పాపం బన్నీ… పగోనికి కూడా రాకూడని కష్టం ఇది…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప2 హిట్టైందన్న సంతోషం దక్కలేదు. పాన్ ఇండియా లెవల్లో వసూళ్ల ఫైరూ తనని కాపాడలేదు. ఇప్పుడు ఇంతగా హిట్లు పడ్డాక కూడా, తనని ఆదుకునే పాన్ ఇండియా డైరెక్టర్ లేడు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప2 హిట్టైందన్న సంతోషం దక్కలేదు. పాన్ ఇండియా లెవల్లో వసూళ్ల ఫైరూ తనని కాపాడలేదు. ఇప్పుడు ఇంతగా హిట్లు పడ్డాక కూడా, తనని ఆదుకునే పాన్ ఇండియా డైరెక్టర్ లేడు. ఈలోపు దేశం లో ఎక్కడ తొక్కిసలాట జరిగినా, బన్నీ పేరు వినిపించకుండా ఉండట్లేదు. ఎటుచూసినా దరిద్రాలే… అసలెందుకు సంధ్యా థియేటర్ కి వెళ్లానా అని , బన్నీ జీవితాంతం బాధపడేలా పరిస్థితులు పగ పట్టాయి. తిరుపతిలో తొక్కిసలాట జరగ్గానే అక్కడ బన్నీ పేరే వినిపించింది. గేమ్ ఛేంజర్ ఈవెంట్ రోజు ఇద్దరు చనిపోతే అల్లు అర్జున్ పేరే న్యూస్ లో నానింది. అంటే ఇక మీదట తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ తొక్కిసలాట జరిగినా తన పేరు రీ సౌండ్ చేయాల్సిందేనా? ఈ బాదతోనే తను కోలుకోలేకపోతుంటే, తనకి అందుబాటులో ఒక్కరంటే ఒక్క పాన్ ఇండియా డైరెక్టర్ లేడు… ఎందుకు తన కర్మ ఇలా ఉంది? ఇది సోషల్ మీడియాలో సానుభూతితో భయపెడుతున్న కామెంట్ల దాడి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎందుకు పుష్ప2 తో హిట్ కొట్టానా అని బాధపడాల్సిన పరిస్థితి… అసలు ఎందుకు సంధ్యా తియేటర్ కి వెళ్లాను అని రోజు తలుచుకుని బాధపడే దుస్తితీ… పగొడికి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడాదనేంతగా తన లైఫ్ మారిపోయింది. అంతగా ఇప్పుడేమైంది, అంతా కూల్ అయిపోయిందిగా అనొచ్చు.. కాని ఏది కూల్ కాలేదు.తన పరిస్తితి ఇక మారేలా లేదు. ఎందుకంటే గేమ్ ఛేంజర్ ఈవెంట్ టైంలో ఇద్దరు చనిపోతే, బన్నీ పేరుమారుమోగింది. ఇప్పుడు తిరుపతి లో తొక్కసలాట జరగటంతో అక్కడ కూడా బన్నీ పేరే వినిపిస్తోంది. రెండురోజులుగా రెండు పార్టీలు బన్నీ నామస్మరణతో, ఐకాన్ స్టార్ ని ఇంకా ఇంకా కుంగిపోయేలా చేస్తున్నారని అంటున్నారు.
మూవీ కోసం 3 ఏళ్ల కష్టపడితే హిట్ పడింది కాబట్టి సంతోషం. కాని ఆ సంతోషం ఒక్కవారం కూడా లేదు. సంధ్య థియేటర్ లో తొక్కిసలాటలో మహిళ మరనం, తన కొడుకు హాస్పిటల్ లో ఉండటం, తర్వాత బన్నీ జైలుకెళ్లాల్సి రావటంకట్ చేస్తే బన్నీదే తప్పని సొసైటీ నుంచి కూడా కామెంట్లు పెరిగాయి… తర్వాత 2 కోట్లు ఎనౌన్స్ చేసినా, జరగాల్సిన డ్యామేజ్ జరగింది. కేసు కోర్టులో ఉంది కాబట్టి ఎవరిది తప్పు, ఇంకెవరిది ఒప్పనే నిర్ణయానికి ఎవరూ రాలేదు.
కాని దేశం లో ఎక్కడ తొక్కిసలాట జరిగినా, ఇంకెక్కడ తొక్కిసలాటలో జనం చనిపోయినా, అక్కడ బన్నీ నామస్మరణ కామనైంది. అక్కడ అలా జరిగితే, ఇలా అరెస్ట్ చేశారు. కాబట్టి బన్నీని అరెస్ట్ చేసినట్టే వాళ్లని జైలుకి పంపండన్నారుగేమ్ ఛేంజర్ ఈవెంట్ టైంలో చనిపోయిన ఇద్దరి విషయంలో ఇవే మాటలు వినిపించాయి. చరణ్ ని ఎందుకు వదిలేశారని కొందరు. అసలు సంధ్య తియేటర్ కి గేమ్ ఛేంజర్ ఈవెంట్ కి పోలికే లేదని ఇంకొదరు ఇలా సోషల్ మీడియా వార్ జరిగింది.
ఇప్పుడు తిరుపతి తొక్కిసలాట వరకొచ్చేసరికి ఏపీ ప్రభుత్వం, విపక్షం ఇద్దరి మధ్య బన్నీ పేరు నలిగే పరిస్థితొచ్చింది. సరే ఇవన్నీ వదిలేసి సినిమాతో బిజీ అవుదామా అంటే అందుబాటులో సుకుమార్ లేడు. తను చరన్ కి కమిటయ్యాడు. ప్రశాంత్ నీల్ ని ట్రై చేద్దామంటే, తను డ్రాగన్ తర్వాత సలార్ 2 అంటూ రెండేళ్లు బిజీ, రాజమౌలి నుంచి ఆఫర్ కాని పని… ఇక నెల్సన్ దిలీప్ రజినీకాంత్ తర్వాత ఎన్టీఆర్ తో మూవీ కి కమిటైతే, సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ ఆతర్వాత యానిమల్ పార్క్ అని మూడేళ్ళు అటే బిజీ అయ్యేలా ఉన్నాడు
సో బన్నీకి పాన్ ఇండియా డైరెక్టర్స్ ఎవరూ అందుబాటులో లేరు. అందుకే బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలిని కలిశాడు. ముంబై లో సంజయ్ లీలా భన్సాలిని గత ఏడాదే కలిసిన బన్నీ, ఇప్పుడు మళ్లీ కలవటంతో, తనతో సినిమా ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు. ఐతే త్రివిక్రమ్ తో అనుకున్న కథ పట్టాలెక్కుతుందోలేదో తేలలేదు. అసలు త్రివిక్రమ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ భారం మోసే సీన్ కనిపించట్లేదు. అలాని సంజయ్ లీలా భన్సాలి తోపాఅంటే, గ్రాండియర్ గా సినిమాలు తీస్తాడు కాని, తనకి మూడు ఫ్లాపులు పడితేఒక్క హిట్ రావటం కష్టం..సో ఎలా చూసినా బన్నీకి ముందునుయ్యి వెనక గొయ్యి సిచ్చువేషనే