HYPER ADI: పవన్ కోసం హైపర్ ఆది.. ఏం చేయబోతున్నాడో తెలుసా..
పవన్‌కు అండగా తాము ఉంటామని.. ఆయన అభిమానులు, ఇండస్ట్రీ సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారు. పవన్ కల్యాణ్‌ను, మెగా ఫ్యామిలీని.. హైపర్ ఆది ఎంతలా అభిమానిస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

HYPER ADI: రాబోయే ఎన్నికలు పవన్ కల్యాణ్‌కు, జనసేనకు చాలా కీలకం. వైసీపీని గద్దె దించడమే లక్ష్యమని.. జగన్‌ను అధఃపాతాళానికి తొక్కకపోతే పేరు మార్చుకుంటానని సభ సాక్షిగా సవాల్ చేసిన పవన్.. పార్టీ అభ్యర్థులందరినీ గెలిపించుకోవడంతో పాటు.. కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులకు ఎన్నికల ఖర్చులు ఇచ్చేందుకు, తన ప్రచార వ్యయానికి.. సొంత ఆస్తులు అమ్ముకునేందుకు కూడా సిద్ధం అవుతున్నాడు.
Mamidala Yashaswini Reddy: అత్తపై తిరుగుబాటు.. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్తపై తిరుగుబాటు..
ఒక రకంగా పార్టీ కోసం ఒంటరి పోరు చేస్తున్నారు. ఐతే పవన్‌కు అండగా తాము ఉంటామని.. ఆయన అభిమానులు, ఇండస్ట్రీ సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారు. పవన్ కల్యాణ్‌ను, మెగా ఫ్యామిలీని.. హైపర్ ఆది ఎంతలా అభిమానిస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్‌కు భక్తుడిని అని చెప్పుకుంటుంటాడు ఆది. ఆ మధ్య జనసేన మీటింగ్‌లో పవన్ మీద, పార్టీ మీద.. ఆది చేసిన కామెంట్లు ఇప్పటికీ వైరల్ అవుతుంటాయ్. ఆది మాటలు గూస్‌బంప్స్ అంటూ పవన్ ఫ్యాన్స్ షేర్ చేస్తుంటారు. ఐతే ఎన్నికల వేళ పవన్‌కు సాయంగా ఉండాలని హైపర్ ఆది రెడీ అయినట్లు తెలుస్తోంది. దీనికోసం సినిమాలను, షోలను కూడా పక్కనపెట్టబోతున్నాడట. జనసేన అభ్యర్థులు పోటీ చేసే స్థానాల్లో పార్టీ తరఫున ప్రచారానికి సిద్ధం అవుతున్నాడని తెలుస్తోంది. ఆది నిర్ణయంపై.. పవన్ ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు ప్రశంసలు గుప్పిస్తున్నారు.
ఫేవరెట్ హీరో కోసం.. కెరీర్‌ను కూడా త్యాగం చేసేందుకు సిద్ధం అయ్యావంటే.. ఇదయ్యా నిజమైన అభిమానం అంటే అని పొగడ్తల వర్షం గుప్పిస్తున్నారు. ఇక అటు పవన్ మరో ఫ్యాన్, ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ కూడా.. కార్యకర్తలను ఎంకరేజ్ చేసేందుకు ఓ పాట రిలీజ్ చేశాడు. ఈ ఇద్దరే కాదు.. మరికొందరు కూడా పవన్ కోసం ఎన్నికల ప్రచారానికి సిద్ధం అవుతున్నట్లుగా తెలుస్తోంది.