Mahesh Babu: 60 కోట్లతో మహేశ్ బాబు కోసం.. 26 రకాల విల్లాలు రెడీ..!

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 11, 2023 | 04:59 PMLast Updated on: Feb 11, 2023 | 5:04 PM

Huge Sets For Mahesh Babu Rajamouli Movie

సూపర్ స్టార్ మహేశ్ బాబుకోసం 26 ప్యాలెసుల్లాంటి విలాసవంతమైన ఇళ్ళు రెడీ అవుతున్నాయి. అందులో ఒక ఇంటిని 10 కోట్లతో రెడీ చేశారు. ఒక్కో ఇంట్లో మహేశ్ బాబు కేవలం 30 రోజులు మాత్రమే ఉంటాడట.

అంటే నెలకి 30 కోట్ల రెంట్ తో ఉండబోతున్నాడా అనే డౌట్లొస్తాయి.. కానీ కాదు. త్రివిక్రమ్ మేకింగ్ లో మహేశ్ బాబు చేస్తున్న సినిమాకోసం 10 కోట్లతో ఏకంగా యూఎస్ లో 300 కోట్లు విలువచేసే ఓ ప్యాలెస్ ని వేశారట. అందులో 30 రోజులు షూటింగ్ ప్లాన్ చేశారు

ఐతే రాజమౌళి మాత్రం మహేశ్ బాబు సినిమా కోసం ఏకంగా 25 సెట్లు ప్లాన్ చేశాడని తెలుస్తోంది. అందులో 24 సెట్లు ఇళ్లేనట. ఇక 25వ సెట్ లైబ్రరీ అని తెలుస్తోంది. లైబ్రరీకి అటాచ్ చేసినట్టు పువ్వు ఆకారంలో 24 ఇంటి సెట్లు ఉంటాయట. అందులోనే 40 శాతం సినిమా ప్లాన్ చేస్తున్నారట. ఆ సెట్లను సౌత్ ఆఫ్రికాలో వేయబోతున్నారని తెలుస్తోంది.

మొత్తానికి రాజమౌళి వేయించే ఇళ్ల సెట్ లోనే మహేశ్ బాబు 12 నెలలు ఉండబోతున్నాడు. అంటే 15 రోజులకో ఇల్లు మారాల్సిందే.. ఆలెక్కన ఎన్ని కోట్లున్నా మహేశ్ బాబు మాత్రం కిరాయి ఇళ్లు మారినట్టు, సినిమాకోసం ఇళ్లు మారాల్సి వచ్చేలా ఉంది.