Allu arju : టాప్ 100 లో నాలుగు అల్లు అర్జున్ వే
ఐకాన్ స్టార్ (Icon Star) అల్లు అర్జున్ (Allu Arjun) నయా మూవీ పుష్ప 2 (Pushpa 2). వరల్డ్ వైడ్ గా ఉన్న అల్లు అర్జున్ ఆర్మీ (Allu Arjun Armory) తో పాటు ప్రేక్షకులు కూడా ఈ మూవీ కోసం ఎంతగానో ఎదురుచుస్తున్నారు.

Icon Star Allu Arjun New Movie Pushpa 2.
ఐకాన్ స్టార్ (Icon Star) అల్లు అర్జున్ (Allu Arjun) నయా మూవీ పుష్ప 2 (Pushpa 2). వరల్డ్ వైడ్ గా ఉన్న అల్లు అర్జున్ ఆర్మీ (Allu Arjun Armory) తో పాటు ప్రేక్షకులు కూడా ఈ మూవీ కోసం ఎంతగానో ఎదురుచుస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ అన్ని షేక్ చేస్తున్నాయి. అంతే కాకుండా సోషల్ మీడియాలో రికార్డు వ్యూస్ ని కూడా సాధిస్తున్నాయి. ఇప్పుడు ఒక భారీ రికార్డు ని పుష్ప తన ఖాతాలో వేసుకున్నాడు.
రీసెంట్ గా పుష్ప కి సంబంధించి సూసేకి సాంగ్ రిలీజ్ అయ్యింది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పాటనే మారుమోగిపోతూ ఉంది. అంతకు ముందు విడుదలైన పుష్ప పుష్ప సాంగ్ కూడా మంది ఆదరణ పొందింది అది ఎంతలా అంటే ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్ టాప్ 100 మ్యూజిక్ వీడియోస్ జాబితాలో ఏకంగా నాలుగు పాటలు పుష్ప 2 (Pushpa 2) లోనివే ఉండేలా సూసేకి సాంగ్ 2వ ప్లేస్ లో, అంగారో 8వ ప్లేస్ లో ఉండగా,పుష్ప పుష్ప హిందీ సాంగ్ 57వ ప్లేస్ లో, ఇదే పాట తెలుగు వెర్షన్ 79వ ప్లేస్ లో నిలిచాయి. ఇలా ఒకే సినిమాకు చెందిన పాటలు టాప్ 100లో చోటు దక్కించుకోవడం ఒక అరుదైన రికార్డు అని చెప్పవచ్చు.
ఇక తెలుగులోనే కాకుండా, ఇతర భాషల్లోను పుష్ప పాటలకి రీల్స్ విపరీతంగా వస్తున్నాయి. బన్నీ తో రష్మిక జోడి కడుతుండగా పుష్ప 1 ని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. సుకుమార్ దర్శకుడు కాగా దేవి శ్రీ ప్రసాద్ (Devi Shri Prasad) సంగీతాన్ని అందిస్తున్నాడు . పార్ట్ 1 లో చేసిన నటులందరూ దాదాపుగా పార్ట్ 2 లో చేస్తున్నారు.మరి మిగతా పాటలు ఇంకెన్ని రికార్డు లు సృష్టిస్తాయో చూడాలి.