నేను పాకిస్థానీ కాదు.. ఇండియన్.. ఫ్యాన్స్‌కు ఫౌజీ హీరోయిన్ లెటర్
ఫహల్గాం ఎటాక్ నేపథ్యంలో ఫౌజీ సినిమాలో హీరోయిన్‌గా చేస్తున్న ఇమాన్వీని టార్గెట్ చేశారు టాలీవుడ్ ఫ్యాన్స్. ఇమాన్వీ తండ్రి పాకిస్థాన్ ఆర్మీలో పని చేసిన మాజీ అధికారి అని..

ఫహల్గాం ఎటాక్ నేపథ్యంలో ఫౌజీ సినిమాలో హీరోయిన్‌గా చేస్తున్న ఇమాన్వీని టార్గెట్ చేశారు టాలీవుడ్ ఫ్యాన్స్. ఇమాన్వీ తండ్రి పాకిస్థాన్ ఆర్మీలో పని చేసిన మాజీ అధికారి అని.. అలాంటి వ్యక్తి కూతురికి ఇండియాలో సినిమాలు చేసే అర్హత లేదంటూ పోస్టులు పెట్టారు. ఫౌజీ సినిమాలో హీరోయిన్‌ను వెంటనే మార్చాలని.. లేదంటే సినిమాను బ్యాన్ చేస్తామంటూ చెప్పారు. ఈ నేపథ్యంలో ఇమాన్వీ ఫ్యాన్స్‌కు లెటర్ రాశారు.
ఇదంతా ఫేక్ న్యూస్ అని.. తన కుటుంబంలో ఎవరికీ పాక్ ఆర్మీతో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. తాను కేవలం ఇండో-అమెరికన్ అని పాకిస్థాన్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. బై బర్త్ తాను అమెరికన్ సిటిజెన్ అని.. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ మీద తనకు ఎంతో గౌరవం ఉందని చెప్పారు. ఇండియన్ హెరిటేజ్‌ను కాపాడేందుకు ప్రాణం ఉన్నంతవరకూ ప్రయత్నిస్తానంటూ లెటర్ రిలీజ్ చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు కథనాలను ఎవరూ నమ్మొద్దంటూ ఫ్యాన్స్‌ను రిక్వెస్ట్ చేశారు.