pushpa-2 title song : ఇదేం రికార్డు పుష్ప… కనీసం జాలి కూడా లేకుండా
ఐకాన్ స్టార్ (Icon Star) అల్లు అర్జున్ (Allu Arjun) పుష్ప 2 (Pushpa 2) తో ఒక నయా రికార్డుని సృష్టించాడు. ఆల్రెడీ ఇప్పటికే ఎన్నో రికార్డులు తన ఖాతాలో ఉన్నాయనుకోండి.

Icon star Allu Arjun has created a new record with Pushpa 2.
ఐకాన్ స్టార్ (Icon Star) అల్లు అర్జున్ (Allu Arjun) పుష్ప 2 (Pushpa 2) తో ఒక నయా రికార్డుని సృష్టించాడు. ఆల్రెడీ ఇప్పటికే ఎన్నో రికార్డులు తన ఖాతాలో ఉన్నాయనుకోండి. బట్ ఇది మాత్రం వెరీ వెరీ స్పెషల్ రికార్డు. అంతే కాదు తనని ఎందుకు ఐకాన్ స్టార్ అంటారో మరో సారి నిరూపించాడు
మొన్న పుష్ప 2 నుంచి సాంగ్ రిలీజ్ అయ్యింది. పుష్ప.. పుష్ప అనే లిరిక్ తో కూడిన ఆ సాంగ్ ఇప్పుడు వరల్డ్ వైడ్ గా పలు సంచలనాలకు నిలయంగా మారింది. అతి త్వరగా యాభై మిలియన్ వ్యూస్ ని సాధించిన పాటగా నిలిచింది. మొత్తం ఆరు భాషల్లో కలిపి ఆ ఘనతని సాధించింది. అలాగే ఇనిస్టాగ్రమ్ లో కూడా 100 కె రీల్స్ ని సాధించింది. దీన్ని బట్టి బన్నీ మానియా ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. పైగా ఆ రికార్డు అంతటితో ఆగేలా లేదు. మిగతా సాంగ్స్ కోసం కూడా అందరు వెయిట్ చేస్తున్నారు. మరి అవి ఎంతటి రికార్డులు సృష్టిస్తాయో చూడాలి
పుష్ప 2 (Pushpa 2) వరల్డ్ వైడ్ (World Wide) గా అగస్ట్ 15 న విడుదల కానుంది. ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు ఆ రోజు కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. రష్మిక (Rashmika) మందన్న బన్నీ తో జత కట్టగా ఫాహద్ ఫాజిల్, అనసూయ, సునీల్ లాంటి నటులు కీలక పాత్రలని పోషిస్తున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ పుష్ప పార్ట్ వన్ ని మించి ఉండేలా తెరకెక్కిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers) అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.