మెంటల్ రెబల్ స్టార్.. పిచ్చెక్కిస్తున్న రాజాసాబ్ సాంగ్స్ బడ్జెట్
రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు ఏం చేసినా సరే స్పెషల్ గానే ఉంటుంది. భారీ బడ్జెట్ సినిమాలతో దూకుడు మీద ఉన్న ఈ స్టార్ హీరో ఈ ఏడాది నుంచి సంవత్సరానికి రెండు సినిమాలు రిలీజ్ చేయాలని టార్గెట్ పెట్టుకొని ముందుకు వెళుతున్నాడు.
రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు ఏం చేసినా సరే స్పెషల్ గానే ఉంటుంది. భారీ బడ్జెట్ సినిమాలతో దూకుడు మీద ఉన్న ఈ స్టార్ హీరో ఈ ఏడాది నుంచి సంవత్సరానికి రెండు సినిమాలు రిలీజ్ చేయాలని టార్గెట్ పెట్టుకొని ముందుకు వెళుతున్నాడు. ప్రభాస్ కెరీర్… అందరు హీరోలతో పోలిస్తే చాలా డిఫరెంట్ గా ఉంది. ప్రభాస్ ను అందుకోవడం కూడా ఏ స్టార్ హీరోకు సాధ్యం కావడం లేదు. వసూళ్ల విషయంలో కూడా ప్రభాస్ చాలా స్పీడ్ మీద ఉన్నాడు. బాలీవుడ్ లో అయితే ప్రభాస్ దెబ్బకు సినిమాలను రిలీజ్ చేయాలంటేనే భయపడే పరిస్థితి క్రియేట్ అయింది.
ప్రజెంట్ ప్రభాస్ ది రాజా సాబ్ అనే సినిమాలో నటిస్తున్నాడు. రొమాంటిక్ కామెడీ హారర్ ఫిలిం గా రానున్న ఈ సినిమా కోసం ప్రభాస్ చాలానే కష్టపడ్డాడు. దాదాపుగా ఏడాదిపై నుంచి సినిమా కోసం వర్క్ చేస్తున్న ప్రభాస్… దీని గురించి క్రేజీ అప్డేట్స్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన ప్రభాస్ లుక్స్ కూడా సినిమాపై హైప్ భారీగా పెంచేసాయి. తమన్ మ్యూజిక్ ఇస్తున్న ఈ సినిమాలో నాలుగు పాటలు ప్రస్తుతం రెడీగా ఉన్నాయట. డిఫరెంట్ థీమ్స్ తో వాటిని డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.
మెలోడీ సాంగ్స్ కూడా చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారని… మాస్ తో డాన్స్ వేయించే సాంగ్స్ కూడా ఉంటాయట. సినిమా యూనిట్ ఈ పాటలను భారీ బడ్జెట్ తో షూట్ చేస్తుందని మేకర్ చెప్తున్నారు. సాంగ్స్ కోసమే 50 నుంచి 60 కోట్ల బడ్జెట్ కేటాయించారు. దుమ్ము రేపే కొరియోగ్రఫీతో పాటు బ్యూటిఫుల్ లొకేషన్స్ లో వీటిని షూట్ చేస్తారట. ప్రభాస్ కూడా దీనికి డేట్స్ భారీగా ఇవ్వటానికి రెడీగా ఉన్నట్టు మేకర్స్ చెప్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం వెకేషన్ కి వెళ్ళాడు. అది పూర్తయిన వెంటనే ముందు రాజాసాబ్ సెట్ లోనే అడుగుపెడతాడు.
వేరే ప్రాజెక్ట్స్ కంటే ముందే ఈ సినిమాకి డేట్స్ కూడా ఇచ్చేసాడట. ఈ సినిమా తర్వాతనే హను రాఘవపుడి డైరెక్షన్ లో సినిమా చేయనున్నాడు. ఇక ఫిబ్రవరి ఎండింగ్ లేదా మార్చి ఫస్ట్ వీక్ కు సినిమా షూటింగ్ కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాడట ప్రభాస్. ఆ తర్వాతనే మిగిలిన ప్రాజెక్టులపై ఫోకస్ చేస్తాడు. సంక్రాంతికి ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ రెడీ అవుతుందని నిర్మాతలు కూడా చెప్తున్నారు. రామోజీ ఫిలిం సిటీ లో ఇప్పటివరకు వేయని భారీ సెట్ ను కూడా ఈ సినిమా కోసం వేశారు మేకర్స్. ఇక ప్రభాస్ ఫస్ట్ టైం హారర్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న సినిమాలో నటించడంతో అందరి దృష్టి ఈ సినిమా మీదే ఉంది. మాళవిక మోహనన్.. నిధి అగర్వాల్, రిద్దీ కుమార్… సంజయ్ దత్ వంటి వాళ్ళు ఈ సినిమాలో నటిస్తున్నారు ఇక సమ్మర్ గిఫ్ట్ గా మే 16న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.