ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరులో మార్పు.. కొత్త పేరు ఏంటో తెలుసా..?
అల్లు అర్జున్ పేరు మార్చుకున్నాడా..? సోషల్ మీడియాలో బాగా జోరుగా జరుగుతున్న చర్చ ఇది. పుష్ప లాంటి సెన్సేషనల్ సినిమా తర్వాత దేశం మొత్తం పాపులర్ అయిపోయాడు ఐకాన్ స్టార్.

అల్లు అర్జున్ పేరు మార్చుకున్నాడా..? సోషల్ మీడియాలో బాగా జోరుగా జరుగుతున్న చర్చ ఇది. పుష్ప లాంటి సెన్సేషనల్ సినిమా తర్వాత దేశం మొత్తం పాపులర్ అయిపోయాడు ఐకాన్ స్టార్. అయితే ఆ సినిమా ఎంత పెద్ద విజయం సాధించినా వివాదాలు కూడా అదే రేంజ్ లో అయ్యాయి. దాంతో బాగా డిస్టర్బ్ అయ్యాడు అల్లు అర్జున్. సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ వచ్చినా కూడా మనస్ఫూర్తిగా ఆ సక్సెస్ ఎంజాయ్ చేయలేకపోయాడు. అన్నింటికీ మించి జైలుకు కూడా వెళ్లొచ్చాడు ఐకాన్ స్టార్. వీటన్నింటితో బాగా డిస్టర్బ్ అయిన అల్లు అర్జున్ తన పేరును మార్చుకుంటున్నట్టు తెలుస్తుంది. పేరు మార్చుకోవడం అంటే మొత్తం పేరు కాదు.. తన పేరులో ఉన్న స్పెల్లింగ్ లో మరో రెండు కొత్త అక్షరాలు యాడ్ చేసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతుంది. సోషల్ మీడియాలో బాగా జరుగుతున్న చర్చ ఇది. అయినా పేరులో ఏముంది.. మనకు రాసిపెట్టుండాలి గానీ అనుకుంటారు కొందరు. కానీ పేరులోనే అంతా ఉందని నమ్ముతుంటారు మరికొందరు.
మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఈ సెంటిమెంట్ ఇంకాస్త ఎక్కువే. అందుకే ఉన్న పేర్లు కాదని.. కొత్త పేర్లు పెట్టుకుంటుంటారు మన సెలబ్రిటీలు. అది హీరోయిన్లు కావచ్చు హీరోలు కావచ్చు.. తమకు కలిసొచ్చేలా పేరు మార్చుకుంటూ ఉంటారు. నేమ్ ఛేంజ్ అయితే ఫేట్ మారుతుందా అంటే మారుతుంది అని వాళ్ళు బలంగా నమ్ముతున్నారు. అందుకే అల్లు అర్జున్ కూడా తన పేరులో అదనంగా U,N అనే అక్షరాలు జోడించుకోబోతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ అంటే Allu Arjun అని స్పెల్లింగ్ రాస్తున్నారు. కానీ ఇకపై Alluu Arjunn అని రాసేలా తన పేరులో కొన్ని మార్పులు చేసుకుంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదేమీ అంత పెద్ద విషయం కాదు ఎందుకంటే.. సినిమా ఇండస్ట్రీలో పేరు మార్చుకోవడం అనేది చాలా కామన్ థింగ్. కాకపోతే మొదట్లోనే నేమ్ ఛేంజ్ చేసుకుంటారు చాలా మంది. కానీ కొందరు మాత్రం ఇండస్ట్రీకి వచ్చాక.. గుర్తింపు తెచ్చుకున్నాక పేరు మార్చేస్తుంటారు. ఈ బ్యాచ్‌లోనే చేరిపోవాలని చూస్తున్నాడు బన్నీ.
మొన్నామధ్య పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరీ కూడా తన పేరును ఆకాశ్ జగన్నాథ్‌గా మార్చుకున్నాడు. చైల్డ్ ఆర్టిస్టుగా పరిచయమైన ఆకాశ్ పూరీ.. మెహబూబాతో హీరో అయ్యాడు. రొమాంటిక్, ఛోర్ బజార్ లాంటి సినిమాలు చేసినా లక్ కలిసి రాలేదు. దాంతో ఆకాశ్ పూరీ నుంచి ఆకాశ్ జగన్నాథ్‌గా తన పేరు మార్చుకుంటున్నట్లు ప్రకటించాడు. పేరు మార్చుకున్న తర్వాత అయినా తన ఫేట్ మారుతుందని ఆశగా ఎదురు చూస్తున్నాడు ఆకాష్. ఈ మధ్యే సాయి ధరమ్ తేజ్ సైతం తన పేరు సాయి దుర్గ తేజ్‌గా మార్చుకున్నారు. అమ్మ పేరు దుర్గ కావడంతో.. ఆ పేరును తన పేరులో చేర్చుకున్నారు. ఆల్రెడీ సాయి ధరమ్ తేజ్‌గా ఉన్న తన పేరును సాయి తేజ్‌గా మార్చుకున్న మెగా మేనల్లుడు.. మరో మార్పు చేసి సాయి దుర్గ తేజ అయ్యాడు. నితిన్ కూడా తన పేరులోని స్పెల్లింగ్ మార్చుకున్నాడు. మామూలుగా అయితే నితిన్ అంటే Nithin అని రాస్తారు.. కానీ Nithiin అంటూ ఒక I ని అదనంగా తన పేరులో చేర్చుకున్నాడు నితిన్.
అలాగే జెనీలియాతో కథ సినిమా చేసిన ఆదిత్.. ఈ మధ్య తన పేరును త్రిగున్ అంటూ మార్చుకున్నాడు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కెరీర్ మొదట్లోనే తన పేరు మార్చుకున్నాడు. రామ్ చరణ్ తేజగా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ హీరో.. తర్వాత తన పేరు నుంచి తేజ తీసేసాడు. కేవలం రామ్ చరణ్ గానే సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు వీళ్ళ లిస్టులోనే అల్లు అర్జున్ కూడా చేరిపోవాలని చూస్తున్నాడు. తన పేరులో అదనంగా మరో రెండు అక్షరాలు జోడించుకోబోతున్నాడు. మరి ఈ అక్షరాలు చేర్చుకున్న తర్వాత బన్నీ కెరీర్ ఇంకా ఎంత ఎత్తుకు పెరుగుతుందో చూడాలి.