ఎన్ కన్వెన్షన్‌లో పెళ్లిళ్లకు భారీ పెళ్లి బుకింగ్‌లు.. ఇప్పుడు వాళ్ల పరిస్థితేంటి
హీరో నాగార్జునకు షాక్ ఇస్తూ.. ఎన్ కన్వెన్షన్‌ను నేలమట్టం చేసింది హైడ్రా. తుమ్మిడికుంట చెరువును ఆక్రమించి కన్వెన్షన్ నిర్మించారని ఆరోపణలు రాగా.. ముందు నోటీసులు ఇచ్చిన అధికారులు తర్వాత కూల్చివేతలు మొదలుపెట్టారు.
హీరో నాగార్జునకు షాక్ ఇస్తూ.. ఎన్ కన్వెన్షన్‌ను నేలమట్టం చేసింది హైడ్రా. తుమ్మిడికుంట చెరువును ఆక్రమించి కన్వెన్షన్ నిర్మించారని ఆరోపణలు రాగా.. ముందు నోటీసులు ఇచ్చిన అధికారులు తర్వాత కూల్చివేతలు మొదలుపెట్టారు. దీనిపై నాగార్జున హైకోర్టును ఆశ్రయించగా.. కాస్త ఊరట లభించింది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ఘటన తర్వాత.. తెలంగాణ రాజకీయాల్లో కుదుపులు మొదలయ్యాయ్. సెలబ్రిటీ ఫంక్షన్ హాల్ కూల్చివేయడంతో.. పాజిటివ్‌గానో, నెగిటివ్‌గానో.. ఏదో రకంగా రియాక్షన్స్ అయితే కనిపిస్తున్నాయ్. ఏమైనా ఈ ఘటనతో కన్వెన్షన్‌తో పాటు క్రెడిబిలిటీని కూడా నాగార్జున కోల్పోయారు.
ఐతే కూల్చివేత, ఆ తర్వాత పరిణామాల సంగతి ఎలా ఉన్నా.. కస్టమర్ల పరిస్థితి ఇప్పుడు అయోమయంగా మారింది. ఎన్ కన్వెన్షన్ ఫంక్షన్ చేయాలి అంటే.. మూడు నాలుగు నెలల ముందే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. బుక్ చేసుకునే సమయంలో కాస్త అడ్వాన్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఎన్ కన్వెన్షన్‌లో పెళ్లి లేదా శుభకార్యం అంటే.. ప్రెస్టీజ్‌లా ఫీల్ అయ్యేవాళ్లు చాలామందే ఉన్నారు. అందుకే మూడు నాలుగు నెలల ముందే ఆ ఫంక్షన్ హాల్ బుక్ చేసుకుంటారు. ఇప్పుడు కూడా అదే జరిగింది.
మరి వాళ్ల పరిస్థితి ఏంటన్నది ప్రశ్నగా మారింది. మరో రెండు మూడు నెలల్లో కార్తీక మాసం ఉంది. అది పెళ్లిళ్ల సీజన్ కూడా ! దీంతో ఎన్ కన్వెన్షన్‌కు భారీగా బుకింగ్స్ జరిగాయ్. ఇప్పుడు హైడ్రా కూల్చివేతతో.. వాళ్లందరూ అయోమయంలో పడ్డారు. డబ్బులు రిటర్న్ ఇచ్చినంత మాత్రాన.. వాళ్ల కంగారు తీరిపోదు. దీంతో ఏం చేయాలా అని వాళ్లంతా అయోమయంలోకి వెళ్లిపోయారు. మరి నాగార్జున వీళ్లందరినీ ఎలా డీల్ చేస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. పెళ్లిళ్ల నుంచి సదస్సులు, సమావేశాల వరకు ఎలాంటి వేడుకలనైనా ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించుకునే చాన్స్ ఉంటుంది. కేవలం సంపన్నులు మాత్రమే ఇక్కడి రేట్లను భరించగలరు. కన్వెన్షన్ సెంటర్ బుకింగ్స్ నుంచి మీల్స్ వరకు ప్రతి ఒక్కటీ ఖరీదైనదే.
కన్వెన్షన్ ద్వారా అక్కినేని నాగార్జునకు మంచి ఆదాయమే లభిస్తోంది. ఇక్కడ ఒక్క ఫంక్షన్ నిర్వహించాలంటే సుమారు 10 లక్షలకు పైగా చెల్లించాలని తెలిసింది. అది అక్కడ నిర్వహించే సెలబ్రేషన్స్ ప్యాకేజీ, అతిథుల సంఖ్య, హాల్ కెపాసిటీలాంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. అక్కడ వేడుకల్లో సెర్వ్ చేసే మీల్స్ ధర.. ఒక్క ప్లేట్‌కు సుమారు 14వందలకు పైగా ఉంటుందని టాక్. అందుకే ఇలాంటి ఫంక్షన్ హాల్‌లో శుభకార్యం జరిపించి.. తమ హోదా చూపించుకోవాలి అనుకునేవాళ్లు ఎందరో. మరి బుక్ చేసుకున్న వాళ్లంతా ఇప్పుడు గాల్లో చూపులు చూస్తున్నారు. వీళ్లకు నాగార్జున ఎలా సారీ చెప్తాడో.. ఏం చేస్తాడో ఏంటో. ఇదంతా ఓకే.. మూడు నెలల ముందు ఈ టెన్షన్‌ను కస్టమర్లు ఎలా తీసుకుంటారో.. ఏం ప్లాన్ చేసుకుంటారో పాపం అంటూ చర్చ మొదలైంది.