Faria-Abdullah-Comments : పెళ్లి చేసుకోకుండా పిల్లలని కంటాను
నువ్వు పెళ్లి చేసుకెళ్ళిపోతే బంగార్రాజు (Bangarraju).. మాకింకెవ్వడు కొనిపెడతడు కోకా బ్లౌజు అంటు తెలుగు ప్రేక్షకులని ఒక ఊపిన నటి ఫరియా అబ్దుల్లా.. ఇప్పుడు ఆమె అభిమానులు ఆ పాటకి రివర్స్ పాడుకుంటున్నారు. నువ్వు పెళ్లి వద్దంటే మేమేం కావాలని.
నువ్వు పెళ్లి చేసుకెళ్ళిపోతే బంగార్రాజు (Bangarraju).. మాకింకెవ్వడు కొనిపెడతడు కోకా బ్లౌజు అంటు తెలుగు ప్రేక్షకులని ఒక ఊపిన నటి ఫరియా అబ్దుల్లా.. ఇప్పుడు ఆమె అభిమానులు ఆ పాటకి రివర్స్ పాడుకుంటున్నారు. నువ్వు పెళ్లి వద్దంటే మేమేం కావాలని. వాళ్ళు అలా ఎందుకు పాడుకునే అవసరం వచ్చిందో చూద్దాం
నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) హీరోగా 2021 లో వచ్చిన జాతిరత్నాలుతో ఫరియా తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయ్యింది. ఎంటర్ టైన్మెంట్ ప్రదానం సాగిన ఆ మూవీలో లాయర్ గా నవ్వుల్ని పూయించింది. క్యారక్టర్ కి తగ్గట్టు తనని తాను మౌల్డ్ చేసుకున్న విధానం సూపర్ గా ఉంటుంది. కాబట్టి యువరానర్ నా క్లయింట్ కి బెయిల్ ఇచ్చేయండి అనే చిన్న డైలాగ్ నే అందుకు ఉదాహరణ. రీసెంట్ గా ఆ ఒక్కటి అడక్కు అంటు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందుకు సంబంధించిన ఒక ఇంటర్వ్యూ లో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. నాకు పెళ్లి మీద ఆశ లేదు. ఒక వేళ అయితే అవ్వచ్చు. కానీ ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలనైతే లేదు. పిల్లలంటే మాత్రం చాలా ఇష్టం. కాబట్టి పిల్లలని పెంచుతాను.కాకపోతే తల్లి బాధ్యతో పాటు తండ్రి బాధ్యత కూడా పిల్లలకి ఉండాలి. ఇద్దరు కలిసే పెంచాలి అని చెప్పింది. ఇప్పుడు ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెళ్లి వద్దంటే ఎలా అంటు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు
ఇక ఆ ఒక్కటి అడక్కు ప్రస్తుతం థియేటర్స్ లో ఉంది. అల్లరి నరేష్ కి జతగా చేసి హిట్ కొట్టింది. ఇద్దరి ఫెయిర్ కి ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు కూడా పడ్డాయి. వల్లి మయిల్ అనే ఒక తమిళ మూవీ కూడా చేస్తుంది. ప్రస్తుతం అది పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. మరి కొన్ని భారీ ప్రాజెక్ట్స్ కూడా చర్చల దశలో ఉన్నాయి. తను పక్కా హైదరాబాదీ. వయసు పాతిక సంవత్సరాలు