ఎన్టీఆర్ అడిగితేనే పట్టించుకోలేదు.. నాని కోసం వస్తాడా.. మీ పిచ్చి కాకపోతే..!
కేవలం డబ్బు మాత్రమే రూల్ చేస్తున్న ఇండస్ట్రీలో ఇప్పటికీ వాల్యూస్ ఉన్నాయి అంటే నమ్మడం సాధ్యమేనా..! ఓ అమ్మాయి వారానికి పడుద్ది..

కేవలం డబ్బు మాత్రమే రూల్ చేస్తున్న ఇండస్ట్రీలో ఇప్పటికీ వాల్యూస్ ఉన్నాయి అంటే నమ్మడం సాధ్యమేనా..! ఓ అమ్మాయి వారానికి పడుద్ది.. ఇంకో అమ్మాయి నెలకు పడుద్ది.. ఇంకొకరు సంవత్సరానికి పడుద్ది.. చివరికి ఏ అమ్మాయి అయినా పడాల్సిందే..! అని పవన్ కళ్యాణ్ చెప్పినట్టు ఇండస్ట్రీలో కూడా ఏదో ఒక రెమ్యూనరేషన్ దగ్గర ఎవరో ఒకరు కాంప్రమైజ్ అవ్వాల్సిందే. కానీ నాకు డబ్బు అవసరం లేదు నేను నమ్ముకున్న వాల్యూస్ మాత్రమే నాకు కావాలి.. అనుకునే నటులు ఎంతమంది ఉంటారు..? అలాంటి వాళ్ళు ఉంటే నిజంగా వాళ్లకు సెల్యూట్ చేయాల్సిందే కదా..! ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న నటుడు కూడా అలాంటి కేటగిరీలోకి వస్తాడు. ఆయన మరెవరో కాదు పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి.
ఈ జనరేషన్ ఆడియన్స్ కు నారాయణమూర్తి అంటే తెలియదేమో కానీ.. 90స్ కిడ్స్ ను అడిగితే ఆయన ఎవరో పూర్తిగా తెలుస్తుంది. చిరంజీవి, బాలకృష్ణ లాంటి హీరోలు కమర్షియల్ సినిమాలతో ఇండస్ట్రీని రూల్ చేస్తున్న సమయంలో కూడా.. తనదైన పంతాలు సినిమాలు చేసి సూపర్ హిట్స్ అందుకున్న హీరో ఈయన. కొన్నేళ్లుగా సినిమాలు చేయడం లేదు నారాయణమూర్తి. అయితే తాజాగా నాని పారడైజ్ సినిమాలో మూర్తి గారికి ఒక అద్భుతమైన పాత్రను శ్రీకాంత్ ఓదెల ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. మీరు అయితేనే ఆ పాత్రపు న్యాయం చేస్తారు అంటూ శ్రీకాంత్ పెళ్లి నారాయణ మూర్తిని అడిగాడని.. హీరోతో సమానమైన పాత్ర మీది అని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. కథ చెప్పడం వరకు బాగానే ఉంది.. కానీ ఆ పాత్ర చేయడానికి నారాయణమూర్తి ఒప్పుకుంటాడా అనేది అసలు డౌట్. ఎందుకంటే తన సొంత నిర్మాణ సంస్థ స్నేహ చిత్ర బ్యానర్ తప్ప.. బయట సినిమాలు చేయడం మానేసి దాదాపు 35 సంవత్సరాలు అయిపోయింది. 1985లో ఈతరం బ్యానర్లో వచ్చిన అర్థరాత్రి స్వతంత్రం తర్వాత బయటి నిర్మాతలకు సినిమాలు చేయడం లేదు నారాయణమూర్తి. తన గురువు దాసరి నారాయణరావు కోసం అప్పుడప్పుడు ప్రత్యేక పాత్రలు మాత్రమే చేశాడు ఈయన.
ఒకసారి తన బ్యానర్ స్థాపించిన తర్వాత.. కమర్షియల్ సినిమాల జోలికి, అలాంటి పాత్రలవైపు వెళ్ళలేదు మూర్తి. ఎంతమంది ఎన్ని ఆఫర్స్ ఇచ్చినా కూడా నారాయణమూర్తి వాటికి నో చెబుతూనే వచ్చాడు. ఇప్పుడు నాని సినిమాకు ఓకే చెప్తాడా అనేది మిలియన్ డాలర్ ప్రశ్న. అంతెందుకు పదేళ్ల కింద టెంపర్ సినిమాలో పోసాని కృష్ణమురళి పోషించిన పాత్ర కోసం ముందు నారాయణమూర్తిని అడిగాడు పూరి జగన్నాథ్. ఆ పాత్ర కోసం ఏకంగా బ్లాంక్ చెక్ ఆఫర్ చేశాడు. కానీ తాను చేయను అని సున్నితంగా తిరస్కరించాడు మూర్తి. ఆయన కాదన్నా కూడా ఆయన మీద అభిమానంతో పోసాని పాత్రకు మూర్తి అనే పేరు పెట్టాడు పూరి. అప్పుడు ఎన్టీఆర్ సినిమా కోసమే అసలు టెంప్ట్ అవ్వలేదు నారాయణ మూర్తి. ఇప్పుడు నాని సినిమా కోసం అడిగితే చేస్తాడా..! ఒకవేళ పారడైజ్ సినిమాలో నారాయణమూర్తి కానీ నటిస్తే అంతకంటే సంచలనం మరొకటి ఉండదు. చూడాలిక శ్రీకాంత్ ఓదెల ఏం చేస్తాడో..?