జానీ మాస్టర్ ఎలా చిక్కాడంటే.. ఇప్పుడేం జరగబోతోంది…

ఫేమస్‌ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ అలియాస్‌ షేక్‌ జానీబాషాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసు బృందం గోవాలోని లాడ్జిలో అతడిని అదుపులోకి తీసుకుంది. అక్కడి కోర్టులో హాజరు పరిచి హైదరాబాద్‌కు తీసుకువచ్చారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 19, 2024 | 07:31 PMLast Updated on: Sep 19, 2024 | 7:31 PM

How Johnny Master Got Trapped What Is Going To Happen Now

ఫేమస్‌ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ అలియాస్‌ షేక్‌ జానీబాషాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసు బృందం గోవాలోని లాడ్జిలో అతడిని అదుపులోకి తీసుకుంది. అక్కడి కోర్టులో హాజరు పరిచి హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. నేరుగా ఉప్పరపల్లి కోర్టులో జానీ మాస్టర్‌ను హాజరుపరిచారు. తనపై పలుమార్లు అత్యాచారం చేశాడంటూ ఓ మహిళా అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌ ఇచ్చిన ఫిర్యాదుతో.. నార్సింగి పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. బాధితురాలు రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి నార్సింగికి బదిలీ చేశారు. అతడిపై పోక్సో యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు.

ఐదు రోజులుగా జానీ జాడ లేకుండా పోయింది. అతని కోసం బృందాలుగా విడిపోయిన పోలీసులు.. గాలింపు చర్యలు చేపట్టారు. ఓ టీమ్ నెల్లూరుకు వెళ్తే.. మరో టీమ్‌ లద్దాఖ్ వెళ్లింది. ఇంకో టీమ్‌ గోవాకు వెళ్లగా.. అక్కడ జానీ పోలీసులకు చిక్కాడు. 2017లో జానీ మాస్టర్‌ తనకు పరిచయం అయ్యాడని.. పరిచయమయ్యాడు. 2019లో అతని బృందంలో అసిస్టెంట్‌గా చేరినట్లు బాధితురాలు చెప్తోంది. ముంబైలో ఓ మూవీ షూటింగ్ కోసం జానీ మాస్టర్‌తో పాటు.. తను మరో ఇద్దరు సహాయకులం వెళ్లారు. అక్కడ హోటల్‌లో తనపై జానీ మాస్టర్‌ అత్యాచారానికి పాల్పడ్డాడన్నది బాధితురాలి ఆరోపణ. ఈ విషయం ఎవరికైనా చెప్తే పని నుంచి తొలగిస్తానని.. సినిమా పరిశ్రమలో ఎప్పటికీ పనిచేయలేవని బెదిరించాడని కంప్లైంట్‌లో రాసిచ్చింది.

దీన్ని అవకాశంగా తీసుకుని.. హైదరాబాద్‌ నుంచి ఇతర నగరాలకు సినిమా చిత్రీకరణకు తీసుకెళ్లిన సందర్భాల్లో.. అనేకమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. షూటింగ్‌ సమయంలోనూ వ్యానిటీ వ్యాన్‌లో అసభ్యంగా ప్రవర్తించేవాడని తెలిపింది. లైంగిక కోరికలు తీర్చనందుకు ఒకసారి జుట్టు పట్టుకుని తలను అద్దానికి కొట్టాడని.. మతం మారి.. తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసేవాడని ఎఫ్‌ఐఆర్‌లో ఉంది. వేధింపులు భరించలేక జానీ మాస్టర్‌ బృందం నుంచి బయటకొచ్చేశానని.. అయినా సొంతంగా పనిచేసుకోనివ్వకుండా, ఇతర ప్రాజెక్టులు రాకుండా ఇబ్బందిపెట్టాడని వాపోయింది. తను మైనర్‌గా ఉన్నప్పుడు జానీ మాస్టర్ లైంగిక దాడి చేసినట్లు ఆరోపించడంతో.. అతనిపై పోక్సో కింద కేసు నమోదు చేశారు పోలీసులు.