వార్ 2 తర్వాత “హృతిక్ రోషన్ వెడ్స్ సానియా మీర్జా”.. పెళ్లి అక్కడేనా…?
సోషల్ మీడియా వచ్చిన తర్వాత సినిమా వాళ్ళ పర్సనల్ లైఫ్ లో ఏం జరిగినా సరే వాటి గురించి లేనిపోని రూమర్స్ క్రియేట్ చేస్తూనే ఉంటారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక ఫోటో వైరల్ చేస్తూ లేని వాటిని క్రియేట్ చేస్తూ జరగని వాటిని జరిగాయని చెబుతూ ఎవరి సందడి వాళ్ళు చేస్తూ ఉంటారు.
సోషల్ మీడియా వచ్చిన తర్వాత సినిమా వాళ్ళ పర్సనల్ లైఫ్ లో ఏం జరిగినా సరే వాటి గురించి లేనిపోని రూమర్స్ క్రియేట్ చేస్తూనే ఉంటారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక ఫోటో వైరల్ చేస్తూ లేని వాటిని క్రియేట్ చేస్తూ జరగని వాటిని జరిగాయని చెబుతూ ఎవరి సందడి వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక స్టార్ హీరో గురించి సోషల్ మీడియాలో ఒక గాసిప్ వైరల్ అవుతుంది. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తన భార్యకు విడాకులు ఇచ్చాడు ఎప్పుడో. ప్రస్తుతం సింగిల్ గా ఉంటున్న ఈ స్టార్ హీరో త్వరలోనే పెళ్లి చేసుకునే అవకాశం ఉందని ప్రచారం ఎప్పటినుంచో జరుగుతుంది.
దాదాపు మూడు నాలుగు నెలల నుంచి అతని వివాహం గురించి ఏదో ఒక న్యూస్ వైరల్ అవుతూనే ఉంది. ప్రస్తుతం చేస్తున్న వార్ 2 సినిమా తర్వాత పెళ్లి చేసుకునే ఛాన్స్ ఉందని రూమర్ వైరల్ చేశారు. అయితే ఇప్పుడు పెళ్లికూతురును కూడా వెతికేసింది సోషల్ మీడియా. తన భర్తతో విడాకులు తీసుకున్న మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా… హృతిక్ రోషన్ వివాహం చేసుకుంటున్నారని ప్రస్తుతం వీళ్ళిద్దరూ సింగిల్ గా ఉండటంతో పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నారని రీసెంట్ గా డేటింగ్ కూడా మొదలు పెట్టారని టాక్ నడుస్తోంది.
నెక్స్ట్ ఇయర్ వీళ్ళ మ్యారేజ్ ఉంటుందని హైదరాబాదులో గ్రాండ్ గా పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ షికారు చేస్తోంది ఓ న్యూస్. మొన్నామధ్య ఐశ్వర్యరాయ్ తో కూడా హృతిక్ రోషన్ వివాహం జరిగే ఛాన్స్ ఉందంటూ న్యూస్ చెక్కర్లు కొట్టింది. కానీ అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యరాయ్ మధ్య విభేదాలు ఏవి లేవని అది కేవలం మీడియా క్రియేట్ చేసిన న్యూసెన్స్ అనే క్లారిటీ చాలామందికి వచ్చింది. దీనితో వాళ్ళిద్దరు విడాకుల గురించి మీడియా పెద్దగా మాట్లాడుకోవడం లేదు. ఇక రీసెంట్ గా సానియా మీర్జా అలాగే టీమిండియా స్టార్ క్రికెటర్ మహమ్మద్ షమీ కలిసి ఉన్న ఫోటోలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ తో ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
చాలామంది ఆ ఫోటోలు చూసి నిజమే అనుకున్నారు. అయితే అవి కేవలం క్రియేట్ చేసినవనే క్లారిటీ తర్వాత వచ్చింది. తన భర్త నుంచి విడాకులు తీసుకున్న తర్వాత సానియా మీర్జా హైదరాబాదులో ఒంటరిగానే ఉంటుంది. సినిమాల్లో కూడా నటించే ఛాన్స్ ఉందనే న్యూస్ కూడా వచ్చింది. అయితే మరి ఆమె పెళ్లి చేసుకుంటుందా లేదంటే సింగిల్ గానే ఉండిపోతుందా అనేది క్లారిటీ లేదు. అయితే ఆమె మాజీ భర్త మాత్రం పాకిస్తానీ హీరోయిన్ ను పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయాడు. మరి హృతిక్ రోషన్ సానియా మీర్జా మ్యారేజ్ జరుగుతుందో లేదో చూడాలి. లేదంటే ఇది కూడా సోషల్ మీడియాలో గాసిప్ గా మిగిలిపోతుందో.