది
ఆల్రెడీ తనని టీం సంప్రదించిందట. విచిత్రం ఏంటంటే తనకంటే కాస్త ముందే సలార్ 2 కోసం ప్రశాంత్ నీల్ తనని సంప్రదించాడిని తెలుస్తోంది. శ్రుతి హాసన్ బదులు తన స్థానంలో కైరా అద్వానిని తీసుకోవాలనుకున్న ప్రశాంత్ నీల్, తర్వాత రెబల్ స్టార్ కటౌట్ కి సూటయ్యే లేడీగా ప్రియాంకనే ఫిక్స్ చేశాడట. అంతేకాదు తను ఎన్టీఆర్ తో లాంచ్ చేసిన డ్రాగన్ మూవీలో కూడా ప్రియాంకనే హీరోయిన్ గా అనుకుంటున్నారట. ఆల్రెడీ రామ్ చరణ్ తో తూఫాన్ మూవీని జమానాలోనే చేసిన ప్రియాంక, ఇంతకాలానికి మహేశ్, ప్రభాస్, ఎన్టీఆర్ తో జోడీ కట్టే ఆఫర్స్ తో బిజీ కాబోతోంది.విచిత్రం ఏంటంటే ఈ మూడు ఆఫర్లకి తను ఆసక్తిగానే ఉన్నట్టు తెలుస్తోంది. జనవరిలో ఈ మూవీ ప్రాజెక్టుల హీరోయిన్ గా తన పేరే ఎనౌన్స్ అవ్వొచ్చంటున్నారు. అదే జరిగితే సినిమాలో ఎనౌన్స్ మెంట్ తోనే భారీగా పాన్ ఇండియా లెవల్లో తన పేరు సెన్సేషన్ అయ్యే ఛాన్స్ ఉంది.