100 సెట్లు… 20 పాటలు.. 400 కోట్లు… లీకులు షాకులు..
రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా అంటేనే పాన్ ఇండియా లెవల్లో పూనకాలు, పుకార్లని మించిపోతాయి. ఆరేంజ్ డైహాట్ ఫ్యాన్స్ తన సొంతం. అయితే ఇప్పడు తన ఫౌజీ మూవీ లీకులుమాత్రం పాన్ ఇండియా లెవల్లో షాకులిస్తోంది. ఒక్క మూవీ కేవలం 6 నెలల్లో పూర్తయ్యేలా షెడ్యూల్ ప్లాన్ చేశారు.
రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా అంటేనే పాన్ ఇండియా లెవల్లో పూనకాలు, పుకార్లని మించిపోతాయి. ఆరేంజ్ డైహాట్ ఫ్యాన్స్ తన సొంతం. అయితే ఇప్పడు తన ఫౌజీ మూవీ లీకులుమాత్రం పాన్ ఇండియా లెవల్లో షాకులిస్తోంది. ఒక్క మూవీ కేవలం 6 నెలల్లో పూర్తయ్యేలా షెడ్యూల్ ప్లాన్ చేశారు. కాకపోతే వందసెట్లు, 20 పాటలతో లార్జర్ దేన్ లైఫ్ స్కేల్ లో సినిమా తీయాలనుకుంటే, 6నెలల టైం సరిపోతుందా? 400 కోట్లు కేవలం మేకింగ్ కే పెడుతున్నారంటే, హీరో రెమ్యునరేషన్ కలిపితే బడ్జెట్ కొండెక్కే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఐతే ఫౌజీ ఓ వార్ లవ్ స్టోరీ అని హింట్ ఇస్తే, ఇది మరో సీతారామమేమో అనుకుంటున్నారు కాని, అంతకుమించేలా వాళ్ల ప్లానింగ్ కనిపింస్తోంది. లీకులతో అలాంటి షాకులే తగులుతున్నాయి. ఇంతకి ఇవన్నీ బయటికి వస్తే హైప్ పెరుగుతుంది, కాలం కలిసొస్తుంది.. కాని ఎందుకు డైరెక్టర్ హను, ఈ విషయాలు బయటికి ఎనౌన్స్ చేయలేదు..ఎందుకు లీకుల మీదే ఫ్యాన్స్ ఆధారపడాల్సి వస్తోంది?
బాలీవుడ్ లో ఓ మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నా, భరీ సెట్లు, భారీ కాస్ట్యూమ్స్ అండ్ జెవెల్లరీ వాడినా, అరుపులే. దర్శక నిర్మాతలు ఆవిషయాలనే హైలెట్ చేస్తూ మీడియా ముందు డబ్బాలు కొట్టడం కామన్. కాని ఒక మూవీకి 100 సెట్లంటేనే షాకింగ్ న్యూస్… ఈ రోజుల్లో పాన్ ఇండియా మూవీలో 20 పాటలుండబోతున్నాయంటేనే, అదో రికార్డు.. ఇన్ని కలిసొచ్చే అంశాలను క్యాష్ చేసుకోవాలింటే ప్రచారం చేయాలి..
అలా కాకుండా ఫౌజీ టీం సైలెంట్ గా పని కానిచ్చేస్తోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో 100 సెట్లను రెడీ చేయటం మొదలవ్వగానే, వార్త బయటికి గుప్పుమంది.. లేదంటే లీకులే లేకపోతే ఈ విషయం బయటికొచ్చేది కాదు..
కాని హను రాఘవపూడే కాదు, ప్రభాస్ కూడా ఫౌజీ తాలూకు ఏ డిటేల్స్ బయటికి రాకూడదని కండీషన్ పెట్టాడట. బయటికి తెలిసినా సినిమాకు నష్టం లేని విషయాలు కూడా రివీల్ కాకుండా ఫిల్మ్ టీం జాగ్రత్త పడుతోంది.. అదే ఎందుకనే ప్రశ్నకు కారణమౌైతోంది….
నిజానికి ది రాజా సాబ్ తాలూకు అప్ డేట్లు , దాని గురించి డిస్కర్షన్ పెరగటానికి అడ్డు పడే ఏ అప్ డేట్ మరో నాలుుగ నెలల్ల వరకు రావద్దనేది ప్రభాస్ కండీషన్ అని తెలుస్తోంది. సలార్ రిలీజ్ టైంలో కల్కీ మీద ఎవరెన్ని ప్రశ్నలు అడిగినా, హీరో కాని, దర్శకుడు కాని ఆసినిమా గురించి నోరిప్పలేదు. కనీసం సింగిల్ అప్ డేట్ ఇవ్వలేదు
అలానే ఏప్రిల్ లో వచ్చే ది రాజా సాబ్ మీదే జనాల ఫోకస్ ఉండాలి కాని, మరే మూవీ మీద హైప్ క్రియేట్ అయినా ది రాజా సాబ్ మీద ఉండాల్సిన ఆడియన్స్ ఫోకస్ షిఫ్ట్ అవుతుంది. ఫలితంగా రావాల్సిన హైప్ రాదు.. అందుకే ఫౌజీనే కాదు, స్పిరిట్ తాలూకు అప్ డేట్లు కూడా ఇవ్వొద్దని దర్శకులకు తేల్చి చెప్పాడట ప్రభాస్. రెబల్ స్టార్ కి ఉన్న ఇమేజ్ కి తన ఏ సినిమాను ప్రమోట్ చేయకున్న జనాల్లోకి దూసుకెళుతుంది. అది తెలిసినా, ప్రొఫేషనల్ గా ఆలోచించే రెబల్ స్టార్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడట.