Hyderabad: భారతదేశంలోనే అతిపెద్ద మ్యూజికల్ ఫౌంటేన్ – నగరవాసులకు కానుకగా ఫన్ డే-సండే..!

అత్యంత రమణీయంగా ట్యాంక్ బండ్ మారనుందా..? నెక్లెస్ రోడ్డు మెడలో మరో మణిహారాన్ని అలంకరించారా..? హైదరాబాద్ నగరవాసులకు అత్యంత వింతానుభూతిని ఇవ్వనున్నారా..? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే ఈ సండే ఫన్ డే.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 17, 2023 | 01:50 PMLast Updated on: Feb 17, 2023 | 1:50 PM

Hyderabad Indias Bigest Water Fountain In Tank Bund

హైదరాబాద్ అంటే వినోదం, ఉపాధి, వ్యాపారం. ఈ మూడింటితో ముడిపడ్డ సమ్మేళనమే భాగ్యనగరం. వీకెండ్ వచ్చిందంటే చాలు ఎక్కడికైనా వెళ్లి సరదాగా గడుపుదామని అనుకునేవారు చాలా మంది ఉంటారు. కుటుంబంతోనో, ప్రెండ్స్ తోనో, ప్రేయసితోనో ట్యాంక్ బండ్ పై విహరించేందుకు వస్తూ ఉంటారు. కొందరైతే వారం రోజులు చేసిన పని భారాన్ని బ్రైన్ స్ట్రెస్ ను హూసేన్ సాగర్లో నిమజ్జనం చేసేందుకు వస్తారు. మళ్లీ ఫ్రెష్ మైండ్ ను నింపుకొని వారమంతా యాక్టీవ్గా పనిచేస్తారు. ఇలా ఇంతమందికి ఆనందాన్ని, అహ్లాదాన్ని, వినోదాన్ని పంచుతోంది మన హూస్సేన్ సాగర్.

సన్ డే – ఫన్ డే:
ఇప్పుడు తాజాగా హైదరాబాద్ నగరవాసుల భద్రత దృష్ట్యా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. సన్ డే ఫన్ డే పేరుతో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ట్యాంక్ బండ్, నక్లెస్ రోడ్ పరిసరప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ ట్రాఫిక్ లేకుండా, ఎక్కడ పడితే అక్కడ వాహనాల నిలుపుదల లేకుండా చూడాలని తెలిపారు. గతంలో కొన్ని ఆంక్షలు ఉన్నప్పటికీ అవి అంతంత మాత్రంగా అమలులో ఉండడంతో కొత్త మార్గదర్శకాలనలు జారీ చేసింది ప్రభుత్వం. హెచ్ ఎమ్ డీ ఎ (హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అధారిటీ) ట్రాఫిక్ లేని సండేగా ట్యాంక్ బండ్ ను రూపుదిద్దాలని.. తద్వారా అక్కడకి తరలివచ్చే వారికి ఫన్ డే గా కొన్ని మధుర క్షణాలను అందించేందుకు సిద్దం అయ్యింది.

భారతదేశంలోనే అతిపెద్ద మ్యూజికల్ వాటర్ ‎ఫౌంటేన్:
ఇటీవలే హూస్సేన్ సాగర్ లో హెచ్ ఎమ్ డీ ఏ కొన్ని ఏర్పాట్లను చేస్తూ వస్తుంది. ఇందులో భాగంగా భారతదేశంలోనే అత్యంత పెద్ద మ్యూజికల్ ఫ్లోటింగ్ ఫౌంటేన్ ను నిర్మించింది. దీని ద్వారా సండే ఫండే ఈవెంట్ ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు సాయశక్తులా కృషి చేస్తోంది. ఎన్టీఆర్ గార్డెన్స్ సమీపంలో ప్రారంభించిన ఈ ఫౌంటేన్ సుమారు 90మీటర్ల ఎత్తులో ఉంటుంది. దీనిపోడవు 180 మీటర్లు కాగా వెడల్పు 10మీటర్లు. దీనిని ఏర్పాటు చేసేందుకు 17.02 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు అధికారులు తెలపారు. ఇంతటి అద్భుతమైన ఫౌంటేన్లో రకరకాల థీమ్ విజువల్స్, మిస్ట్ ఫెయిరీ ఫాగ్, మ్యూజిక్ తో పాటూ క్లౌడ్ ఎఫెక్ట్ ను సృష్టించడం దీని ప్రత్యేకత అని చెబుతున్నారు. ఇందులో 800 జెట్ హై పవర్ నాజిల్స్ డైనమిక్ విజువల్ కు జోడించే 880 అండర్ వాటర్ ఎల్ఈడి లైట్లు ఉన్నాయి. ఫౌంటేన్ నాజిల్స్, జెట్ DMX నియంత్రణ సాధనాల ద్వారా సంగీతంతో అనుసంధానం చేస్తారు. ఛేంజింగ్ నాజిల్ నుంచి స్ప్రేల ఎత్తు 12 నుంచి 45మీటర్ల వరకూ ఉంటుంది. సెంట్రల్ జెట్ 90 మీటర్ల ఎత్తుకు చేరుకుంటుంది.

నిర్వహంచే సమయం:
వారంలో 5రోజులు 20నిముషాల చొప్పున మూడు షోలను హెచ్ఎండీఏ నిర్వహిస్తుంది. అదే వీకెండ్లలో అయితే సాయంత్రం 7 నుంచి 10 గంటల వరకూ నాలుగు షోలు ఉంటాయి. ఐదు నుంచి ఆరు ట్యూన్లతో కూడిన మ్యూజికల్ ఫౌంటేన్ దాదాపు 15 నిమిషాలపాటూ జరుగుతుంది. ఈ షో ప్రతి గంటకు ఒక్కసారి మాత్రమే నిర్వహిస్తారు. హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ ఒకప్పడికంటే కూడా ఎంతో ఆనందాన్ని సందర్శకులకు అందజేస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు.

 

 

T.V.SRIKAR.