Hyper Aadi: లవ్ స్టోరీ.. మ్యారేజ్ దాకా వెళ్లకపోవడానికి అదే కారణం: హైపర్ ఆది

జోర్దార్ పార్టీ విత్ సుజాత అనే షోలో పాల్గొని తన బాల్యం, కెరీర్, ఫ్యామిలీ, ప్రేమ వంటి వివరాలు పంచుకున్నాడు. ఈ సందర్భంగా హైపర్ ఆది ప్రేమ విషయం గురించి సుజాత అడిగింది. మీరు ఒకరిని ప్రేమించారు కదా.. మరి పెళ్లెందుకు చేసుకోలేదు అని ప్రశ్నించింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 15, 2024 | 09:22 PMLast Updated on: Feb 15, 2024 | 9:22 PM

Hyper Aadi Said His Love Story In Jordar Party With Sujatha In Dial News

Hyper Aadi: బుల్లితెర ప్రేక్షకులకు హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ షో ద్వారా స్టార్‌డమ్ సంపాదించుకున్న ఈ కమెడియన్.. ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోస్ కూడా చేస్తున్నాడు. అటు సినిమాలతోనూ బిజీగా ఉన్నాడు. ఈ యంగ్ కమెడియన్ తాజాగా డయల్ న్యూస్ యూట్యూబ్ ఛానెల్‌కు స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. జోర్దార్ పార్టీ విత్ సుజాత అనే షోలో పాల్గొని తన బాల్యం, కెరీర్, ఫ్యామిలీ, ప్రేమ వంటి వివరాలు పంచుకున్నాడు.

Revanth Reddy: ఔరంగజేబులా కనిపిస్తున్న హరీష్ రావు: సీఎం రేవంత్

ఈ సందర్భంగా హైపర్ ఆది ప్రేమ విషయం గురించి సుజాత అడిగింది. మీరు ఒకరిని ప్రేమించారు కదా.. మరి పెళ్లెందుకు చేసుకోలేదు అని ప్రశ్నించింది. దీనికి హైపర్ ఆది మాట్లాడుతూ తన ప్రేమ విషయాన్ని చెప్పాడు. తను స్కూల్‌ నుంచే ఒక అమ్మాయిని ప్రేమించినట్లు చెప్పాడు. పదో తరగతి చదువుతున్నప్పుడు ఒక అమ్మాయిని చూసి ఇష్టపడ్డానని, అప్పుడు చూపులు మాత్రమే కలిశాయన్నాడు. తర్వాత ఇంటర్‌ తర్వాత చాలా కాలానికి ఆ అమ్మాయితో పరిచయం పెరిగిందని, ఫోన్ నెంబర్లు మార్చుకున్నామన్నాడు. ఈ దశలో మరింత ప్రేమ పెరిగిందని, ఆ తర్వాత ఇద్దరూ ఒకే కాలేజీలో చేరామన్నాడు. కొంతకాలం ప్రేమించుకున్నప్పటికీ.. ఆ టైంలో తనకు ఉద్యోగం లేకపోవడం వల్ల, ఆ అమ్మాయికి ఇంట్లో వాళ్లు పెళ్లి సంబంధాలు చూసి, పెళ్లి చేశారని చెప్పాడు. తను కెరీర్లో సెటిలవ్వకపోవడం వల్లే ఆ ప్రేమ పెళ్లి దాకా వెళ్లలేదన్నాడు.

ఇక.. తాను చాలా మంది అమ్మాయిలతో ధైర్యంగా మాట్లాడేవాడినని, కానీ, ఆ అమ్మాయితో మాత్రం మొదట సరిగ్గా మాట్లాడలేకపోయానని చెప్పాడు. తనమీద ఉన్న ప్రేమ వల్లే ఆ అమ్మాయితో మాట్లాడలేకపోయానని చెప్పుకొచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో హైపర్ ఆది మరెన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఈ పూర్తి ఇంటర్వ్యూ వీడియో కింద ఉంది.