3 కోట్లకు 136 కోట్ల లాభం.. భన్వర్ సింగ్ షేకావత్ కు కోట్ల వర్షం
ఈరోజుల్లో సినిమాలకు లాభాలు రావడం అంటే సాధారణ విషయంగా మారిపోయింది. ఏ అంచనాలు లేని సినిమాలు భారీ హిట్లు కొడుతూ బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము రేపుతున్నాయి. అసలు లెక్కలోలేని సినిమాలు కూడా ప్రేక్షకులకు పిచ్చపిచ్చగా నచ్చేస్తున్నాయి.
ఈరోజుల్లో సినిమాలకు లాభాలు రావడం అంటే సాధారణ విషయంగా మారిపోయింది. ఏ అంచనాలు లేని సినిమాలు భారీ హిట్లు కొడుతూ బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము రేపుతున్నాయి. అసలు లెక్కలోలేని సినిమాలు కూడా ప్రేక్షకులకు పిచ్చపిచ్చగా నచ్చేస్తున్నాయి. సోషల్ మీడియా వచ్చిన తర్వాత సినిమా బాగుంది అనే టాక్ వస్తే చాలు వసూళ్లు పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. ముఖ్యంగా మన సౌత్ ఇండియా లో తీస్తున్న చిన్న చిన్న సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో దుమ్ము రేపుతున్నాయి. మూడు నాలుగు కోట్ల బడ్జెట్ పెట్టిన సినిమాలు కూడా వందల కోట్లు వసూలు చేస్తున్నాయి.
కన్నడలో వచ్చిన కాంతారా సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో మనం చూసాం. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై వచ్చిన ఆ సినిమా నిర్మాతలకు కాసుల పంట పండించింది. ఇప్పుడు ఆ సినిమాకు ప్రీక్వెల్ కూడా వస్తోంది. అలాగే మలయాళం లో రిలీజ్ అయిన కొన్ని సినిమాలు కూడా మన తెలుగులో మంచి డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ వచ్చిన తర్వాత చిన్న సినిమాలు బాగా ఆడుతున్నాయి. అందుకే మన నిర్మాతలు కూడా ఇతర భాషలో సినిమాలను ఇక్కడ కొన్ని ఆడిస్తున్నారు. ఇక మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ మన తెలుగులో కూడా స్టార్ హీరో అయిపోయాడు.
2024 లో వచ్చిన మలయాళం సినిమా.. ప్రేమలు.. అయితే తెలుగులో మంచి రిజల్ట్ సాధించింది. అసలు ఏ అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగులో కూడా సూపర్ హిట్ కొట్టడంతో నిర్మాతలకు భారీ లాభాలు వచ్చాయి. ముఖ్యంగా యూత్ కు ఈ సినిమా బాగా కనెక్ట్ అయింది. హీరోయిన్ మమిత బైజు కోసం ఈ సినిమాను యూత్ బాగా చూశారు. సోషల్ మీడియాలో కూడా ఆమె ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి. కొంతమంది సినిమా బాగాలేదని చెప్పినా మరి కొంతమంది మాత్రం సినిమాకు మంచి మార్కులు ఇచ్చారు.
దీనితో నిర్మాత ఫహద్ ఫాజిల్ కు లాభాల పంట పండించింది. తన ఫ్రెండ్స్ తో కలిసి ఆ సినిమాను నిర్మించిన ఫహద్ ఫాసిల్.. బాగానే ప్రమోట్ చేశాడు. కేవలం మూడు కోట్లు ఖర్చుపెట్టి తెరకెక్కించిన ఈ సినిమా ఏకంగా 136 కోట్లు వసూలు చేసింది. అంటే ఏకంగా 45 రెట్లు లాభం వచ్చింది ఈ సినిమాకు. పుష్ప పార్ట్ 2 సినిమాకు 350 కోట్లు ఖర్చు పెడితే 1800 కోట్లు వచ్చాయి.. ఆ లెక్కలో చూస్తే ప్రేమలు సినిమానే సూపర్ హిట్ అంటున్నారు జనాలు. బన్వర్ సింగ్ షెకావత్ గా పుష్ప సిరీస్ తో తెలుగు ప్రేక్షకులకు ఫహద్ ఫాజిల్ దగ్గరయ్యాడు. అయితే అతనికి పుష్ప పార్ట్ 2 లో రేంజ్ కు తగ్గ రోల్ ఇవ్వలేదు అనే ఆరోపణలు వచ్చాయి.