Ram Charan: ఎన్టీఆర్, రామ్‌చరణ్‌పై మనసుపడ్డ హాలీవుడ్ సూపర్ స్టార్..
రాజమౌళి పుణ్యమా అని ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫేట్ మారిపోయింది. వీళ్లిద్దరూ ఇప్పుడు గ్లోబల్ లెవెల్‌లో గుర్తింపు ఉన్న స్టార్స్. ఈ ఇద్దరు స్టార్స్ త్వరలోనే హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే టాక్ వినిపిస్తున్న టైంలో.. ఓ హాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్, రామ్ చరణ్ గురించి చేసిన కామెంట్స్ ఇంట్రెస్టింగ్‌గా మారాయి.

Ram Charan And Jr. NTR Making Hollywood Movie
థోర్ సిరీస్‌తో ఫేమస్ అయిన క్రిస్ హెమ్స్‌వర్త్ రీసెంట్‌గా ట్రిపులార్ సినిమా చూశాడట. సినిమా తనకు చాలా బాగా నచ్చిందట. ఈ విషయాన్ని ట్విటర్‌లో పోస్ట్ చేశాడు క్రిస్ హెమ్స్‌వర్త్. సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ యాక్టింగ్ అద్భుతంగా ఉందంటూ మెచ్చుకున్నాడు క్రిస్. వాళ్లిద్దరితో సినిమా చేసే చాన్స్ వస్తే బాగుంటుందంటూ ట్వీట్ చేశాడు. హెమ్స్‌వర్త్ చేసిన ట్వీట్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.
వరల్డ్ వైడ్ స్టార్ హీరోగా గుర్తింపు ఉన్న హీరో మన ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో నటించే చాన్స్ వస్తే బాగుండు అనడం తెలుగు జాతి గర్వించదగ్గ విషయమంటున్నారు తారక్, చెర్రీ ఫ్యాన్స్. కేవలం వీళ్లిద్దరి విషయంలోనే కాదు. క్రిస్ హెమ్స్‌వర్త్‌కు ముందు నుంచీ ఇండియా అంటే చాలా ఇష్టం. ఈ విషయాన్ని చాలా ఇంటర్వ్యూస్‌లో చెప్పాడు హెమ్స్‌వర్త్. ఎక్స్‌ట్రాక్షన్ అనే పేరుతో ఇండియాలో ఓ సినిమా కూడా చేశాడు. ఇండియా మీద ప్రేమతో తన కూతురుకు కూడా ఇండియా అని పేరు పెట్టుకున్నాడు. హెమ్స్‌వర్త్ ట్వీట్‌తో ఫ్యాన్స్‌లో ఊహాగానాలు ఊపందుకున్నాయి. హెమ్స్‌వర్త్, రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి అవెంజర్స్ లాంటి ఓ సినిమా తీస్తే అద్భుతంగా ఉంటుందంటున్నారు ఫ్యాన్స్. ఇక ఆ సినిమాను రాజమౌళి డైరెక్ట్ చేస్తే వరల్డ్ సినిమా రికార్డ్స్‌ను బ్రేక్ చేయడం గ్యారెంటీ అంటున్నారు.