Mahesh Babu: హాలీవుడ్‌ను తాకిన గుంటూరు కారం ఘాటు..
సూపర్‌స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రం కాంబినేషన్లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ SSMB28. రీసెంట్‌గానే గుంటూరు కారం అని నామకరణం చేసుకున్న ఈ సినిమా అప్పుడే హాలీవుడ్లో రికార్డ్‌లు క్రియేట్ చేయడం స్టార్ట్ చేసింది.
గుంటూరు కారం టైటిల్ ఎనౌన్స్మెంట్కు ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో అంతా చూశాం. మన హీరోను మనం హైలెట్ చేసుకుంటే ఒకే. కానీ పక్కోడు కూడా హైలెట్ చేస్తేనే కదా కిక్కు. మహేష్ విషయంలో కూడా అదే జరిగింది. గుంటూరు కారం లుక్ అదిరిపోయిందంటూ హాలీవుడ్ మీడియా కూడా సర్టిఫికేట్ ఇచ్చేసింది.
అమెరికాకు చెందిన “వెరైటీ” అనే ఫేమస్ మ్యాగజైన్ కూడా గుంటూరు కారం లుక్ అదిరిపోయిందంటూ ఓ ఆర్టికల్ పబ్లిష్ చేసింది. ఇంకేముంది మహేష్ ఫ్యాన్స్ అంతా.. ఇది మహేష్ అంటే అని కాలర్ ఎగరేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఆర్టికల్ ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. జస్ట్ ఫస్ట్ లుక్‌తోనే మహేష్ బాబు హాలీవుడ్ అటెన్షన్‌ను క్యాచ్ చేయడం ఇంట్రెస్టింగ్ మారింది. గుంటూరు కారం సినిమా మీద హాలీవుడ్ ఫోకస్ ఇప్పుడే ఇలా ఉంటే.. సినిమా రిలీజ్ అయ్యాక ఇంకా ఏ రేంజ్లో ఉంటుందంటున్నారు ఫ్యాన్స్.
ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను 2024లో రిలీజ్ చేసేందుకు మూవీ యూనిట్ ప్లాన్ చేస్తోంది. త్రివిక్రం, మహేష్ కాంబినేషన్లో గతంలో రెండు సినిమాలు వచ్చాయి. ఆ రెండు సినిమాలు థియేటర్స్‌లో పెద్దగా హిట్ అవ్వకపోయినా.. ఆడియన్స్‌ను తెగ ఇంప్రెస్ చేశాయి. దీంతో వీళ్లిద్దరి కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా గుంటూరు కారంపై ఆడియన్స్‌కు ఓ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ లుక్ తోనే హాలీవుడ్ మీడియాను టచ్ చేసిన గుంటూరు కారం.. రిలీజ్ అయ్యాక ఎలాంటి సెగలు పుట్టిస్తుందో చూడాలి.