Hollywood ఆఫర్.. ఇండియా నుంచి మొదటి హీరో…
సూపర్ స్టార్ మహేశ్ బాబుని బాలీవుడ్ లుక్ ఉన్న టాలీవుడ్ హీరో అంటారు. కాని తనిప్పుడు సడన్ గా హాలీవుడ్ హీరో అయిపోయేలా ఉన్నాడు.

సూపర్ స్టార్ మహేశ్ బాబుని బాలీవుడ్ లుక్ ఉన్న టాలీవుడ్ హీరో అంటారు. కాని తనిప్పుడు సడన్ గా హాలీవుడ్ హీరో అయిపోయేలా ఉన్నాడు. రాజమౌళి తీస్తున్న పాన్ వరల్డ్ మూవీ ఇంకా పూర్తి కాలేదు. కనీసం రెండేళ్లు వేయిట్ చేస్తే తప్ప ఆ సినిమా రాదు. కాబట్టి ఈ మూవీ వచ్చి, తనకి హాలీవుడ్ లో క్రేజ్ వచ్చిందా అన్న డౌట్ కి అర్ధం లేదు. ఏ పాన్ వరల్డ్ మూవీ రాకున్నా తనకి హాలీవుడ్ ఆఫర్ రెడీగా ఉంది.ఇంతవరకు ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే, ఆలియా అండ్ కో ఇలా హాలీవుడ్ లో హీరోయిన్స్ గా మెరిశారు. అమితాబ్ లాంటి సీనియర్ స్టార్, రజినీకాంత్ లాంటి స్టైలిష్ సూపర్ స్టార్ హాలీవుడ్ మూవీల్లో కాసేపే కనిపించే పాత్రల్లోమెరిశారు. కాని ఇంతవరకు ఎన్నడూ హీరోగా లీడ్ రోల్లో అది కూడా హాలీవుడ్ మూవీల్లో మెరవలేదు. ఇప్పుడు అదే జరిగేలా ఉంది. ఏది ఇంకా కన్ఫామ్ కాలేదు. కాని వారం క్రితం జరిగిన హాలీవుడ్ ప్రాజెక్టు డిస్కర్షన్ ఇప్పుడు రివీలైంది…అదేంటో చూసేయండి.
సూపర్ స్టార్ మహేశ్ బాబు తో రాజమౌళి తీస్తున్న మూవీ టైటిల్ ప్రస్థుతానికి మహారాజా అంటున్నారు. లేదంటే గోల్డ్ టైటిల్ కూడా ప్రచారంలోఉంది. వర్కింగ్ టైటిల్ సంగతి అటుంచితే, మహేశ్ బాబు ఈ సినిమాతో పాన్ ఇండియా కాదు ఏకంగా పాన్ వరల్డ్ స్టార్ గా మారిపోతాడనే అంచనాలున్నాయి. కాని ఇక్కడే విచిత్రం జరుగుతోంది. పాన్ ఇండియా మూవీ చేశాకే, ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, బన్నీ వీళ్లందరికి దేశవ్యాప్తంగా క్రేజ్ వచ్చింది
ఐతే మహేశ్ బాబు ఇంతవరకు ఒక్క పాన్ ఇండియా మూవీ చేయలేదు. అయినా కాని తనకి దేశవ్యాప్తంగా తన గుడ్ లుక్స్ వల్ల మంచి గుర్తింపు ఉంది. అయితే అది మాత్రమే సరిపోదు, త్రిబుల్ ఆర్, బాహుబలి లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ పడితే కాని తన మార్కెట్ పెరగదు. దానికే రాజమౌళి సినిమా సమాధానంగా మారబోతోందన్నారు. కాని ఈలోపే హాలీవుడ్ నుంచి మహేశ్ బాబుకి ఆఫర్ అందిందా?
ఉగాదిలోపు ఏదో వింతైన వార్త బయటికొచ్చేలా ఉంది. మామూలుగా రాజమౌళి తన సినిమా తాలూకూ ప్రెస్ మీట్ ని ఏప్రిల్ నెలాఖర్లో ప్లాన్ చేశాడు. సో అదే వింత వార్తా అంటే కానే కాదు. ఈ ప్రెస్ మీట్ కి అవతార్ డైరెక్టర్ వస్తున్నా కాని, అది కూడా పెద్ద విషయం కాదు. ఎందుకంటే మన హీరోనే హాలీవుడ్ వెళుతున్నాడు. అదే అసలు హాట్ టాపిక్
మహేశ్ బాబుకి గ్లోబల్ హీరో అనిపించుకునే లుక్ ఉంటే ఉండొచ్చు. అంతమాత్రాన పిలిచి హాలీవుడ్ ఆఫర్ ఇవ్వాల్సిన అవసరమేంటి? ఈ ప్రశ్నకే ఐరన్ మ్యాన్, అవెంజర్స్ లాంటి సూపర్ హీరోల సినిమాలు తీసే మార్వెల్ స్టూడియోస్ దగ్గర ఆన్సర్ ఉన్నట్టుంది. ఈమధ్యే మార్వెల్ స్టూడియోస్ ప్రతినిధి మహేశ్ బాబుని కలిశాడట. కాని ఈ న్యూస్ బయటికి పొక్కలేదు. మరి డీల్ సెట్ అయ్యాకే ఎనౌన్స్ చేద్దామనుకున్నారో ఏమో కాని గట్టిగానే చర్చలు జరిగాయని తెలుస్తున్నాయి
ఇంతవరకు సూపర్ హీరోలుగా అమెరికన్లు, లేదంటే డాక్టర్ స్ట్రేంజ్ లో కనిపించిన కొరియన్ మొఖం, లేదంటే బ్లాక్ పాంథర్ గా ఆఫ్రో అమెరికనే కనిపించారు. ఇండియన్ ముఖమేది హాలీవుడ్ లో కామెడీ పాత్ర్లో తప్ప సూపర్ హీరో రోల్స్ లో కనిపించలేదు. అదే మహేశ్ బాబుకి దక్కేలా ఉంది. తనని సూపర్ హీరోగా తీసుకుంటే, హాలీవుడ్ మూవీలకు కొంత ఛేంజ్ రావటమే కాదు, ఇండియన్ మార్కెట్ ని ఈజీగా బుట్టలో పడేయొచ్చనేది వాళ్ల ఆలోచన. నిజానికి త్రిబుల్ ఆర్ కి గ్లోబల్ గా గుర్తింపు వచ్చినప్పుడు అమెరికన్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూల్లో చరణ్, ఎన్టీఆర్ ఇద్దరికీ అమెరికన్ సూపర్ హీరో సినిమాలు చేయాలనుందన్నారు. కాని ఆ ఛాన్స్ మాత్రం సూపర్ స్టార్ మహేశ్ బాబుకే దక్కేలా కనిపిస్తోంది.