Hollywood Movies: ఆదిపురుష్ కి ఎన్ని అడ్డంకులో.. ఎన్ని కష్టాలో..
ఆదిపురుష్ కి ఆదినుంచే కష్టాలు తప్పట్లేదు. అప్పుడేమో టీజర్ వచ్చీరాగానే బాలేదన్నారు. అతి కష్టం మీద గ్రాఫిక్స్ కి రిపేర్లు చేశాక జనాల అభిప్రాయాలు మారాయి. ఇప్పుడు అడ్వాన్స్ బుక్కింగ్స్ బాగున్నా, ఆదిపురుష్ కి కష్టాలు తప్పలా లేవు. ఆదిలోనే అడ్డంకులు పెరగక తప్పేలా లేవు.

Hollywood Movies Releasing To Effect on Adipurush
ఈ శుక్రవారం ఆదిపురుష్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. కాని ఒకరోజు ముందే హాలీవుడ్ సూపర్ హీరో ది ఫ్యాష్ మూవీ రాబోతోంది. ఎక్స్ మ్యాన్ లో ఒకానొక పాత్ర అయిన ఫ్లాష్ ని లీడింగ్ హీరోగా మార్చి ది ఫ్లాష్ మూవీ తీసింది హాలీవుడ్ టీం. ఇలాంటి సూపర్ హీరోల సినిమాలకు మన దేశంలో మార్కెట్ ఎక్కువే. అందుకే శుక్రవారం వచ్చే ఆదిపురుష్ కి, గురువారమే చెక్ పెట్టేలా ఉంది ది ఫ్లాష్ మూవీ. ఇదే కాదు మరో హాలీవుడ్ మూవీ జనాలను థియేటర్స్ కి పోకుండా ఇంట్లోనే కూర్చునేలా చేస్తోంది. అది ఎక్స్ టార్షన్ సీక్వెల్ ఎక్స్ టార్షన్ 2
ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో శుక్రవారం వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతోంది. నిజంగా ఈ హాలీవుడ్ మూవీ ఓటీటీలో రిలీజ్ అయ్యి కూడా, ఆదిపురుష్ వసూళ్ళని ప్రభావితం చేస్తుందా అంటే, ఛాన్స్ ఉందనుకోవాలి. ఎందుకంటే ఈ ఒక్క మూవీ వల్లే నెట్ ఫ్లిక్స్ కి వరల్డ్ వైడ్ గా 15 కోట్ల మంది సబ్ స్క్రైబర్లు పెరిగారు. అలాంటి మూవీకి సీక్వెల్ కాబట్టి, ఆదిపురుష్ వచ్చే రోజే వస్తోంది కాబట్టి, డెఫినెట్ గా ప్రభాస్ మూవీ వైపు అడుగులేసే యూత్ ని ఈ సినిమా ఆపొచ్చనే అంచనాలున్నాయి.
సరే సంక్రాంతికి చిరు, సమ్మర్ కి నాని తప్ప మరే పెద్ద హీరో కూడా ఈ ఏడాది ఫస్ట్ హాఫ్ ని ఊపేయలేదు. కనీసం ఈ ఏడాది సెకండ్ హాఫ్ అయినా ఊగిపోయేలా ఆదిపురుష్ భారీగా బోనీ కొడతాడనుకుంటే, పోటీ వచ్చే సినిమాలతో ప్రాక్టికల్ గా తలనొప్పులు తప్పట్లేదు.