Hrithik Roshan: ఐదు వారాల్లో సిక్స్ ప్యాక్‌తో షాక్ ఇచ్చిన హృతిక్..

హృతిక్ కొత్త సిక్స్ ప్యాక్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఎన్నాళ్లకు హృతిక్‌ని ఇలా చూస్తున్నామని తన ప్యాన్స్ సంతోషపడుతుంటే, క్రిష్ మూవీ లవర్స్ ఇది క్రిష్ 4 కోసమే అంటున్నారు. నిజానికి హృతిక్ కూడా తనకున్నక్రేజ్, రేంజ్ కి తగ్గ సినిమా చేసి చాలా ఏళ్లవుతుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 18, 2023 | 04:59 PMLast Updated on: Oct 18, 2023 | 4:59 PM

Hrithik Roshan Details 5 Weeks Of Rigorous Physical Training

Hrithik Roshan: హృతిక్ రోషన్ ఐదు వారాలు కష్టపడి సిక్స్ ప్యాక్ తెచ్చుకున్నాడు. తన కొత్త ఫోటోతో దంగల్ స్టైల్లో షాక్ ఇచ్చాడు. దంగల్ టైంలో లావుగా ఉన్న అమిర్.. ఆ తర్వాత కండలు పెంచిన అమిర్ అంటూ 6 నెలల వర్కవుట్ల వీడియో పెట్టారు. కాని హృతిక్ 5 వారాలు.. అంటే నెలమీద మూడు నాలుగు రోజుల్లోనే సిక్స్ ప్యాక్ లుక్స్ తెచ్చుకున్నాడు. హృతిక్ కొత్త సిక్స్ ప్యాక్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఎన్నాళ్లకు హృతిక్‌ని ఇలా చూస్తున్నామని తన ప్యాన్స్ సంతోషపడుతుంటే, క్రిష్ మూవీ లవర్స్ ఇది క్రిష్ 4 కోసమే అంటున్నారు.

నిజానికి హృతిక్ కూడా తనకున్నక్రేజ్, రేంజ్ కి తగ్గ సినిమా చేసి చాలా ఏళ్లవుతుంది. అప్పట్లో ధూమ్ 2లో దొంగగా, క్రిష్ లో సూపర్ హీరోగా కనిపించాడు. పాన్ ఇండియా లెవల్లో దుమ్ముదులిపాడు. గ్రీక్ గాడ్‌గా ఫ్యాన్స్ పిలుచుకునే హృతిక్‌కు నార్త్‌తో పాటు సౌత్‌లో కూడా చాలా మందే అభిమానులున్నారు. కాని పదేళ్లుగా ఒక్కటంటే ఒక్కటి చెప్పుకోదగ్గ మూవీ చేయలేదు హృతిక్.. ఈలోపు ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, బన్నీ, యష్ అంటూ పాన్ ఇండియా లెవల్లో తనని మించిపోయారు సౌత్ స్టార్స్. అందుకే కొత్త ప్రయోగాలు వద్దు పాత పార్ములానే ముద్దంటున్నాడు.

వార్, విక్రమ్ వేద రీమేక్ హిట్టైనా తనకి పెద్దగా పేరు రాకపోవటం వల్ల, పాత హిట్ మూవీ క్రిష్‌కి 4వ సీక్వెల్ చేయబోతున్నాడు. అందుకే తన కండలు పెంచి, సిక్స్ ప్యాక్స్‌తో షాక్ ఇచ్చే పనిచేస్తున్నాడు. ఏదేమైనా హృతిక్ రోషన్‌ని ఇలా చూసి కొన్నేళ్లవుతోంది. దీంతో మళ్లీ పాత జోష్ వచ్చినట్టుంది.