ఆ ఒక్క సీన్ తో బాలీవుడ్ ను పాతాళానికి తోక్కేసాడు, నార్త్ ఫిదా

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్... పుష్ప 2 సినిమాతో గ్రాండ్ విక్టరీ కొట్టాడు. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఆ అంచనాలకు మించి ఉంది అంటూ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఓవరాల్ గా సినిమాకు అన్ని వైపుల నుంచి పాజిటివ్ రివ్యూ రావడంతో ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 6, 2024 | 12:38 PMLast Updated on: Dec 06, 2024 | 12:38 PM

Huge Response For Jathara Scene In Pushpa 2 Movie

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్… పుష్ప 2 సినిమాతో గ్రాండ్ విక్టరీ కొట్టాడు. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఆ అంచనాలకు మించి ఉంది అంటూ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఓవరాల్ గా సినిమాకు అన్ని వైపుల నుంచి పాజిటివ్ రివ్యూ రావడంతో ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇక ముఖ్యంగా సినిమాలో కొన్ని సన్నివేశాలు చూసిన ఆడియన్స్ కు అయితే థియేటర్లో పూనకాలు వచ్చాయి. జాతర సీక్వెన్స్ లో అల్లు అర్జున్ నటన చూసి ఆయనను విమర్శించే వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారు.

ఆ సీక్వెన్స్ లో అల్లు అర్జున్ ప్రాణం పెట్టడమే కాకుండా సుకుమార్ ఆలోచన ఏ విధంగా ఉందో అది కచ్చితంగా చేసి చూపించాడు. ఈ సీక్వెన్స్ కు మాస్ ఆడియన్స్ తో పాటుగా క్లాస్ ఆడియన్స్ కూడా ఫిదా అయిపోయారు. ఇదే సీక్వెన్స్ సినిమాకు కచ్చితంగా 1000 కోట్లు కలెక్షన్లు తీసుకువచ్చే అవకాశం ఉంది అంటూ ట్రేడ్ అనలిస్టులు కామెంట్లు చేయడం చూస్తూనే ఉన్నాం. ఇక ఈ ఒక్క సీక్వెన్స్ తో నార్త్ ఇండియా మొత్తాన్ని అల్లు అర్జున్ షేక్ చేయడం ఖాయమని నార్త్ ఆడియన్స్ కు ఈ మాస్ జాతర పిచ్చపిచ్చగా నచ్చేస్తుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

ఆ సీన్ లో అల్లు అర్జున్ నటన అలాగే యాక్షన్ సీక్వెన్స్ అన్నీ కూడా సినిమాకు హైలెట్ గా నిలిచాయి. క్లైమాక్స్ కు మించి ఆ సీన్ ఉంది అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఒకరకంగా బన్నీ తాండవం ఆడాడు. సినిమా అంతా ఒక ఎత్తు అయితే ఆ ఒక్క జాతర సీన్ మరో ఎత్తు అంటూ ఇప్పుడు కామెంట్స్ వస్తున్నాయి. అలాగే సినిమాలో ఎమోషన్స్ తో పాటుగా నటించిన ప్రతి ఒక్కరి యాక్టింగ్ కూడా హైలెట్ గా నిలిచింది. రష్మిక మందన కొన్ని సీన్స్ లో కన్నీళ్లు పెట్టించింది. తన మొగుడు పై ఏ రేంజ్ లో ప్రేమ ఉంది అనేది ఆమె చూపించిన విధానానికి ఆడియన్స్ ఫిదా అయిపోయారు.

అలాగే సాంగ్స్ లో కూడా ఆమె ప్రాణం పెట్టి చేసింది. దీనితో రష్మిక లో ఈ రేంజ్ యాక్టింగ్ ఉందా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. ఇక విలన్ గా చేసిన ఫాహాద్ ఫాజిల్ ను సినిమా చూసిన ఆడియన్స్ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అటు నార్త్ ఇండియా లో కూడా సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఫ్రీ బుకింగ్ విషయంలో మాస్ ఆడియన్స్ తో పాటుగా క్లాస్ ఆడియన్స్ కూడా సినిమాకు మెయిన్ ఎసెట్ గా నిలిచారు.