HRITHIK ROSHAN: రాజమౌళి కోసం ఆ స్టార్ హీరో పాట్లు..
ఎన్టీఆర్‌కి 4 హిట్లతో కెరీర్ గ్రాఫ్‌ని మార్చిన రాజమౌళి, తనతోపాటు ప్రభాస్‌కి కూడా రాజగురువు లాంటివాడే. వాళ్లకు ఏ డౌటొచ్చినా ముందుండి నడిపిస్తాడు. పవన్‌కి త్రివిక్రమ్, కన్నడ స్టార్ యష్‌కి ప్రశాంత్ నీల్, బన్నీకి సుకుమార్ ఇలాంటి రాజగురువులే హీరోల భవిష్యత్తుని తీర్చిదిద్దుతూ వచ్చారు.
HRITHIK ROSHAN: బాలీవుడ్‌లో షారుఖ్.. కింగ్ అవ్వటానికి దర్శకుడు యష్ చోప్రానే కారణం. తనే గురువులా మారి.. ఈ హీరో ఫేట్‌ని అప్పట్లో మార్చాడు. ఇక సల్మాన్ ఫేట్‌ని మార్చిన దర్శకుడు సూరజ్ భర్జాత్య. తనే మైనే ప్యార్ కియా, హమ్ ఆప్ కే హై కౌన్, ప్రేమ్ రతన్ ధన్ పాయో వంటి సినిమాలు తీశాడు. సల్మాన్ ఫేట్ మార్చాడు. ఇక ఆమిర్ ఖాన్‌కి ఇలాంటి గురూజీలు కోకొల్లలు. తెలుగు వరకొస్తే ఎన్టీఆర్‌కి 4 హిట్లతో కెరీర్ గ్రాఫ్‌ని మార్చిన రాజమౌళి, తనతోపాటు ప్రభాస్‌కి కూడా రాజగురువు లాంటివాడే.
Guntur Kaaram Review: ఇలా చేసావేంటి రమణా..? గురూజీని.. కుర్చీ మడతపెట్టి..!
వాళ్లకు ఏ డౌటొచ్చినా ముందుండి నడిపిస్తాడు. పవన్‌కి త్రివిక్రమ్, కన్నడ స్టార్ యష్‌కి ప్రశాంత్ నీల్, బన్నీకి సుకుమార్ ఇలాంటి రాజగురువులే హీరోల భవిష్యత్తుని తీర్చిదిద్దుతూ వచ్చారు. ఇలాంటి రాజగురువులు హ్రితిక్ రోషన్‌కి లేరు. అప్పట్లో ధూమ్ 2 లాంటి పాన్ ఇండియా హిట్లు ఉన్నా హ్రితిక్‌కి మాత్రం ప్రభాస్‌కి దక్కినట్టు బాహుబలి రేంజ్‌లో ఓమూవీ, చరణ్, ఎన్టీఆర్‌కి దక్కినట్టు త్రిబుల్ ఆర్, యష్‌కి దక్కిన కేజీయఫ్ లాంటి మూవీ దక్కలేదు. లగాన్ ఫేం అశుతోష్ గోవారికర్.. హ్రితిక్‌కి జోధా అక్బర్, మోహేంజోదారో లాంటి క్లాసిక్స్ ఇచ్చాడు. కానీ, అవేవి హిట్ కాలేదు. గ్రీక్ గాడ్ అనిపించుకున్న ఈ అందగాడికి, ట్యాలెంట్‌కి తగ్గ సాలిడ్ పాన్ ఇండియా హిట్ పడలేదు. పడేలా కూడా లేదు.
అందుకే రాజమౌళితో రీసెంట్‌గా తను మాట్లాడే పరిస్థితి వచ్చిందట. దీంతో మహేశ్ బాబు మూవీ తర్వాత హ్రితిక్ రోషన్ సినిమానే అంటున్నారు. కానీ, మహేశ్ మూవీ పూర్తవ్వాలంటే 3 ఏళ్లు పడుతుంది. కాబట్టి, ఆ తర్వాత సంగతి కోసం ఇప్పటి నుంచే హ్రితిక్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.