ఎన్టీఆర్ లేకుండా ఎన్నాళ్లు… 1000 కోట్ల డౌట్…!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లేకుండానే డ్రాగన్ షూటింగ్ మొదలు పెట్టారు. తర్వాత కంటిన్యూ చేశారు. కట్ చేస్తే ఇక తను సెట్లో అడుగుపెడతాడనుకునే టైంలో, వార్ 2 మూవీ టీం బాంబు పేల్చింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 18, 2025 | 08:40 PMLast Updated on: Feb 18, 2025 | 8:40 PM

How Many Years Without Ntr 1000 Crore Doubt

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లేకుండానే డ్రాగన్ షూటింగ్ మొదలు పెట్టారు. తర్వాత కంటిన్యూ చేశారు. కట్ చేస్తే ఇక తను సెట్లో అడుగుపెడతాడనుకునే టైంలో, వార్ 2 మూవీ టీం బాంబు పేల్చింది. ఫిబ్రవరి మూడో వారం లోగా వార్ 2 షూటింగ్ పూర్తవుతుందనుకుంటే, ఇంకో పదిరోజులు షూటింగ్ కి టైం పట్టేలా ఉంది. దాని ఎఫెక్టే డ్రాగన్ మూవీ మీద పడుతోంది. ఎన్టీఆర్ లేకుండానే ఇప్పుడు డ్రాగన్ కొత్త షెడ్యూల్ ని కూడా పూర్తి చేయాల్సి వచ్చేలా ఉంది. కేజీయఫ్ 1 తో 450 కోట్లు, కేజీయఫ్ 2 తో 1300 కోట్లు, సలార్ తో 850 కోట్లు రాబట్టిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్. అలానే త్రిబుల్ ఆర్ తో 1350 కోట్లు, దేవరతో 670 కోట్లు రాబ్టట్టిన కటౌట్ ఎన్టీఆర్… అలాంటి ఈ ఇద్దరి కాంబినేషన్ లోసినిమా అంటే అది ఖచ్చితంగా 1000 కోట్ల బొమ్మే…అలాంటి ప్రాజెక్టు ఎంతకాలం ఎన్టీఆర్ లేకుండా నడుస్తుంది..? అసలు మ్యాన్ ఆఫ్ మాసెస్ డ్రాగన్ గా సెట్లో అడుగుపెట్టేదెప్పుడు? అడుగుపెట్టిన వెంటనే చేయబోయే ఫస్ట్ పనేంటి..? టేకేలుక్

నటసింహం బాలయ్య సెట్లో తాండవమాడుతుంటే, అబ్బాయ్ ఎన్టీఆర్ మాత్రం డ్రాగన్ గా గన్ పేల్చే పనిని వాయిదా వేస్తున్నాడు. అంతటికీ హిందీ మూవీ వార్ 2 నే కారణం. ఆ సినిమా షూటింగ్ ఎప్పుడో డిసెంబర్ లోఅవ్వాలి.. కాని షూటింగ్ డిలే అవుతూ వస్తోంది. దీంతో జనవరి చివరి వారంలో పూర్తి చేయబోతున్నారని, తర్వాత ఫిబ్రవరి మూడో వారమని ఇలా చాలా ఎనౌన్స్ మెంట్ లొచ్చాయి. కట్ చేస్తే ఈనెలాఖరి వరకు వార్ 2 షూటింగ్ జరుగుతుందట.అందుకే అప్పటి వరకు డ్రాగన్ షెడ్యూల్ ఎన్టీఆర్ లేకుండానే జరగబోతోందట. ఆల్రెడీ రామోజీ ఫిల్మ్ సిటీలో ఓల్డ్ కలకత్తా సెట్స్ వేస్తున్నారు. ఇక రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా తెరకెక్క ఈ సినిమా సెట్లోకి, ఎన్టీఆర్ మార్చ్ లోనే అడుగు పెట్టబోతున్నాడు. వచ్చేనెల రెండో వారం డ్రాగన్ సెట్లో తారక్ అడుగు పెట్టగానే, యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేశాడు ప్రశాంత్ నీల్.

ప్రజెంట్ హీరోయిన్ తో హీరో లాంగ్ షాట్లు, పాసింగ్ సీన్ లు 10 డేస్ లో ప్లాన్ చేశారట. ఇక్కడే ఎన్టీఆర్ డూప్ ని వాడాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. లాంగ్ షాట్స్, పాసింగ్ షాట్స్ వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాని అసలైన క్లోజ్ షాట్స్, యాక్షన్ సీక్వెన్స్ కి డూప్ అంటే , ఇది పవన్ మూవీ హరి హరవీరమల్లులా డైల్యూట్ అయ్యే ఛాన్స్ ఉంది.ఏదేమైనా వచ్చేనెల హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ తో ఎన్టీఆర్ డ్రాగన్ గా సెట్ ని కుదిపేయబోతున్నాడు. ఐతే అబ్బాయ్ హిందీ వార్ 2 తో బిజీ అయితే, బాబాయ్ బాలయ్య అఖండ సీక్వెల్ తో సెట్లో తాండవం చేస్తున్నాడు. ఆల్రెడీ అఖండ 2 సెట్లో అడుగుపెట్టాడు. మొదటి రోజే అఘోర సీన్ల షూటింగ్ తో బోయపాటి సీను, సెట్లో ఓల్టేజ్ పెంచేసినట్టున్నాడు.

ఏకంగా మూడు పాత్రల్లో అఘోరగా, నాగ సాధువుగా, నాయకుడిగా కనిపించనున్న బాలయ్య, మరో 5 నెలలు పూర్తి గా అఖండ 2 తోనే బిజీ కాబోతున్నాడు. వచ్చేనెల నుంచి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కూడా 6 నెలలు గ్యాప్ లేకుండా డ్రాగన్ షూటింగ్ తో బిజీ కాబోతున్నాడు. మొత్తంగా ఈ ఇద్దరు వచ్చేనెల నుంచి, జూన్ వరకు కేవలం మధ్యలో 10 రోజుల గ్యాప్ తీసుకుని, పూర్తిగా సెట్స్ కే పరిమితమయ్యేలా ఉన్నారు.