ఆయనేమైనా అధ్యక్షుడా..? మంత్రా..? ఎమ్మెల్యేనా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ మధ్య ఏం మాట్లాడినా వార్తైపోతోంది. ఏం చేసినా న్యూసైపోతోంది. ఈ సారి అదే జరిగింది. కాకపోతే ఈ సారి తను ఏం మాట్లాడలేదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 5, 2025 | 08:06 PMLast Updated on: Feb 05, 2025 | 8:06 PM

Icon Star Allu Arjun Has Been Making News Lately

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ మధ్య ఏం మాట్లాడినా వార్తైపోతోంది. ఏం చేసినా న్యూసైపోతోంది. ఈ సారి అదే జరిగింది. కాకపోతే ఈ సారి తను ఏం మాట్లాడలేదు. ఎలాంటి స్టేట్ మెంట్ ఇవ్వలేదు. కాని సోషల్ మీడియాలో ట్రోలింగ్ మాత్రం మామూలుగా లేదు. పుష్ప2 వచ్చింది.. వసూళ్లు తెచ్చింది.. ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. సో పుష్ప గా తన సందడి అయిపోయింది కాబట్టి, తన మీద ట్రోలింగ్ జరగటానికి రీజనేలేదు. కాని బన్నీ మాత్రం అలాంటి రీజన్ ఒకటి జనానికిస్తున్నాడు. కొత్తగా స్పోక్స్ పర్సన్ అంటూ చిత్ర, విచిత్రమైన పని చేస్తున్నాడు. తను ఏం మాట్లాడినా బ్యాడైపోతోంది కాబట్టే, తన బదులు ఇక మీదట, ఒక వ్యక్తి మాట్లాడతాడాట… ఎవరా వ్యక్తి? ఎందుకా వ్యక్తి…? ఇవే ట్రోలింగ్ లో ప్రశ్నల్లా మారిన డౌట్లు. బేసిగ్గా స్పోక్స్ పర్సన్ ఓ పార్టీకి ఉంటాడు. లేదంటే ఏదైనా సంఘానికో, సంస్థకో ఎక్స్ పెక్ట్ చేయొచ్చు…కాని పుష్ప రాజ్ తగ్గేదిలేదుకదా, అందుకే ఎక్కడటం మొదలు పెట్టాడంటూ కామెంట్లు పెరిగాయి. తనేమైనా మంత్రా, ముఖ్యమంత్రా, పార్టీనాయకుడా..? లేదంటే పార్టీని రన్ చేస్తున్నాడా..? ఈ డౌట్లొచ్చేలా బన్నీ విచిత్రమైన నిర్ణయం ట్రోలింగ్ కి కారణమౌతోంది… అదేంటో చూసేయండి.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనని తాను ఎక్కువ ఊహించుకుంటున్నాడా? పుష్ప2 హిట్ తర్వాత 1890 కోట్ల వరకు వసూళ్లొచ్చాయన్నారు. ఇదెంత బ్లాక్ బస్టర్ హిట్టైనా, ఆ వసూళ్ల నెంబర్స్ అన్ని నమ్మలేనివని, ఐటీ రైడ్స్ తోనే తేలిందంటున్నారు. ఇలాంటి టౌంలో బన్నీ చిత్ర, విచిత్రమైన నిర్ణయం అందరిని, అబ్బ ఛా… అనేలా చేస్తోంది. అదే అఫీషియల్ స్పోక్స్ పర్సన్…

బేసిగ్గా స్పోక్స్ పర్సన్ అంటే, ఏదైనా పార్టీ తన విది విధానాలు ప్రెస్ కి చెప్పాలన్నా…. ఏవైనా డౌట్లు జనాలకుంటే, అది మీడియా ద్వారా క్లియర్ చేయాలన్నా,ప్రతీ పార్టీకి కొందరు స్పోక్స్ పర్సన్స్ ఉంటారు. అంటే పార్టీ వాయిస్ ని, అఫీషియల్ గా ఎనౌన్స్ చేస్తారు. ఇంతవరకు మామూలు జనాలకు స్పోక్స్ పర్సన్స్ అంటే ఇలాంటి అభిప్రాయమే ఉంది. కాని అలాంటి స్పోక్స్ పర్సన్ బన్నీ హైర్ చేసుకుంటున్నాడట. అదే విచిత్రం

తనేం పార్టీ రన్ చేయట్లేదు… సంఘమో, సంస్థో నడిపించట్లేదు.. తనో స్టార్ హీరో అంతే.. అలాంటి తనకి ఎందుకు స్పోక్స్ పర్సన్… ఆల్రెడీ హీరోలకి పీర్ ఉంటారు.. మీడియా మీటింగ్స్, ప్రమోషన్స్ వాళ్లే చూసుకుంటారు. అలాంటప్పుడు అదేదో రాజకీయ పార్టీలకున్నట్టు తనకెందుకు స్పోక్స్ పర్సన్..? ఇది కామన్ గా కామన్ మ్యాన్ కి వచ్చే డౌట్…

కాని ఆ డౌటే యాంటీ ఫ్యాన్స్ లేదంటే, అల్లు అర్జున్ అతిని ఇష్టపడని వాళ్లకి, ట్రోలింగ్ చేసే సరుకుగా మారింది. ఐతే బన్నీ స్పోక్స్ పర్సన్ వెనక పెద్ద రీజనే ఉందని తెలుస్తోంది. పుష్ప2 సంధ్యా థియేటర్ ఇన్స్ డెంట్ తర్వాత, తనోక ప్రెస్ మీట్ పెట్టాడు. అక్కడే టంగ్ స్లిప్పయ్యాడు. అదే పెద్ద రచ్చ రచ్చైపోయింది. అబద్దాలు చెప్పి తప్పించుకోబోయిన బన్నీ అన్నారు. తన క్యారెక్టర్ మీదే మచ్చ పడేలా ఆ ప్రెస్ మీట్ తనకే బ్యాడైంది…

దీంతో ఇక మీదట తను సమాజానికి ఏం చెప్పాలన్నా, తన బదులు స్పోక్స్ పర్సనే మాట్లాడుతాడట. అంటే ఇక మీడియా తో ప్రెస్ మీట్లలో బన్నీ మాట్లాడడా..? తను చెప్పాలనుకున్నది ఇన్ స్టాగ్రామ్ లేదంటే ట్విట్టర్ లో కూడా చెప్పొచ్చు.. అలాంటప్పుడు ఎందుకు ఈ స్పోక్స్ పర్సన్… అసలు పార్టీలే పక్కన పెట్టేసే స్పోక్స్ పర్సన్ ఐడియాని, ఓ హీరో ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేయటం వెర్రి పనంటున్నారు.. తను ట్రెండ్ ఫాలో కాడు, క్రియేట్ చేస్తాడనిపించుకునేందుకు ఇలాంటి కొత్త కల్చర్ ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడా? ఇదే నిజమైతే, ట్రోలింగ్ కూడా ఆరేంజ్ లో జరగటంతో ఆశ్చర్యం లేదనక తప్పదు.