నితిన్ ఒక్కడికే అదెలా సాధ్యం.. మిగిలిన హీరోలు ఎందుకలా చేయలేకపోతున్నారు..?
సినిమా ఇండస్ట్రీ ఇది.. ఇక్కడ హిట్ ఉంటేనే మాట్లాడుతారు.. ఫ్లాప్ వస్తే కనీసం కనిపించిన పట్టించుకోరు. స్టార్ హీరోలు అంటే హిట్టు ఫ్లాప్ లకు భయపడరు కానీ మీడియం రేంజ్ హీరోలకు మాత్రం హిట్ అనేది కచ్చితంగా ఇంపార్టెంట్.

సినిమా ఇండస్ట్రీ ఇది.. ఇక్కడ హిట్ ఉంటేనే మాట్లాడుతారు.. ఫ్లాప్ వస్తే కనీసం కనిపించిన పట్టించుకోరు. స్టార్ హీరోలు అంటే హిట్టు ఫ్లాప్ లకు భయపడరు కానీ మీడియం రేంజ్ హీరోలకు మాత్రం హిట్ అనేది కచ్చితంగా ఇంపార్టెంట్. వాళ్లకు వరుసగా మూడు నాలుగు ఫ్లాపులు వచ్చాయి అంటే ఎవరు పెద్దగా పట్టించుకోరు. కానీ ఈ సూత్రం అందరికీ వర్తించిన నితిన్ కు మాత్రం వర్కౌట్ అవ్వదు. మనోడికి హిట్ ఫ్లాప్ అనేది జుజుబి. ఎన్ని ఫ్లాప్ సినిమాలు ఇచ్చిన మళ్లీ నెక్స్ట్ సినిమా కోసం ఒక క్రేజీ డైరెక్టర్.. ఒక పెద్ద బ్యానర్ రెడీగా ఉంటుంది. ఈ మ్యాజిక్ కేవలం నితిన్ విషయంలో మాత్రమే జరుగుతుంది. అదేంటో.. ఆ లాజిక్ ఏంటో ఎవరికి అర్థం కాదు. కావాలంటే చూడండి.. అప్పుడెప్పుడో నాలుగేళ్ల కింద కరోనా సమయంలో భీష్మ సినిమాతో హిట్ కొట్టాడు నితిన్.
ఆ సినిమా తర్వాత చెక్, రంగ్ దే, మాస్ట్రో, మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్.. ఇలా దండయాత్ర చేస్తూనే ఉన్నాడు. ఇందులో ఒక్కటి కూడా ఆడలేదు. కానీ ఇందులో చాలా సినిమాలు పెద్ద పెద్ద బ్యానర్స్ నుంచి వచ్చాయి. ఇప్పుడు కూడా మైత్రి మూవీ మేకర్స్ లో రాబిన్ హుడ్ మార్చి 28న విడుదల కానుంది. ఈ సినిమాకు వెంకీ కుడుముల దర్శకుడు. భీష్మ తర్వాత మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుండడంతో అంచనాలు కూడా బాగానే ఉన్నాయి. శ్రీ లీల ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఆమెకు కూడా ఇది సెకండ్ ఇన్నింగ్స్. ఇక దీని తర్వాత తమ్ముడు సినిమాతో రాబోతున్నాడు నితిన్. దీనికి వేణు శ్రీరామ్ దర్శకుడు. దిల్ రాజు నిర్మిస్తున్నాడు. అంటే మళ్ళీ ఒక క్రేజీ డైరెక్టర్.. ఒక పెద్ద బ్యానర్ అన్నమాట..! ఇక్కడ మరో బంపర్ ఆఫర్ ఏంటంటే నెక్స్ట్ రెండు సినిమాలు నిర్మించబోయేది కూడా దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్సే.
ముందు సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా అగ్ర నిర్మాతలు మీడియం హీరోలతో సినిమాలను నిర్మించడానికి అంతగా ఆసక్తి చూపించరు. కానీ నితిన్ విషయంలో మాత్రం అలాంటి ఫార్ములాస్ అసలు పట్టించుకోరు. బలగం వేణు దర్శకత్వంలో ఎల్లమ్మ అనే సినిమా రాబోతుంది. ఇందులో నితిన్ హీరోగా నటిస్తుంటే దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఇక ఇష్క్ ఫ్రేమ్ విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో ఒక స్పోర్ట్స్ డ్రామా చేస్తున్నాడు నితిన్. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుందనీ తెలుస్తుంది. ఈ రెండు సినిమాలు పూర్తయ్యే లోపు మరో రెండు మూడు సెట్ చేసుకుంటాడు ఈ హీరో. మళ్లీ మనోడి సినిమాలో హీరోయిన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటారు. ఇప్పుడు శ్రీలీలతో నటిస్తున్నాడు.. నెక్స్ట్ ఎల్లమ్మలో సాయి పల్లవి హీరోయిన్. ఏదేమైనా టాలీవుడ్ లో నితిన్ ఒక రేర్ పీస్. అగ్ర దర్శకులందరూ ఈయనతో పని చేస్తుంటారు.. హీరోయిన్స్ అందరూ నటిస్తారు.. పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు ఆయన ముందు క్యూ పడతాయి. చాలామంది మీడియం రేంజ్ హీరోలు కలలు కనే ప్రాజెక్ట్స్ ఈజీగా చేస్తాడు నితిన్. దేనికైనా రాసిపెట్టి ఉండాలి అంటారు కదా.. ఇది అదేనేమో..!