ఆ 1000 కోట్లకు నాది హామీ.. ప్రశాంతంగా వెళ్లండి.. వాళ్లకు మాటిచ్చిన పవన్ కళ్యాణ్..!
అయినవాళ్లకు కష్టం వస్తే అరగంట ఆలస్యంగా వస్తానేమో.. అదే ఆడవాళ్లకు కష్టం వస్తే అరక్షణంలో అక్కడ ఉంటా.. అంటూ లెజెండ్ సినిమాలో బాలకృష్ణ ఒక డైలాగ్ చెప్తాడు గుర్తుంది కదా.

అయినవాళ్లకు కష్టం వస్తే అరగంట ఆలస్యంగా వస్తానేమో.. అదే ఆడవాళ్లకు కష్టం వస్తే అరక్షణంలో అక్కడ ఉంటా.. అంటూ లెజెండ్ సినిమాలో బాలకృష్ణ ఒక డైలాగ్ చెప్తాడు గుర్తుంది కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను చూస్తుంటే అదే అనిపిస్తుంది. ప్రజలకు కష్టం వస్తే ముందు గనక ఆలోచించకుండా వెళ్ళిపోతున్నాడు పవన్.. కానీ తనమీద వందల కోట్ల బడ్జెట్ పెట్టిన నిర్మాతలను మాత్రం అసలు కరుణించడం లేదు. ఆయన కోసం ఏళ్లకేళ్లు వెయిట్ చేస్తున్నా కూడా వాళ్లకు ఎదురుచూపులు తప్ప ఇంకేమీ మిగలడం లేదు. చూసిచూసి చూసే వాళ్లకు బోర్ వస్తుంది.. కానీ పవన్ మాత్రం తన సినిమాలను ముందుకు తీసుకెళ్లడం లేదు. అందుకే నిర్మాతలు కూడా ఆ సినిమాల మీద ఆశలు వదిలేసుకుని చేసినప్పుడు చేస్తాడులే అని లైట్ తీసుకున్నారు. వాళ్లకు కూడా ఆశలు లేని సమయంలో సడన్ గా పవన్ కళ్యాణ్ నుంచి పిలుపు వచ్చింది. నమ్మడానికి కాస్త కష్టంగా అనిపించినా కూడా తనతో సినిమాలు కమిట్ అయిన నిర్మాతలందరినీ కలిశాడు పవన్. వాళ్లతో చాలాసేపు మాట్లాడాడు.. నెక్స్ట్ ఏం చేయాలి.. ఒప్పుకున్న సినిమాలను ఎంత త్వరగా పూర్తి చేయాలి అనే విషయం మీద వాళ్లతో మాట్లాడాడు.
మంగళగిరిలోని తన పార్టీ ఆఫీస్ లోనే ఈ మీటింగ్ జరిగింది. దీనికి మైత్రి మూవీ మేకర్స్, ఏఎం రత్నం, డివివి దానయ్య వచ్చారు. ఈ మీటింగ్ లో నిర్మాతలకు గుడ్ న్యూస్ చెప్పాడు పవన్. ఇంక మీరు తనకోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదని.. వీలైనంత త్వరగా మూడు సినిమాలు పూర్తి చేస్తాను అంటూ మాటిచ్చాడు. ఎప్పటిలాగే మాకు నమ్మకం లేదు దొర అని పవన్ అభిమానులు అంటున్నారు.. కానీ ఈసారి మాత్రం ఇచ్చిన మాట వెనక్కి తీసుకునేది లేదు అంటున్నాడు పవర్ స్టార్. మీరు స్క్రిప్ట్ సిద్ధం చేసుకుని షెడ్యూల్స్ వేసుకొని రెడీగా ఉండండి నేను వచ్చి పూర్తి చేసి వెళ్ళిపోతా అంటున్నాడు జనసేనాని. ఇప్పటికే హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తి అయిపోయింది. దీనికి పవన్ కేవలం నాలుగు రోజుల డేట్స్ ఇస్తే చాలు. అన్ని కుదిరితే మే మొదటి వారంలో ఈ షెడ్యూల్ కు పవన్ రానున్నాడు. దీని తర్వాత లైన్లో ఓజి సినిమా ఉంది. దీని నెక్స్ట్ షెడ్యూల్ సింగపూర్, థాయిలాండ్ లాంటి దేశాల్లో చేయాల్సి ఉంది. కానీ పవన్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దేశం దాటే ఛాన్స్ లేదు. అందుకే మంగళగిరి పరిసర ప్రాంతాల్లోనే కావాల్సిన సెట్టు వేసి షూటింగ్ పూర్తి చేసుకోవాలి అని నిర్మాతలకు పవన్ కళ్యాణ్ చెప్పినట్టు తెలుస్తోంది. జూన్ నాటికి ఓజీ పూర్తి చేసి.. సెప్టెంబర్ 5న సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
ఇక జూలై నుంచి సరిగ్గా 40 రోజులు మైత్రి మూవీ మేకర్స్ కు డేట్స్ ఇవ్వనున్నాడు పవన్. ఆలోపు హరీష్ శంకర్ బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేసుకుని ఉండాలని.. రెండు నెలల్లో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ పూర్తి చేస్తాను అని పవన్ మాట ఇచ్చినట్టు ప్రచారం జరుగుతుంది. ఒప్పుకున్న మూడు సినిమాలు పూర్తి చేసిన తర్వాత ఇక కొత్త సినిమాలు ఏవి ఒప్పుకునేలా కనిపించడం లేదు పవన్. రాబోయే మూడేళ్లు పూర్తిగా రాజకీయాల మీద ఫోకస్ చేయనున్నాడు. వచ్చే ఎన్నికల తర్వాత మళ్లీ పవర్ నుంచి కొత్త సినిమాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అప్పటివరకు ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే 2026లోపే పవన్ కళ్యాణ్ నుంచి మూడు సినిమాలు విడుదల కానున్నాయి. వీటిలో హరిహర వీరమల్లు దాదాపు 350 కోట్లతో నిర్మిస్తున్నాడు ఏఎం రత్నం. ఇక ఓజి సినిమా బిజినెస్ దాదాపు 300 కోట్ల పైన జరుగుతుంది. ఉస్తాద్ భగత్ సింగ్ ఇంకా మొదలు కాలేదు కానీ.. గబ్బర్ సింగ్ కాంబినేషన్ కాబట్టి కచ్చితంగా 250 కోట్లకు పైగానే బిజినెస్ జరగడం ఖాయం. ఎలా చూసుకున్నా కూడా పవన్ మీద ప్రస్తుతం 1000 కోట్ల బిజినెస్ జరుగుతుంది. దానికి నేనే హామీ అంటున్నాడు పవర్ స్టార్. మరి ప్రజలకు ఇచ్చిన మాట ఎప్పటికప్పుడు నెరవేర్చుకుంటున్న పవన్.. నిర్మాతలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడా లేదా అనేది చూడాలి.