Pushpa2 : ‘పుష్ప2’ క్లైమాక్స్‌ మామూలుగా ఉండదు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప పార్ట్ 1 బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 4, 2024 | 10:30 AMLast Updated on: Jul 04, 2024 | 10:30 AM

Icon Star Allu Arjun And Sukumars Combination Of Pushpa Part 1 Received Good Success At The Box Office

 

 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప పార్ట్ 1 బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. దీంతో.. సీక్వెల్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ సంస్థ. అయితే.. ఆగష్టు 15న రావాల్సిన ఈ సినిమా.. డిసెంబర్‌ 6కి పోస్ట్‌పోన్ అయింది. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కారణంగా వాయిదా పడిందని మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం పుష్ప 2 చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.

హైదరాబాద్‌లో వేసిన ప్రత్యేకమైన సెట్‌లో అల్లు అర్జున్ పాల్గొనగా.. కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారని తెలిసింది. ఈ షెడ్యూల్‌లో ఓ భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ను ప్లాన్‌ చేశారని, ఈ యాక్షన్‌ సీక్వెన్స్‌ క్లైమాక్స్‌లో రానుందని సమాచారం. ఇంటర్వెల్‌కే పునకాలు తెప్పించడానికి రెడీ అవుతున్న సుకుమార్.. క్లైమాక్స్‌తో గూస్ బంప్స్ గ్యారెంటీ అనేలా ప్లాన్ చేస్తున్నాడు.

ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్ విలన్‌గా కనిపించనున్నాడు. క్లైమాక్స్‌లో ఈ ఇద్దరి పై వచ్చే సీక్వెన్స్ మామూలుగా ఉండదని అంటున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో బన్నీ అమ్మవారి గెటప్ హైలెట్‌గా నిలుస్తుందని అంటున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ సినిమా పై అంచనాలు భారీగా పెంచేశాయి. ఖచ్చితంగా ఈ సినిమా వెయ్యి కోట్లు కొల్లగొడుతుందని అంటున్నారు. ముఖ్యంగా బాలీవుడ్‌లో పుష్ప2 పై ఎక్కడా లేని అంచనాలున్నాయి. అసలు.. పార్ట్ 1 తెలుగులో కంటే హిందీలోనే హిట్‌ అయింది. అందుకే.. ఈసారి నార్త్ పై కాస్త గట్టిగానే ఫోకస్ చేస్తున్నారు. ఇప్పటికే భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టుగా చెబుతున్నారు. మరి ఈసారి పుష్పరాజ్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.